శ్రీవారి పుష్కరిణికి మోక్షం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి పుష్కరిణికి ఆలయ అధికారులు మోక్షం కలిగించారు. చెత్తాచెదారం, మురుగు పేరుకుపోయి భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలులేనంతగా తయారైన పుష్కరిణి దుస్థితిపై ఈనెల 20న ‘సాక్షి’లో ’శ్రీవారి పుష్కరిణికి ఏమిగతి’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. పుష్కరిణిని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా శనివారం పుష్కరిణి ఒడ్డున పేరుకుపోయిన చెత్తాచెదారం, కోనేరు గట్లపై ఉన్న ముళ్ల చెట్లను తొలగించారు. మెట్లదారిని, పరిసరాలను శుభ్రం చేశారు. పుష్కరిణి పవిత్రతను కాపాడేందుకు, శుభ్రంగా ఉం చేందుకు స్థానికులు సహకరించాలని ఆల య ఈవో వేండ్ర త్రినాథరావు కోరారు. స్నానాలకు వీలుగా బోరు నీటిని పుష్కరిణిలోకి తోడుతున్నామని చెప్పారు.