అంతర్జాతీయ టీ20లలో సరికొత్త ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. క్రొయేషియా ఆల్‌రౌండర్ కనోర్ కరోల్ పేరు పొట్టి క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా 23 ఏళ్ల కరోల్ నిలిచాడు.అరంగేట్రంలోనే మెరుపులు..టీ20 ప్రపంచకప్-2028 రీజినల్ యూరోప్ క్వాలిఫయర్-‘ఎ’లో భాగంగా కనోర్ కరోల్ (Connor Carroll).. ఫ్రాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్రొయేషియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 34 బంతుల్లో 71 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఈ మ్యాచ్‌లో క్రొయేషియా ఓడిపోయింది.విధ్వంసకర భారీ శతకంఇక తన రెండో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై కరోల్ ఆకాశమే హద్దుగా చెలరేగి... భారీ శతకం సాధించాడు. కేవలం 72 బంతుల్లోనే 150 పరుగులు రాబట్టాడు. ఇందులో 10 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి. కరోల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా క్రొయేషియా 199 పరుగులు చేయగలిగింది.లక్ష్య ఛేదనకు దిగిన స్విట్జర్లాండ్ క్రొయేషియా చేతిలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఫ్ స్పిన్నర్ అయిన కరోల్ ఈ మ్యాచ్ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ వికెట్ కూడా తీశాడు. తాజాగా తన మూడో మ్యాచ్‌లో భాగంగా జెర్సీ జట్టుపై 31 బంతుల్లో 74 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డుకానీ జెర్సీ (ఐలాండ్) విధించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో క్రొయేషియా విఫలమైంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా కరోల్ మాత్రం ప్రపంచ రికార్డు సాధించాడు. ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో కలిపి అత్యధికంగా 295 పరుగులు (సగటు 147.50, స్ట్రైక్‌రేటు 215.32) రాబట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.అంతకు ముందు ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన గుస్తవ్ మెకాన్ పేరిట ఉండేది. అతడు తన దేశం తరఫున తొలి మూడు టీ20లలో కలిపి 286 పరుగులు సాధించాడు. తాజాగా కనోర్ కరోల్ గుస్తవ్ను అధిగమించాడు. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు