breaking news
clay pots
-
గట్ హెల్త్ కోసం..టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్ పాత్రలు
వాతావరణం మారుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన కిచెన్ కూడా తనను తాను మార్చుకుంటుంది. వంట పాత్రలు కూడా మారాలంటున్నాయి అధ్యయనాలు. పదార్థాలు ఎక్కువ సేపు నిలవ ఉండాలంటే, పోషకాలను కోల్పోకుండా, రుచి మారకుండా ఉంచే పాత్రల్లోనే వండాలి. ఈ గుణాలున్నవి మట్టి పాత్రలే. వండడానికి మాత్రమే కాదు, భోజనాల తర్వాత మిగిలిన పదార్థాలను మరుసటి రోజుకు నిల్వ చేయడానికి కూడా మట్టి పాత్రలను మించిన పాత్ర మరొకటి ఉండదని తాజా పరిశోధన. మట్టి మంచిదేనంటున్నాయి అధ్యయనాలు. స్టీలు, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేసిన పదార్థాలు ఆవిరిపట్టడం, అనారోగ్యకరమైన రసాయన చర్యలకు లోనుకావడం సహజం. మట్టిపాత్రలకు ఉండే సహజమైన రంధ్రాల ద్వారా గాలి ప్రసరిస్తుంది. పదార్థాలు ఎటువంటి మార్పులకూ లోనుకావని ఈజిప్టు పరిశోధన బృందం వెల్లడించింది. పైగా మట్టి సహజంగానే క్షారగుణం ఉంటుంది. ఇది ఆహారపదార్థాల్లోని ఆమ్లగుణాలను క్రమబద్ధీకరిస్తుంది. పీహెచ్ స్థాయులు జీర్ణక్రియకు తగిన మోతాదులో ఉండేలా మారుస్తుంది మట్టిపాత్ర. దీంతో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ కోసం ప్రపంచం పరిశోధనలు చేస్తోంది. మన సంప్రదాయ జీవనశైలి గట్ హెల్త్‌ను పరిరక్షించేదని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. మట్టిపాత్రల్లో వండడం వల్ల మట్టిలో సహజంగా ఉండే మినరల్స్ పదార్థాలకు తోడవుతాయి. ‘మట్టిపాత్ర టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్’ అనే ట్యాగ్ లైన్‌తో మోడరన్ కిచెన్, డైనింగ్ టేబుల్ మీద మట్టిపాత్రలు రాజ్యమేలనున్నాయి.మంచినీటి కోసం మట్టికుండలు మోడరన్ కిచెన్‌లోకి మట్టికుండలు వచ్చాయి. తాజా అధ్యయనం ప్రకారం పదార్థాలను మట్టిపాత్రల్లో నిల్వ చేస్తే ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇకపై ఫ్రిజ్ ఇంట్లో అలంకార వస్తువుగా మారే రోజు కూడా రావచ్చు. ఆయుర్వేదం– ఆధునిక శాస్త్రం రెండూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయమిది.(Health Tip ఫ్యాటీ లివర్‌కు బొప్పాయితో చెక్)మృణ్మయం– ఆరోగ్యమయంపృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశము’ ఇవి పంచమహాభూతాలు. వీటిలో భూమిదే ప్రథమస్థానం. చరాచర జీవరాశులకివే ఆయువుపట్టు. భూమి అంటేనే మట్టిమయం. కణాల పరిమాణాన్ని బట్టి ఇది ప్రధానంగా మూడు రకాలు. ఇసుక, ఒండ్రు, బంకమట్టి. మనం వాడే మట్టి పాత్రలకు ప్రధాన భూమిక ఒండ్రుమట్టి. అనాదిగా వస్తున్న ఆయుర్వేద శాస్త్రంలో మట్టి పాత్రల వాడకానికి మంచి విశిష్టత ఉంది. త్రాగునీరు సహజసిద్ధంగా చల్లబడాలన్నా, ఔషధాలు తయారు చేయాలన్నా, పుటాలు పెట్టాలన్నా, ఆహార ద్రవ్యాలు నిల్వ చేయాలన్నా కుండలు, మూకుడు వంటి మూతలు, వివిధ రూ పాల్లో తయారు చేసిన మట్టిపాత్రలనే వాడేవారు. ఇవి నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడతాయి. మట్టిలో సహజంగా నిక్షిప్తమైన ఖనిజాలు కొన్ని రకాల సూక్ష్మ క్రిములు మనిషి ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు. వండిన పదార్థాలను పూర్వీకులు ‘ఉట్టి’లో పెట్టి వేలాడ దీసేవారు. ఆ ఉట్టిలో మట్టి పాత్రలను పెట్టేవారు. ఈ పాత్రల ఉపరితలంలోని సూక్ష్మరంధ్రాల ద్వారా పర్యావరణంతో అనుబంధమై వాటిలో ఉంచిన పదార్థాలుపాడవకుండా సహజస్థితిలోనే ఉంటాయి. ఇప్పటికీ ఉత్తరాదిలో మట్టి పాత్రలలో తేనీరు తాగే ఆచారం ఉంది. నేటి సమాజం మరలా నాటి సంప్రదాయాలకు మొగ్గుచూపడం హర్షణీయం. ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి -
వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!
ఖిలా వరంగల్ : పూర్వం రోజుల్లో వంటలకు మట్టి పాత్రలనే వాడే వారు. అన్నం, కూర, పాలు, పెరుగు.. ఇలా ప్రతీ పదార్థం మట్టి కుండలోనే వండేవారు, భద్రపరిచేవారు. ఈ పాత్రల్లో వండిన, భోజనం చేసిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి పాత్రలు మాయమయ్యాయి. వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, పేపర్ పేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా వీటిని వినియోగించిన ప్రజలు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రస్తుత తరం మట్టి పాత్రలపై మక్కువ చూపుతోంది. దీంతో ఏళ్ల క్రితం వదిలేసిన మట్టి పాత్రలు ప్రజలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్లో మట్టి పాత్రలకు డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ కాలంలో కూడా మట్టి పాత్రలను ఎవరు వాడతారనుకుంటే పొరపాటే.. వీటిని నేటికీ వినియోగించే వారు ఉన్నత వర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.రుచి..ఆరోగ్యకరం..మట్టిపాత్రలో వంట రుచిగా ఉంటుంది. అలాగే, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్‌కు వేడి తగలగానే ఇన్ ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తిస్థాయిలో శుద్ధి అవుతుంది. ఉదాహరణకు పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టినా.. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నా ఇంక్యుబేటర్ అనే పరికరంలో (లైట్ కింద పెడతారు) కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే శిశువులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకు ఉంది. ప్రకృతి వైద్యంలో బురద స్నానం (మడ్ బాత్) గురించి తెలిసే ఉంటుంది. శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు. అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మట్టి పాత్రల్లో వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృథా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు శక్తిని కలిగించి ఆహారాన్ని సమతుల్యంగా మారుస్తాయి. అందుకే మట్టి పాత్రల్లో చేసిన వంటలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది. లోహపాత్రల వల్లే రోగాలు..అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు విషతుల్యమవుతాయి. ఈ పదార్థలు తిన్న ప్రజలు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుబాటులో మట్టి టీ గ్లాస్, వాటర్ బాటిళ్లు..తెలంగాణలోని ఆదిలాబాద్, గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గృహోపకర పాత్రలను మట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మరి కులస్తులు మట్టి పాత్రలు అందుబాటులో ఉంచారు. టీ గ్లాస్, వాటర్ బాటిల్, కంచాలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!మట్టి కడవల్లోనే మంచినీరు..పూర్వకాలంలో మట్టి పాత్ర(కుండ)ల్లో వంటలు చేసే వారు. మట్టి కడవల్లోనే మంచినీరు తాగే వారు. అందుకే ఆ కాలపు వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 40 ఏళ్ల నుంచి మట్టి పాత్రలు వాడకం క్రమేనా తగ్గతూ వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న రోగాలతో పాతకాలం నాటి ఆహార పద్ధతులపై ప్రజలు మక్కువ పెంచుకుంటన్నారు. ఇందులో భాగంగా మట్టి కుండలో చికెన్, మట్టి పాత్రలో వంటలకు క్రేజ్ పెరుగుతోంది. మట్టి పాత్రల్లో వంటలు ఆరోగ్యకరం అనగానే ఆ పాత్రలు మార్కెట్లో భారీగా అమ్ముడవుతున్నాయి. గతంలో ఇళ్లలో మట్టితో తయారు చేసే వస్తువులు అనేకం ఉండేవి. ప్రస్తుతం మార్కెట్లో లభించే కుండలు తప్ప మరే ఇతర మట్టి పాత్రలు కనిపించడం లేదు.ఇదీ చదవండి: Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపుమట్టి పాత్రలే ముద్దు : అల్యూమినియం కంటే మట్టి పాత్రలే ముద్దు. తెలంగాణలో ఉగాది పచ్చడి కొత్త మట్టి కుండల్లో చేస్తారు. ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ మట్టి పాత్రల్లోనే ప్రసాదాలు తయారు చేసి పంపణీ చేస్తారు.-డాక్టర్ నరేశ్‌కుమార్, ఫోర్ట్ రోడ్డు వరంగల్ -
ఎలా... ఏ పాత్రలో.. వంట ఆరోగ్యకరం?
అల్యూమినియం వంట పాత్రలకూ ఎక్స్‌పెయిరీ ఉంటుందని.. వాటిని సుదీర్ఘకాలం వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని బ్యూరో ఆర్ ఇండియన్ స్టాండర్డ్స్ వెల్లడించింది. ఆరోగ్యదాయకమైన జీవనం కోసం ఏం తింటున్నాం అనే దానితో పాటు దాన్ని ఎలా వండుతున్నాం అనేది కూడా అంతే ముఖ్యమైన విషయం. ఆహారోత్పత్తులను అధిక ఉష్ణోగ్రతలో వండితే పోషకాలు నష్టపోవటంతో పాటు, హానికారక పదార్థాలు ఏర్పడతాయని మీకు తెలుసా? వంట అనేక పద్ధతుల్లో చేస్తుంటాం. ఇంతకీ, ఏ పద్ధతిలో వండితే మంచిది? ఏయే పాత్రల్లో ఎలా వండితే మంచిదో తెలుసా? భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఏం చెబుతోందంటే..ముంబైలో 50 ఏళ్ల వ్యక్తికి మతిమరుపు విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రమైన అలసట, ఒళ్లంతా నొప్పులు ఎక్కువయ్యాయి. ఆసుపత్రిలో చేరిన అతడికి మెటల్ స్క్రీనింగ్ చేస్తే.. శరీరంలో సీసం స్థాయిలు భారీగా పెరిగిపోయాయని తేలింది. దానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. అతడి భార్య ఇంట్లో 20 ఏళ్లుగా ఒకే ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తోందట! ఆమ్లగుణం ఉన్న ఆహార పదార్థాలను అల్యూమినియం పాత్రల్లో వండేటప్పుడు అందులో సీసం, అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వంట చేసే పద్ధతితో పాటు ఏ పాత్రలో వండుతున్నాం అన్నదాన్ని బట్టి ఆహారంలో పోషకాల సాంద్రత, నాణ్యత ఆధారపడి ఉంటుంది.మట్టి పాత్రలు..: వంటకు ఇవే అత్యుత్తమం. ఇవి పర్యావరణహితమైనవే కాదు, వాటిల్లో వండే ఆహారంలో పోషకాలను చెక్కు చెదరకుండా ఉంచుతాయి. మట్టి పాత్రల గోడల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా అధిక వేడి బయటకు పోతుంది కాబట్టి ఉడికే ఆహారంలో పోషకాలకు నష్టం వాటిల్లదు.రాతి పాత్రలు..: గ్రానైట్ స్టోన్ పాత్రలు సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేస్తాయి. టెఫ్లాన్ పూతలు లేనివి వంటకు మంచివి. ఈ పాత్రలకు.. మంట మధ్యస్థానికి–అధికానికి మధ్యలోనే ఉంచాలి.లోహ పాత్రలుఅల్యూమినియం, ఇనుము, ఇత్తడి, కంచు, రాగి వంటి లోహ పాత్రల్లో ఆహారం వండినా, నిల్వ చేసినా ఆ లోహాలు ఆహారంలో కలుస్తాయి. ⇒ నిల్వ పచ్చళ్లు, చట్నీలు, సాంబారు వంటి ఆమ్ల గుణం ఉన్న పదార్థాలను అల్యూమినియం, ఇనుము; లోపలి పూత లేని ఇత్తడి, రాగి పాత్రల్లో నిల్వ చేయడం మంచిది కాదు.స్టీలు పాత్రలుఇవి వంటకు బాగా అనువైనవి. ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వంటకు స్టీల్ గిన్నెలు వాడుతున్నారు. ఎక్కువ కాలం మన్నిక, తుప్పు పట్టకపోవటం, ఆహార పదార్థాలు ఉంచినప్పుడు రియాక్షన్ లేకపోవటం వంటి సానుకూల అంశాలు ఉండటమే ఇందుకు కారణం. నాన్‌స్టిక్ పాత్రలుపాలీ టెట్రా ఫ్లోరో ఇథిలిన్ (పిటిఎఫ్ఇ/టెఫ్లాన్) అనే పదార్థంతో లేపనం చేసిన పాత్రలను నాన్ స్టిక్ పాత్రలు అంటారు. 170 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ పాత్రల్లో వంట చెయ్యకూడదు. అలా చేస్తే టెఫ్లాన్ కోటింగ్ ఊడి వచ్చేసి విషతుల్యమైన వాయువులు వెలువడతాయి. టెఫ్లాన్ పొర ఊడిపోతే ఇక ఆ పాత్రలను వాడకూడదు.ఎలా వండితే మంచిది?మూత పెట్టి/పెట్టకుండా వంట: మూత పెట్టకుండా వండితే పోషకాలు కొన్ని గాలిలో కలిసిపోతాయి. ఎంత తక్కువ సమయం వండితే పోషకాల నష్టం అంత తగ్గుతుంది. మూత పెట్టి వండితే త్వరగా పూరై్త, పోషకాల నష్టమూ తగ్గుతుంది.ఉడకపెట్టటం, ప్రెజర్ కుక్కర్లో వంట:పప్పుల్లో జీర్ణం కాకుండా అడ్డుకునే యాంటీ–న్యూట్రిషనల్ ఎంజైములు ఉంటాయి. ఎక్కువ నీరు పోసి ఉడకబెట్టటం, ప్రెజర్ కుక్కర్లో వండటం వల్ల ఇవి నశించి, జీర్ణమయ్యే గుణంతో పాటు మాంసకృత్తుల లభ్యత పెరుగుతుంది. ⇒ ధాన్యాలు, పప్పుల్లో ఫైటిక్ ఆమ్లాలు ఉంటాయి. ఎక్కువ నీటిలో ఉడికించినప్పుడు లేదా కుక్కర్లో వండినప్పుడు ఇవి చాలా వరకు తగ్గిపోతాయి. తద్వారా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మపోషకాలు మనకు ఎక్కువగా లభిస్తాయి.