breaking news
childrens health care
-
ప్రాణాలు తీసింది.. నిర్లక్ష్యమే
నల్లగొండ : నల్లగొండ శిశుగృహలో మృత్యుఘోషకు అధికారుల అలసత్వమే ప్రధాన కారణమని తెలుస్తోంది. దేవరకొండ, నల్లగొండ శిశుగృహాలను కలిపి ఒకే చోట నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ప్రత్యేక చిన్న చిన్న గదులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. 20 మంది ఉండాల్సిన స్థానంలో 50 మంది శిశువులకు ఒకే హాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఏడాది లోపు వయసున్న శిశువుల ఎదుగుదలకు తగ్గట్టుగా గదిలో 28 నుంచి 30 డిగ్రీల వెచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. పగటిపూట ఉష్ణోగ్రత ఫర్వాలేదనిపించినా రాత్రివేళలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి గదుల్లో వెచ్చదనం ఉండేలా ఏర్పాటు చేయాలని వైద్యులు సూచించారు. 0–1 వయసున్న పిల్లల బరువు మొదటి మూడు నెలల పాటు తప్పనిసరిగా పరిశీలించాలి. రోజుకు 20 నుంచి 30 గ్రామాల బరువు పెరగాలి. ప్రతి మూడు లేదా నాలుగు గంటలకో సారి పిల్లలకు ఆహారం అందించాలి. కానీ శిశుగృహలో ఇలాంటి సౌకర్యాలు లేవని పిల్లలకు వైద్య చికిత్సలు అందించిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. వసతులు లేకపోవడంతో ఆ ప్రభావం పిల్లల ఎదుగుదల పైన పడుతోంది. పోషణ సరి గా లేక రోజురోజుకీ బరువు తగ్గిపోయి వారిలో రోగనిరోధక శక్తి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దీంతో పిల్లలకు ఆస్తమా, దగ్గు, జలుబు, డయేరియా, శ్వాసకోస సంబంధిత వ్యాదులు సోకినప్పుడు వాటిని భరించకలిగే శక్తి లేక త్వరగా నీరసించిపోతున్నారని డాక్టర్ సుధాకర్ తెలిపారు. పర్యవేక్షణాలోపం... శిశుగృహలో 25 మంది ఆయాలు, ఇద్దరు మేనేజర్లు పనిచేస్తున్నారు. వీరంతా రెండు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వరిస్తున్నారు. దీంట్లో ఇద్దరు, ముగ్గురు ఆయాలను అధికారుల ఇళ్లలో సొంత పనులకు కూడా వాడుకుంటున్నారు. పిల్లల పెంపకం, పోషణ గురించి ఆయాలకు ఎలాంటి శి క్షణ ఇవ్వలేదు. దీంతో ఒక చిన్నారికి పాలు పట్టించే క్రమంలో అవి గొంతులోకి పోకుండా శ్వాసనాళంలో అడ్డుపడి ఊపిరాడక చనిపోయింది. పిల్లలను పర్యవేక్షించేందుకు ఏఎన్ఎం స్థాయి కలిగిన ఇద్దరు నర్సులు ఉన్నారు. విధి నిర్వహణలో నర్సులు సమయాపాలన పాటించడం లేదని తెలిసింది. ఇంత మంది పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు జీఎన్ఎం స్థాయి కలిగిన నర్సులు ఉంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు ఆస్పత్రి పాలైనప్పుడు అధికారులు కాకుండా శిశుగృహ సిబ్బంది, ఆయాలు వెళ్తున్నారు. దీంతో మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యులు సంషయిస్తున్నారు. శిశుగృహకు శాశ్వత వైద్యులు లేరు. దీంతో ఇప్పటికే నలుగురిని మార్చారు. ఈ నాలుగు మాసాల వ్యవధిలోనే ఇద్దరు వైద్యులు మారారు. వైద్యం ఖర్చులు భరించలేకనే తరచూ వైద్యులను మారుస్తున్నట్లు తెలిసింది. నిధుల సమస్య.. శిశుగృహ నిర్వహణకు ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కావడం లేదు. కేంద్రంలో శిశువుల సంఖ్య పెరి గిపోతుండటంతో అందుకు అయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. పిల్లలకు సోకే జబ్బుల స్థితిని బట్టి ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స అందించాలంటే ఖర్చు భారీ గానే అవుతోంది. కలెక్టర్ ప్రత్యేక గ్రాంటు నుంచి మార్చిలో రూ.8లక్షలు విడుదల చేశారు. ఈ డబ్బులతోనే ఇప్పటి వరకు శిశుగృహను నెట్టుకొచ్చారు. కాలక్రమేణ నిర్వహణ భారంగా మారడంతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అధికారులు సంకుచిత నిర్ణయాలు తీసుకున్నారు. పోషక విలువలు ఉన్న పాలపౌడర్ కాకుండా నాసిరకాన్ని వినియోగించారు. దీంతో పిల్లల ప్రాణాలు చిక్కుల్లో పడి ఏడుగురు చనిపోయారు. శిశుగృహ నిర్వహణకు రూ.30 లక్షలు కావాలని డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపిన ప్రయోజనం లేకుండా పోయింది. తక్కువ బరువు ఉంటున్నారు శిశుగృహ నుంచి వస్తున్న చిన్నారులు తక్కువ బరువు ఉంటున్నారు. జలుబు, దగ్గు, బ రువు పెంచడం వరకు ఇక్కడ సేవలు అందిస్తున్నాం. పిల్లల శరీరంలో పల ఏమున్నది అనేది తెలియదు. దాంతో నీలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నాం. ఎక్కువ మంది పిల్లల్లో డయేరియా సమస్య కూడా కనిపిస్తోంది. పిల్లలకు సోకే వ్యాధులు ఒకదాని తర్వాత మరొకటి మొదలై చివరకు హైపోథెరిమి వరకు పోయే ప్రమాదం ఉంది. – దామెర యాదయ్య, ప్రభుత్వ వైద్యుడు, (చిన్నపిల్లలు) -
బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మంది పిల్లలకు నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి తెలిపారు. చిన్నారుల్లో శారీరక బలహీనతను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడు తున్నట్లు వెల్లడించారు. గురువారం ఇక్కడ అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నులిపురుగుల నివారణ మందుబిళ్లలను అందించారు. నులిపురుగుల నివారణపై అవ గాహన పోస్టర్లను, క్యాలెండర్లను ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ లలితా కుమారితో కలసి మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ త్వరలో ఆర్బీఎస్కె (రాష్ట్రీయ బాల వికాస కార్యక్రమం)తో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిం చారు. పుట్టుకతో వచ్చే వ్యాధులను విద్యా ర్థుల జనన ధ్రువీకరణపత్రం ఆధారంగా గుర్తించి బాలల వికాసానికి కృషి చేస్తామ న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మోడ్రన్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో ప్రా«థమిక ఆరోగ్యకేంద్రం స్థాయిని బట్టి డయాగ్నోస్టిక్ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తామన్నారు. నిలో ఫర్, గాంధీ ఆస్పత్రుల ఘటనలపై మంత్రిని ప్రశ్నించగా పరిశీలిస్తామన్నారు. నేడు నివారణ మాత్రల పంపిణీ నులిపురుగుల నివారణ కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారందరికీ ఈ మాత్రలను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో పంపిణీ చేసేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది.