breaking news
CIRCULER
-
గీత దాటితే చర్యలు తప్పవ్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం వార్నింగ్
సాక్షి, విశాఖపట్నం : అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై గత నెల ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు దసరాకు బోనస్ ఇవ్వలేదని, దీపావళికి జీతం లేదంటూ కార్మికులు వాపోతున్నారు. ఇంత జరగుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సమాచార శాఖ ఉద్యోగుల కేటాయింపు పూర్తి
హన్మకొండ అర్బన్ : జిల్లా పౌర సంబంధాల శాఖలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను నాలుగు జిల్లాలకు కేటాయిస్తూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు కొద్దిపాటి మార్పులు చేస్తూ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుత పీఆర్వో శ్రీనివాస్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలో నూతనంగా ఏర్పడనున్న వనపర్తి జిల్లాకు పీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు. మిగతా అధికారులు, సిబ్బందిని జిల్లాలో ఏర్పడే కొత్త జిల్లాల్లో సర్ధుబాటు చేశారు. జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపుల వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు 10 మంది : డీఎస్.జగన్ (డీడీ), ఈవీ.కిరణ్మయి (అడిషనల్ పీఆర్వో), జి.విధుమౌళి (పబ్లిసిటీ అసిస్టెంట్), బి.ప్రేమలత (సీనియర్ అసిస్టెంట్), కె.శ్రీధర్ (టైపిస్ట్), కె.రామస్వామి (డ్రైవర్), అటెండర్లు మేరమ్మ, కుమారస్వామి, శ్రీనివాస్, యాకూబ్‌పాషా. హన్మకొండ జిల్లాలకు 9 మంది : దశరథం (పీఆర్వో), ఎం.ఉషారాణి (ఏపీఆర్వో), ఎం.విష్ణుమోహన్ (పబ్లిసిటీ అసిస్టెంట్) ఎం.వీరాంజనేయులు (టైపిస్ట్), యాకూబ్‌పాషా (డ్రైవర్), అటెండర్లు అనసూయ, బి. రవి, ఇ.సంపత్‌కుమార్, వి.శోభన్‌బాబు. మహబూబాబాద్ జిల్లాకు ఏడుగురు : బి.పల్లవి (అడిషనల్ పీఆర్వో), కోల రాములు (ఏవీ సూపర్వైజర్), టి.ఆశ (టైపిస్ట్), టి.దేవీప్రసాద్ (రికార్డ్ అసిస్టెంట్), అటెండర్లు భాగ్యలక్ష్మి, సంపత్‌కుమార్, గోపి. జయశంకర్ జిల్లాకు ఏడుగురు : పాండురంగారావు (ఏడీ), ఎం.శ్రీనివాస్‌కుమార్ (అడిషనల్ పీఆర్వో), ఎం.విజయలక్ష్మి (టైపిస్ట్), అటెండర్లు విజయమ్మ, రేణుక, శ్రీనివాస్, మనోజ్‌కుమార్.