breaking news
Commuter train
-
దూసుకుపోయిన రైలు.. భారీ ప్రమాదం!
-
స్టేషన్లోకి దూసుకుపోయిన రైలు.. భారీ ప్రమాదం!
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో గురువారం ఉదయం భారీ రైలుప్రమాదం జరిగింది. న్యూజెర్సీలోని హోబోకెన్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కూడిన ఓ రైలు క్రాష్ అయి టెర్మినల్‌లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా.. సుమారు వందమంది గాయపడ్డారని తెలుస్తోంది. రైల్వే స్టేషన్లో తీవ్రస్థాయిలో విధ్వంసాన్ని మిగిల్చిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ప్రయాణికులు ఆన్లైన్లో పోస్టు చేశారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, రైలు జరిపిన విధ్వంసంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఫొటోలను బట్టి రైల్వేస్టేషన్లో భారీ ఎత్తున నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్వేస్టేషన్లో రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంత పరిచింది. -
రెండు రైళ్లు ఢీ: 40 మందికి గాయాలు
రియోడిజనీరో : బ్రెజిల్ రియోడిజనీరో రాష్ట్రంలో రెండు లోకల్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మెస్కెట్టా పట్టణంలోని రైల్వే స్టేషన్లో రైలు ఆగి ఉంది. అదే ట్రాక్‌పైకి మరో రైలు వచ్చి ఆగి ఉన్న రైలును ఢీ కొట్టింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.