breaking news
civillians
-
నాటి పరిస్థితుల దృష్ట్య అది సరైనదే! కార్గో విమాన సిబ్బందికి క్లీన్చిట్
US forces from Afghanistan has been cleared of wrongdoing: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు ఆక్రమించుకున్న సమయంలో చాలామంది అఫ్గాన్ వాసులు భయంతో పారిపోయేందకు ప్రయత్నించారు. ఈ మేరకు పెద్ద గుంపులుగా జనసందోహం కాబోలు విమానాశ్రయంలో రన్‌వే పై పరుగులు తీసి యూఎస్ వైమానిక దళానికి చెందిన కార్గో విమానాలను చుట్టుముట్టారు. గత్యంతరం లేని నాటి భయానక పరిస్థితుల్లో యూఎస్దళాలు జనసముహం విమానాల వద్దకు వెళ్లకుండా నిరోధించేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ జనం విమానం రెక్కలను పట్టుకుని ఎక్కడం వంటివి చేశారు. తప్పనసరి పరిస్థితుల్లో అమెరికన్ సైనికులు, ఫైలెట్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో పైలెట్లు గాల్లో విమానాలను ప్రయాణించేందుకు రెడీ చేశారు. అంతే ఒక్కసారిగా విమానాలను గాల్లోకి దూసుకెళ్లిన వెంటనే విమాన రెక్కలను పట్టుకుని ఎక్కిన జనం పిట్టల్లా కిందకి రాలిపోయారు. దీంతో వేలాదిమంది అఫ్గాన్ పౌరులు మృతిచెందరు. ఐతే నాటి ఘటనలో ఎంతమంది చనిపోయారనేది స్పష్టత లేదు. నాటి దురదృష్ట ఘటనకు కారణమైన విమానాల్లో సీ17 కార్గో విమానం ఒకటి. ఐతే ఆగస్టు16, 2021న జరిగిన ఈ విషాదకర ఘటనపై యునైటెకడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ దర్యాప్తు నిర్వహించింది. ఈ మేరకు యూఎస్ వైమానిక దళ ప్రతినిధి ఆన్ స్టెఫానెక్ విచారణలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ...కార్గో ఎయిర్‌లైన్ సిబ్బంది క్షీణిస్తున్న భద్రతల నడుమ గాల్లో ప్రయాణించాలని తీసుకున్న నిర్ణయం సరైనదే. నాటి ఘటనలో కార్గో విమానా అంచనాకు మించి సుమారు 650 మంది ప్యాసింజర్లతో బయలుదేరినట్లు కూడా వివరించారు. ఆ సమయంలో తగిన విధంగానే వ్యవహరించారంటూ కార్గో విమాన సిబ్బందికి క్లీన్చిట్ ఇచ్చింది. (చదవండి: అసాధారణం: భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు! పక్షుల్లాగా..) -
వైమానికదాడుల్లో ముగ్గురు పౌరులు మృతి
సిరియా: సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని ఖాన్ షేకున్ ప్రాంతంలో తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సైతం మృతి చెందారని, మరో 13 మంది పౌరులు గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్‌రైట్స్(ఎస్ఓహెచ్) వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆధీనంలో లేని ప్రాంతంలో జరిగిన వైమానికదాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందడం ఇదే తొలిసారి అని ఎస్ఓహెచ్ ప్రతినిధి అబ్దుల్ రెహ్మాన్ వెల్లడించారు. దాడులకు పాల్పడిన వైమానిక విమానాలు ఏ దేశానికి చెందినవి అన్నది మాత్రం ఎస్ఓహెచ్ గుర్తించలేకపోయింది. అయితే, ఇడ్లిబ్ ప్రాంతంలో సిరియా ప్రభుత్వానికి అనుకూలంగా రష్యా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించడం సర్వసాధారణం అని తెలుస్తోంది.