breaking news
Commissioner GHMC b. Janardhan Reddy
-
ఉద్యమంలా క్లీన్ సిటీ..
పరిశుభ్ర గ్రేటరే లక్ష్యం అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి ‘సాక్షి’ జనసభలో గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉప్పల్: గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరం మొత్తం పరిశుభ్రంగా ఉండాలంటే ‘క్లీన్ సిటీ’ కార్యక్రమం ఉద్యమంలా నిరంతరం సాగాల్సిన అవశ్యకత ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప్పల్‌లోని మేకల జంగారెడ్డి గార్డెన్లో నిర్వహించిన జనసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులను, వారి పనితీరును క్షేత్రస్థాయిలో అందరికి తెలియచేసే నిమిత్తం పరిచయ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైనేజీ, త్రాగునీరు, కాలుష్యం, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు వంటి సమస్యలన్నింటినీ నిరంతరం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే పరిష్కరించగలుగుతామని స్పష్టం చేశారు. నగరంలో ఈ నెల 6వ తేదీన 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల బీభత్సం ప్రకృతి వైపరీత్యమన్నారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ పనులు ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం, ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా తవ్వకాలు, రోడ్ల డ్యామేజ్ వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులమంతా ప్రతి నెల మొదటి శనివారం సమన్వయ సమావేశాన్ని ఏర్పాటుచేసుకొని సమస్యల పరిష్కారంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వాట్సప్ గ్రూపును, వెబ్ పోర్టల్‌ను ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. నెల రోజుల్లోనే మూడు, నాలుగు సార్లు ప్రకృతి వైపరిత్యాలు చోటుచేసుకున్నాయని, రెండుసార్లు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో చెట్లు కూలడం, విద్యుత్ తీగలు తెగడం వంటివి జరిగాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు 100 నెంబరు ఫోన్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఉప్పల్‌లో తై బజారు కాంట్రాక్టు రద్దు విషయమై చర్చించి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తామని అన్నారు. నగరంలో ప్రతిరోజు ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతుందని, దీనిని ఎలా తగ్గించుకోవాలో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కిచెన్లలో తడి, పొడి చెత్తకు పెళ్లి చేస్తున్నారని, అలా కాకుండా వేరు చేయాలని సూచించారు. తద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసుకోవచ్చని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. తడి పొడి చెత్త సేరకణ, రీసైక్లింగ్ కార్యక్రమం ఒక డివిజన్ నుండి ప్రారంభమై గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో ఉద్యమంలా సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉప్పల్‌లో రహదారి వెడల్పుకు భూ సేకరణ, నష్ట పరిహారం వంటి సమస్యలున్నాయని, త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రానున్న వర్షాకాలంలో హరితహారంను పెద్దఎత్తున చేపడుతామని, వేర్లు భూమి లోపలికి వెళ్లే చెట్లను నాటుతామని తెలిపారు. ఉప్పల్ భగాయత్ రైతుల భూ సమస్యను త్వరలోనే పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనలా హన్మంత్‌రెడ్డిలు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఉప్పల్ సర్కిల్ డీసీ విజయకృష్ణ, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 500 ఎకరాలు
రెవెన్యూ అధికారుల సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 500 ఎకరాల ప్రభుత్వస్థలాల్ని వెంటనే గుర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ అధికారులను కోరారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే గుర్తించిన 20 ప్రాంతాల్లో రెండు ప్రాంతాలు మాత్రమే జీహెచ్ఎంసీకి అప్పగించారని, ఎలాంటి వివాదాలు లేని మరో 11 ప్రాంతాలను వెంటనే జీహెచ్ఎంసీకి బదలాయించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. ఇళ్లనిర్మాణానికి అవసరమైన భూసేకరణపై శనివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆర్డీఓలు, తహశీల్దార్లతో జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూముల్ని త్వరితగతిన సేకరించి జీహెచ్ఎంసీకీ అప్పగించాలని కోరారు. నగరంలో 1466 నోటిఫైడ్ స్లమ్స్ ఉండగా, దాదాపు రెండు లక్షల మందికి ఇళ్లులేవని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలి పారు. జీహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. నగరంలో నైట్‌షెల్టర్లు, పార్కులు, చెత్త రవాణా కేంద్రాలు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి కూడా భూముల్ని గుర్తించాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయాల వారీ గా తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. సోమవారం రాజేంద్రనగర్, మంగళవారం సరూర్‌నగర్, శుక్రవారం మల్కాజిగిరి ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహిం చే ఈసమావేశాలకు జీహెచ్ఎంసీ అధికారులు హాజరు కావాలని కోరారు. సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం, హైదరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివకుమార్‌నాయుడు, భాస్కరాచారి, తదితరులు పాల్గొన్నారు.