⇒ పప్పులను ఎక్కువ నీటితో ఉడకబెట్టి, ఆ నీటిని పారేస్తే ఫోలేట్, బి కాంప్లెక్స్ విటమిన్లు, సి విటమిన్లను నష్టపోతాం. ఎక్కువ సేపు ఉడకబెడితే మాంసకృత్తుల నాణ్యత క్షీణిస్తుంది.ఆవిరిపై వంట: ఆకుకూరలు, కూరగాయలను ఆవిరిపై వండటం ఉత్తమం. ⇒ నీటిలో కరిగిపోయే విటమిన్లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఆవిరి వంట వల్ల బీటా కెరోటిన్, లుటీన్లు సులభంగా శరీరానికి వంటపడతాయి.నూనెలో వేపుడు: ఎక్కువ ఉష్ణోగ్రతపై, ఎక్కువ నూనెలో ఫ్రై చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాల్లో మార్పులొస్తాయి. ⇒ నీరు ఆవిరైపోవటం వల్ల విటమిన్ సి వంటి నీటకరిగే పోషకాలు నష్టపోతాం. ⇒ అధిక ఉష్ణోగ్రత, గాలి, నూనె కలిసినప్పుడు విష పదార్థాలు ఉత్పత్తయ్యే ప్రమాదం ఉంది. ⇒ ఒకసారి వేపుడు కోసం వాడిని నూనెను మళ్లీ వేపుడుకు వాడటం గానీ, వాడని నూనెతో కలపటం గానీ ప్రమాదకరం.లోతు తక్కువ గిన్నెలో వేపుడు: తక్కువ లోతున్న గిన్నెలో తక్కువ నూనెతో, ఎక్కువ మంటపై ‘షాలో ఫ్రైయింగ్’ చేయటం వల్ల పోషకాల నష్టం ఎక్కువ. డీప్ ఫ్రైతో పోల్చితే.. ఎక్కువగా ఆక్సీకరణానికి గురైనందున కొవ్వులు, నూనెల నాణ్యత దెబ్బతింటుంది.వేగంగా తిప్పుతూ వేపటం: కూరగాయలు లేదా మాంసం ముక్కలను కొద్దిపాటి నూనె వేసి అధిక మంటపై వేగంగా తిప్పుతూ వేపటాన్నే స్టిర్ ఫ్రైయింగ్ అంటారు. ఎక్కువ నూనెలో వేపుడుతో పోల్చితే ఈ పద్ధతిలో పోషకాల నష్టం తక్కువే.మైక్రోవేవ్ కుకింగ్మైక్రోవేవ్లో చాలా తక్కువ సమయంలో, కొద్దిపాటి నీటితోనే వంట పూర్తవుతుంది. మిగతా పద్ధతులతో పోలిస్తే ఇందులో విటమిన్లు, ఖనిజాల నష్టం చాలా తక్కువ.నెమ్మదిగా వండటం: తక్కువ వేగంగా, తక్కువ వేడిపై వండే పద్ధతి ఇది. ఇలా నూనెలో మాంసాన్ని వేపినప్పుడు పోషకాల నష్టం చాలా తగ్గుతుంది. ⇒ టమాటాలు, మొక్కజొన్న, పాలకూర వంటి వాటిని ఇలా వండితే వాటి కణాల గోడలు ఛిద్రమై శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు విడుదలై శరీరానికి ఎక్కువగా అందుతాయి.ఎయిర్ ఫ్రైయింగ్⇒ తక్కువ నూనెతో డీప్ ఫ్రైయింగ్ చేయడం. దీనివల్ల ఊబకాయం సమస్య రాదు. ⇒ బంగాళదుంపలు వంటి స్టార్చ్ ఎక్కువ ఉండే ఆహారానికి ఇది నప్పుతుంది. ⇒ అయితే, చేప ముక్కలను ఎయిర్ ఫ్రైయింగ్ చేస్తే వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తగ్గిపోతాయి. వాపు (ఇన్ఫ్లమేషన్) కలిగించే మూలకాలు పెరుగుతాయి. -
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్‌లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్‌లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
ఒకప్పుడు పేదల ఇంటి అవసరం.. ఇప్పుడు ఇంట్లో అలంకారంగా!
