breaking news
Commercial Tax Officers
-
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు.. 66 శాతం మంది వారే!
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలోపే ఫలితాలను విడుదల చేసి రికార్డు నెలకొల్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. ఈసారి ఫలితాల్లో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. జనరల్ మెరిట్ టాప్ -10లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఇక టాప్-50లో 25 మంది, టాప్-100లో 41 మంది మహిళలు ఉన్నారు.గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా ప్రాతినిథ్యం పెరుగుతూ వస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో మహిళా అధికారుల సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా వెల్లడైన గ్రూప్-1 ఫలితాల (Group 1 Results) ఆధారంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు కొత్తగా కేటాయించిన ఉద్యోగుల్లో 66 శాతం మంది మహిళలు ఉన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లుగా జీఎస్టీ (GST) సంబంధిత వ్యవహారాలను వీరు పర్యవేక్షిస్తారు.48 మందిలో 31 మంది వారే!తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో ప్రస్తుతం 8 మంది మహిళా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (commercial tax officers) ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతోందని సీనియర్ అధికారి కె. హరిత తెలిపారు. 1990 ప్రాంతంలో తన బ్యాచ్‌లో తానొక్కరే మహిళా సీటీవోగా ఉన్నానని గుర్తు చేసుకున్నారామె. తాజాగా ప్రభుత్వం 48 మందిని సీటీవోలుగా నియమించగా, వీరిలో 31 మంది మహిళలు ఉండటం విశేషం.కీలక పోస్టుల్లో 24 మందికమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల సహా 34 కీలక పోస్టులు ఉన్నాయి. వీటిల్లో 24 మహిళలు ఉన్నారు. 1996లో 8 మంది మహిళలు ఈ విభాగంలో చేరారు. అప్పటి నుంచి క్రమంగా మహిళా ఉన్నతోద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. దీంతో తెలంగాణ వాణిజ్య విభాగంలో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుని తమదైన ముద్ర వేయడానికి అవకాశాలు ఏర్పడ్డాయి.కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి మెరుగైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరమని సీనియర్ మహిళా అధికారి ఒకరు అన్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించిన నియమ నిబంధనలు తరచు మారుతుంటాయని, దానికి అనుగుణంగా ఉద్యోగులు అప్డేట్ కావాల్సి ఉంటుందని వివరించారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితాన్ని బాలెన్స్ చేసేవిధంగా ఉండడం వల్లే ఎక్కువ మంది మహిళలు ఈ వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారని వెల్లడించారు.చదవండి: ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహిళగతంలో వాణిజ్య పన్ను శాఖ కమిషనర్లుగా పనిచేసిన టికె శ్రీదేవి, నీతు ప్రసాద్ (Neetu Prasad) వంటి అధికారులు మహిళా శక్తిని చాటిచెప్పారు. సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం చెలాయించే ఉన్నత ఉద్యోగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని చెప్పడానికి వాణిజ్య పన్నుల విభాగం నిదర్శనంగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బంపర్ ఆఫర్.. పట్టిస్తే పది లక్షలు మీవే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పన్ను వసూళ్లలో పురోగతి కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పన్ను ఎగవేతదారులను పట్టిస్తే రూ. 10 లక్షల వరకు బహుమానం ఇస్తామని ప్రకటించింది. అధికారులకు కనీసం సమాచారం ఇచ్చినా తగిన బహుమతి అందుకోవచ్చని వెల్లడించింది. ఇందుకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ కార్యదర్శి జ్యోతి నిర్మలస్వామి ఓ జీఓను ఇటీవల విడుదల చేశారు. ప్రోత్సాహకాలకు ప్రత్యేక నిధి పన్నులు ఎగవేసేవారి గురించి సమాచారం ఇచ్చేవారికి బహుమానం, ఇతర ఖర్చుల కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి వాణిజ్యపన్నుల శాఖకు రూ.1.65 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి మూర్తి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. ఇందులో చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.. పన్ను ఎగవేసిన వారి గురించి అందిన సమాచారం ఆధారంగా రూ.లక్షకు పైగా వసూలైతే ఆ మొత్తం నుంచి 10 శాతం బహుమతిగా ఇస్తారు. పన్ను చెల్లింపులో చోటుచేసుకున్న జాప్యాన్ని బట్టీ సదరు మొత్తంలో 5 శాతం లేదా రూ.10 వేలు బహుమానంగా ఇస్తారు. రూ.4 లక్షలకు పైగా పన్ను బకాయి పడిన వారి సమాచారం ఇచ్చే వ్యక్తి లేదా బృందానికి ప్రభుత్వ అంగీకారంపై 10 శాతాన్ని బహుమతి పొందుతారు. ప్రభుత్వ సిబ్బందే సమాచారం ఇచ్చినట్లయితే రూ.లక్ష అనే పరిమితి లేకుండా బహుమానం ఉంటుంది. సమాచారం ఇచ్చిన అ«ధికారి ఇలా రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బహుమతి పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం చెన్నై జోన్– 1, జోన్– 2, తిరుచ్చిరాపల్లి, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూరు, సేలం, వేలూరు తదితర జిల్లాల్లోని వాణిజ్యపన్నులశాఖకు అవసరమైన నిధులు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. సమాచారం ఇచ్చే సిబ్బందికి రూ.62 లక్షలు, అధికారులైతే రూ.1.04 కోట్లు నుంచి రూ.1.66 కోట్ల వరకు నిధులు బహుమానం నిమిత్తం కేటాయించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని 2022–23 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నులశాఖకు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు -
మాకు ఈ ఖర్మేంటి?!
సాక్షి, అమరావతి: బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వాణిజ్య శాఖ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. గతేడాది జీఎస్టీ అమలుకు ఇబ్బందులొస్తాయని భావించిన ప్రభుత్వం వీరి బదిలీలను నిలిపివేసింది. ఈ ఏడాదైనా బదిలీలు చేస్తారు కదా అని ఎదురుచూస్తున్న వారు.. సాధారణ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా పరిమితులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పరస్పర అంగీకారం, రిక్వెస్ట్ బదీలకు మాత్రమే అనుమతిస్తూ జీవో ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ! వాణిజ్య శాఖలో 557 గెజిటెడ్ ఆఫీసర్లు, 102 సర్కిల్స్‌లోని సిబ్బందిలో 80 శాతం మందికిపైగా ఉద్యోగులు అయిదేళ్లు దాటినా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇలా ఒకే వ్యక్తి ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తే డీలర్లతో పరిచయాలు పెరిగి అది వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖర్చులు టీఏ, డీఏ ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటు పిల్లల చదువుల పరంగా, ఇటు ఆర్థికంగా నష్టపోతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగ సంఘం చెబుతోంది. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి బదిలీ అయి, పిల్లల చదువుల కోసం చాలామంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కానీ గడిచిన నాలుగేళ్లుగా 20 శాతానికి మించి ఉద్యోగులకు బదిలీలు చేయకపోవడం, గతేడాది అసలు పూర్తిగా లేకపోవడంతో వీరు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు ఎక్కువని, అలాగే అమరావతి పరిధిలో పనిచేసే వారికి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) అదనంగా లభిస్తుందని.. అయితే గ్రామీణ ప్రాంతంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు. ఆర్థిక మంత్రిని కలుస్తాం.. వాణిజ్య శాఖలో సాధారణ బదిలీలకు అనుమతించాలని త్వరలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆల్ ఇండియా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ బదిలీలకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
సిఐడి అదుపులో కీలక సూత్రధారి
-
సేల్స్‌ట్యాక్స్ అక్రమ అధికారులపై సీఐడీ నజర్
⇒ ఏడుగురిపై విచారణ ప్రారంభం ⇒ నిందితుల అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు లేఖలు సాక్షి, హైదరాబాద్: సేల్స్ ట్యాక్స్‌ను అప్పనంగా సొంత ఖాతాల్లోకి మళ్లించిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై సీఐడీ సోమవారం విచారణ ప్రారంభించింది. 2012–13, 2013–14 సంవత్సరాల్లో బోధన్‌లోని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తమ పరిధిలో ఉన్న రైసుమిల్లుల నుంచి 5 శాతం సేల్స్ ట్యాక్స్ వసూలు చేసి.. సర్కార్ ట్రెజరీలో డిపాజిట్ చేయకుండా రూ. 60 కోట్ల మేర గండి కొట్టినట్టు సీఐడీ ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇందులో భాగంగా నలుగురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులపై సీఐడీ దృష్టి సారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురి బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని సీఐడీ బ్యాంకులకు లేఖలు రాసింది. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల ప్రాథమిక విచారణలో కొన్ని నకిలీ చలాన్లు బయటపడ్డాయని, అయితే అది ప్రాథమికంగా రూ. 60 కోట్లుగా తేలిందని, స్కాం జరిగిన రెండేళ్లతో పాటు ఆ తర్వాత ఏడాదినీ పరిశీలించాల్సి ఉందని సీఐడీ అధికారులు తెలిపారు. స్కాం విలువ రూ.100 కోట్లు దాటినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.