breaking news
Civil Aviation Minister Ashok Gajapathi Raju
-
ఇండిగో నిర్వాకంపై కేంద్రమంత్రి సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుడిపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది చేయిచేసుకున్న ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బుధవారం స్పందించారు. ప్రయాణికుడు సంజయ్ కత్వాల్పై దాడిని ఖండించిన కేంద్రమంత్రి, ఈ ఉదంతంపై స్వతంత్ర నివేదిక సమర్పించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ని ఆదేశించారు. అలాగే ఇండిగో సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అశోక్ గజపతి రాజు చెప్పారు. ఇలాంటి అనాగరిక విషయాలు జరగకూడదన్నారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఇండిగో సిబ్బంది దురుసు ప్రవర్తన వ్యవహారం వీడియోసాక్షిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుడిని స్వయంగా కలిసి ఎయిర్లైన్స డైరెక్టర్ దాడి ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ. క్షమాపణలు చెప్పారు. కాగా ఈ సంఘటన అక్టోబర్ 15 ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్లో కలకలం రేపింది. వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే, విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా ఈ సంఘటనను ఖండించారు. రిపోర్టు ఇవ్వాల్సిందిగా వైమానిక సంస్థ ఇండిగో కోరారు. అటు ఈ దాడిపై బీజేపీ కూడా మండిపడుతోంది. ప్రయాణీకుల పట్ల ఇండిగో సంస్థ సిబ్బంది అమర్యాద ప్రవర్తన గర్హనీయమని, యాజమాన్య స్పందన చాలా దారుణంగా ఉందంటూ షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. The confinement & assault of the passenger by Indigo staff is reprehensible. The way Indigo management dealt with the situation is even worse. https://t.co/ZVivxJ0mru — Shahnawaz Hussain (@ShahnawazBJP) November 8, 2017 -
మంచి కబురు చెప్పిన మంత్రి గజపతిరాజు
న్యూఢిల్లీ: 'కర్ణుడి చావుకు వంద కారణాలు' అన్నట్టు.. ప్రభుత్వ సేవా సంస్థల నష్టాలకు కారణాలు కోకొల్లలు. ఇక విమానయాన సంస్థల మాట ఎత్తితే నష్టాలు తప్ప మరొకటి వినిపించదు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి ఇటీవలే కాస్త మెరుగు పడింది. ఈ మేరకు ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విషయంలో మంచి కబురు చెప్పారు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. మంగళవారం రాజ్యసభలో ఎయిర్ క్యారేజ్ (సవరణ) బిల్లుపై మాట్లాడిన మంత్రి గజపతిరాజు.. ఎయిర్ ఇండియా నిర్వహణా లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. 'ఈ ఏడాది ఎయిర్ ఇండియా నిర్వహణా నష్టాలను చవిచూడకపోగా లాభాన్ని సాధించింది' అని ప్రకటించారు. మంత్రి ప్రకటనను పలువురు సభ్యులు బల్లలుచరిచి ఆహ్వానించారు. గత ఏడాది నుంచి విమాన ఇంధనం ధరలు తగ్గడం విమానయాన సంస్థలకు కొత్త ఊపిరినిచ్చినట్టయింది. ఖర్చులు తగ్గడంతో 2015-15 ఆర్థిక సంవత్సరంలో పలు దేశీయ విమానయాన సంస్థలు లాభాలను ప్రకటించాయి కూడా. అయితే విదేశాలకు సర్వీసులు నడుపుతోన్న ఎయిర్ ఇండియా లాంటి సంస్థలకు మాత్రం నష్టాలు తప్పలేదు. గతేడాది ఎయిర్ ఇండియా 90-92 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నష్టాలను అధిగమించినట్లు మంత్రి ప్రకటించడం శుభసూచికం.