Creative Ideas: మట్టి పాత్రలు ఒకప్పుడు పేదల ఇంటి అవసరంగా ఉండేవి. ఇప్పుడు ధనవంతుల ఇళ్ల అలంకారాలుగా మారాయి. ఇంటి అలంకరణలో మట్టి అందాలు దండిగా చేరి నిండుదనాన్నిస్తున్నాయి. వెనకటి రోజులను మళ్లీ నట్టింట చూసుకోవడానికి పట్టణ జీవి మట్టి రూపాలను ఎంచుకుంటున్నాడు. అందుకేనేమో మట్టి.. రంగులద్దుకొని మరీ ముస్తాబవుతోంది. కుండల దొంతర.. సమృద్ధికి కుండల దొంతరలనూ ఓ గుర్తుగా చూస్తుంది ప్రాచీన భారతీయం. ఇప్పుడు ఆ కుండలు ఇల్లాలి చేతిలో ఓ కళగా మారి ఇల్లంతా రాజ్యమేలు తున్నాయి. మంచి నీటి కూజాల దగ్గర్నుంచి .. లివింగ్ రూముల్లో ఆర్ట్ కాన్వాస్‌గా.. బాల్కనీల్లో మొక్కలను ఆవరిస్తున్న తొట్టెలు చేరి ఇంటి కళనే మార్చేస్తున్నాయి. వంటపాత్రల హంగామా.. వంట కోసం ఇత్తడిని రీప్లేస్ చేసిన అల్యూమినియం జమానా కూడా పోయి మట్టి పాత్రల ఎరా మొదలైంది. వీటి శోభ వంట గట్టు మీద సరే... డైనింగ్ టేబుల్ మీదా విరాజిల్లుతోంది.. గ్లాసులు, బాటిళ్లుగా! జల్లెడలు, జ్యూసర్లు, ప్లేట్లు, ఇడ్లీ పాత్రలు... ఒక్కటని ఏంటి ఇంట్లో అవసరాలకు ఉపయోగపడే పాత్రలన్నీ మట్టి రూపాలై పెద్ద పెద్ద షాపింగ్మాల్స్లలోనూ దర్శనమిస్తున్నాయి. ఇందులో టెర్రకోటానే ఆధిపత్యం చూపుతున్నా అక్కడక్కడా మన ప్రాంతీయ నల్ల మట్టీ మెరుస్తోంది. మట్టి సవ్వడి.. అల్యూమినియం, స్టీల్‌తో తయారైన హ్యాంగింగ్ బెల్స్ చేసే సవ్వడి మనకు తెలిసిందే. కానీ, గుడిలో గంటల మాదిరిగా రూపుదాల్చుకున్న మట్టి గంటల అమరికా ఇంటి ముందు కొత్త అందానికి తోరణంగా నిలుస్తోంది. బొమ్మల కథ.. మట్టి గణేశుడు మరెన్నో రూపాలకు ప్రేరణ ఇచ్చాడు. రాజా–రాణి ఫేస్ మాస్క్‌లు, వెల్కమ్ బొమ్మలు గోడపైన హొయలొలికిస్తున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కోసం తొట్టెలుగానూ సరికొత్త మట్టిరూపాలు కొలువుదీరుతున్నాయి. ఈ మట్టి రూపాలకు పెద్ద మొత్తంలో ధర పెట్టాల్సిన అవసరం లేదు. వందల రూపాయల్లోనే దొరుకుతున్నాయి. రోజూవారీ వాడకంలో.. ఇంటి అలంకరణలో మేలైనవిగా నిలుస్తున్నాయి. Interior Decor: చేటలో ప్లాంట్.. బాల్కనీకి పల్లె సొగసు.. వెదురు అందం! -
ఊరెళితే మొక్కలకు నీళ్లు పెడతాయి!
