చైనా ప్రాచీన లేఖకు రూ.213 కోట్లు
బీజింగ్: 11వ శతాబ్దంలో ఓ పండితుడు రాసిన 124 అక్షరాలున్న చైనా లేఖకు కాసుల వర్షం కురిసింది. అందమైన అక్షరాలున్న ఆ లేఖను బీజింగ్‌లో నిర్వహించిన వేలంలో రూ. 213 కోట్ల (32 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేశారు. జూసీ టై అనే పేరుతో ఉన్న లేఖను చైనాకు చెందిన కళాభిమాని వాంగ్ జాంగ్‌జున్ దక్కించుకున్నారు. 960-1279 మధ్య కాలంలో సాంగ్ వంశానికి చెందిన ప్రముఖ పండితుడు జెంగ్ గాంగ్ తన స్నేహితుడికి ఈ లేఖ రాశారు. రాజకీయ ఇబ్బందులు, ఒంటరి తనం గురించి లేఖలో పేర్కొన్నారు.