breaking news
Childs Right To Education
-
విద్యాహక్కుకు చికిత్స!
జన సంక్షేమ చట్టాల్ని నీరుగార్చటంలో మనకెవరూ సాటిరారని పదహారేళ్ల నాడు సాకార మైన విద్యాహక్కు చట్టం నిరూపించింది. 6–14 మధ్యవయసు పిల్లలకు ప్రాథమిక విద్య తప్పనిసరి చేసే ఆ చట్టాన్ని అమలుచేసే రాజ్యాంగ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. ఇతర ప్రాథ మిక హక్కులకూ, 21ఏ అధికరణం కింద వచ్చి చేరిన విద్యాహక్కుకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. ఇతర హక్కులన్నీ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకూ, జీవించే హక్కుకూ ముడిపడినవైతే, ఇదొక్కటీ ప్రాథమిక విద్యను పిల్లల హక్కుగా పేర్కొంటు న్నది.విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం అణగారిన వర్గాల కుటుంబాల పిల్లలు తమ పొరుగునున్న గుర్తింపు పొందిన ఏ పాఠశాలలోనైనా ఉచితంగా విద్య పొందవచ్చు. అలాంటి వారి కోసం ప్రతి విద్యాసంస్థా 25 శాతం సీట్లు అందుబాటులో ఉంచాలి. ఆ వర్గాల పిల్లలు దరఖాస్తు చేస్తే, ఫీజులు చెల్లించరన్న సాకుతో ప్రవేశం నిరాకరించకూడదు. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. చూడటానికీ, వినటానికీ ఎంత బాగుంది! కానీ సంకల్పమే కొరవడింది.దీని అమలు 2010 ఏప్రిల్ 1న మొదలైనప్పుడు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అందరూ వేనోళ్ల కొనియాడారు. అప్పటికే ప్రాథమిక విద్యను హక్కుగా చేసిన 137 దేశాల సరసన మనం కూడా చేరామని సంబరపడ్డారు. ఏడాది తిరిగేసరికే దాని వాలకం తెలిసి పోయింది. విద్యారంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. ‘ఎవరికి పుట్టిన బిడ్డో...’ అన్నట్టు అనాథగా మారిన ఆ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమాజ పురోగతిలో విద్యాసంస్థలు బలమైన ఉపకరణాలు.అందుకే అణగారిన వర్గాలకు మాత్రమే కాదు... కుల,మత, ఆర్థిక స్థోమతలతో సంబంధం లేకుండా పీజీ వరకైనా అందరూ ఉచితంగా చదువుకునే అవకాశం ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో పీహెచ్డీ స్థాయిలో సైతం అందరికీ ఉచితంగా ప్రవేశాలిస్తున్నారు. అందువల్లే అక్కడ ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆవిర్భ విస్తున్నాయి. సృజనాత్మకతలు వెల్లివిరుస్తున్నాయి. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, అది భవిష్యత్ సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా పరిగణించాలి. అదంతా దురాశ అవుతుందేమోగానీ... కనీసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించలేక పోవటం తలదించుకోవా ల్సిన విషయం కాదా? అమలు చేతగానప్పుడు ఘనంగా కనబడేలా చట్టం చేయటం ఎందుకు? దాన్ని ప్రాథమిక హక్కు చేశామన్న చాటింపు దేనికి? మహారాష్ట్రకు చెందిన ఒక పౌరుడు తన పిల్లలకు దగ్గర్లోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం కల్పించటం లేదని, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుందని సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ఈ సమస్య చర్చకొచ్చింది.ఇది ఆయనొక్కరి సమస్య మాత్రమే కాదు... దేశంలోని పలువురు తల్లిదండ్రులది కూడా! గత్యంతరంలేని స్థితిలో చేర్చుకున్నా అలాంటి పిల్లల్ని ‘వెలి’ వేసి, విడిగా చదువు చెబుతున్న ఘనులు కూడా ఉన్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ విద్యా మాఫియాల పలుకుబడి ప్రభుత్వాల్లో పెరగటమా లేక పిల్లల తరఫున ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టడమా? ఈ రెండూ కారణాలైనా ఆశ్చర్యం లేదు. లాభార్జనపై పెద్దగా దృష్టిపెట్టకుండా తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు నడిపే వారే ప్రభుత్వాలకు జడిసి అంతో ఇంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. లేకుంటే తమ సంస్థ గుర్తింపు ఏదో సాకుతో రద్దుచేస్తారన్న భయం వారిని నిరంతరం వెంటాడు తుంటుంది.ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలు ప్రశంసించదగ్గవి. అన్ని స్థాయుల అధికారుల ప్రమేయాన్ని పెంచి, లోటుపాట్లు కనబడిన మరుక్షణం వాటిని నివారించగలిగే వ్యవస్థను ధర్మాసనం సూచించింది. అందుకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించి సక్రమంగా అమలు చేయటం ప్రభు త్వాల బాధ్యత. పైచదువుల్లో ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు ఆచరణలో అటకెక్కిస్తున్న ప్రభుత్వాలు... చిన్నపిల్లలైనా సక్రమంగా చదివేలా చూడలేకపోతున్నాయంటే క్షమార్హం కాదు. -
మొక్కుబడి
పలకా బలపం పట్టాల్సిన చేతులు మోటార్ మెకానిక్ షెడ్లలో, ఇటుక బట్టీల్లో, రోడ్లపై చెత్తాచెదారాల్లో కాగితాలు ఏరుకుంటూ, రద్దీ ప్రదేశాల్లో భిక్షాటన చేసుకుంటూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే విద్యాహక్కు చట్టం గానీ, లేబర్ ఆఫీసర్లు గానీ వారికి విముక్తి కలిగించడం లేదనే తెలుస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, చట్టాలన్నీ మొక్కుబడిగా పెట్టినట్లే కనిపిస్తున్నాయి. విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండగ, బడిబా ట, విద్యాపక్షోత్సవాలు, వారోత్సవాలు, విద్యా సంబరాలు.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనే క కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే బడి ఈడు పిల్లలు బడిలో నే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా ఐదేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఇప్పటికీ దాదాపు బడి బయట పదివేల మంది పిల్లలున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని సాలూ రు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ని పలు మండలాల్లో నిరక్షరాస్యులు, బాలకార్మికులు అధికంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నా యి. జిల్లా కేంద్రంలో సైతం బడికి వెళ్లని పిల్లలు వందల సంఖ్యలోనే ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. విద్యాహక్కు చట్టంలో భాగంగా బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతాల్లో స్పెషల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అటువంటి చర్యల ఊసే లేదు. పొంతన లేని లెక్కలు.... బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు కోసం జిల్లాలో ఏటా చేస్తున్న సర్వేలు ఏ మాత్రం నమ్మశక్యం గా ఉండడం లేదు. ప్రతి బడి ఈడు పిల్లవాడి పేరును చేర్చుకుంటున్న అధికారు లు ఆ పిల్లలు ఆసాంతం బడికి వస్తున్నారో? లేదో? పర్యవేక్షించడం లేదు. ప్రత్యేకించి ఈ సమస్య వల్ల బడిలో చేర్పించిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. ఏడాదికేడాది బడి బయటి పిల్లల విషయంలో ఒక్కొక్క సర్వే ఒక్కో రకంగా ఉంటోంది. జిల్లాలో 1,825 మంది బాల కార్మికులు బడికి దూరంగా పనుల్లో కొనసాగుతున్నారని విద్యాశాఖ అధికారుల తాజా నివేదిక లు చెబుతుండగా, ఆ సంఖ్య ఆరు వేలు ఉంద ని సాక్షర భారత్ కార్యకర్తలు గత ఏడాది నిర్వహించిన సర్వే చెబుతోంది. ఇక స్వచ్ఛంద సంస్థ లు చెబుతున్న నివేదికలైతే మరోలా ఉన్నాయి. దాని ప్రకారం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలి పి 9 వేల నుంచి 10 వేల మంది వరకు పిల్లలు బడి బయట ఉన్న విషయం బయటపడింది. నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యాగంధం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం పేద విద్యార్థుల దరిచేరడం లేదు. ఐదేళ్ల క్రితం విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. పిల్లలు బడికి, పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తం నిధులను ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కాకపోవడంతో పలువురు విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2015 నాటికి పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ విద్యావేదిక అభిప్రాయపడింది. దీంతో మనదేశం, మరో అడుగు ముందుకు వేసి అందరికీ విద్యను అందిస్తామని ప్రతినబూనడంతోపాటు 2009, ఆగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలకప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఫలితంగా బాలకార్మికుల సంఖ్య పెరుగుతూ, నిరక్షరాస్యుల శాతం కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యాసంవత్సరంలోగా జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.