అర్జంటుగా ఊరెళ్లాలి.. వారం, పది రోజుల వరకూ మళ్లీ ఇంటికొచ్చే అవకాశమే లేదు. పెరట్లో మొక్కలు నీళ్లులేక చచ్చిపోతాయేమో! మహా నగరాల్లోని అపార్ట్మెంట్ల నుంచి.. పల్లెల్లోని ఇంటి పెరళ్ల వరకూ ఈ సమస్య గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇరుగు పొరుగును అప్పుడప్పుడూ మొక్కలకు నీళ్లు పెట్టమని చెప్పడమో.. అపార్ట్మెంట్లలోని మొక్కలన్నీ వరండాల్లోకి తీసుకొచ్చి నీళ్లుపెట్టే బాధ్యతను వాచ్‌మెన్‌కు అప్పగించడమో.. సాధారణంగా మనం చేసే పని. కానీ ఫొటోలో కనిపిస్తున్న.. ఇలాంటి కూజాలు మీ దగ్గరున్నాయనుకోండి... ఈ సమస్య ఇట్టే మాయమైపోతుంది. ఒకట్రెండు వారాలు కాదు.. ఏకంగా నెలరోజులపాటు మొక్కలకు నీళ్లు పడుతుంది ఈ ‘క్లయోలా’. దాదాపు 20 లీటర్ల బకెట్‌ను కొంచెం ఎత్తులో పెట్టి... దానికి క్లయోలా కూజాలను కలిపితే చాలు.. మిగిలినదంతా ఆటోమెటిక్‌గా జరిగిపోతుంది. కూజాల్లోకి చేరే నీరు... మట్టిలోని అతిసూక్ష్మమైన కంతల ద్వారా చెమ్మగా మారుతుంది. ఆ చెమ్మ నుంచి మొక్కల వేళ్లు నీళ్లు అందుకుంటాయి. చాలా సింపుల్‌గా అనిపించే ఈ క్లయోలా కూజాలను ఈజిప్టుకు చెందిన రామీ హలీమ్ అనే వ్యక్తి అభివృద్ధి చేశారు. ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా వాడిన ఒల్లా అనే మట్టిపాత్రల డిజైన్ ఆధారంగా ఈ క్లయోలా తయారైంది. ఒక్కో క్లయోలా కూజా దాదాపు మూడు అంగుళాల వెడల్పు, ఐదంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. దాని మూతపై రెండు గొట్టాలు వ్యతిరేక దిశలో ఉంటాయి. మొక్కలకు ఎల్లప్పుడూ కావాల్సినంత నీళ్లు మాత్రమే అందుతాయి. కూజాలకు మూతలు ఉండటం వల్ల నీరు ఆవిరి రూపంలో వృథా అయ్యేది కూడా ఉండదు. కుమ్మర్ల పనితనానికి మచ్చుతునకలుగా కనిపించే ఈ ప్రత్యేకమైన మట్టి కూజాలు ఆరింటి ఖరీదు దాదాపు 30 డాలర్లు. అంటే సుమారు 2 వేల రూపాయలు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పేదల ఫ్రిజ్‌కు భలే గిరాకీ..!
జోరందుకున్న మట్టికుండల విక్రయాలు ఆకట్టుకుంటున్న రాజస్థాన్ మట్టి కుండలు, కూజాలు బళ్లారి అర్బన్ : వేసవి దృష్ట్యా బళ్లారిలో మట్టి కుండలు, కూజాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన బల్దేవ్జీ, బన్సీలాల్ వ్యాపారులు రాజస్థాన్ నుంచి లారీల ద్వారా వివిధ రకాల మట్టి కుండలను తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారు. స్థానిక ఎస్పీ సర్కిల్లోని జైల్గోడ పక్కన బల్దేవ్ ఇప్పటికే రెండు లోడ్ల మట్టి కుండలను విక్రయించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లోని కుమ్మరి వ్యాపారులు తయారు చేసిన కుండలు, కూజాలతో పాటు వడ్రబండ, కుమ్మరవీధిలో, కౌల్‌బజార్ కుంబర వీధిలలో మట్టి కుండలు విక్రయిస్తున్నారు. మట్టి కుండలు రూ.100ల నుంచి రూ.350ల వరకు సైజ్‌ను బట్టి స్టాండ్‌తో పాటు అమ్మకాలు చేపట్టారు. నగరంలో ఎండలు అధికం కావడంతో చల్లటి నీటి కోసం అలమటిస్తున్నారు. ఫ్రిజ్ నీరు కన్నా మట్టికుండలోని నీరు శ్రేష్టమని, ఉత్తమ ఆరోగ్యానికి మట్టి కుండలు మేలు కావడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు.