breaking news
child nutrition
-
కొత్త రుచులు వద్దమ్మా..
పిల్లలు కొత్త రకాల ఆహార పదార్థాలు తినడానికి మొండికేస్తున్నారా? కేవలం కొన్ని రకాల వంటకాలే తింటామని పట్టుబడుతున్నారా? అయితే దీన్ని వారి మంకుతనంగా కొట్టిపారేయలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివెనుక ఫుడ్ నియోఫోబియా (కొత్త ఆహారాన్ని చూసి భయపడటం లేదా నిరాకరించడం) అనే సమస్య ఉండవచ్చని హైదరాబాద్‌లోని భారతీయ వైద్య పరిశోధనా మండలి–జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) తాజా అధ్యయనంలో తేలింది.తల్లుల అవగాహన, తినిపించే పద్ధతులు పిల్లల ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తాయని పరిశోధన వెల్లడించింది. హైదరాబాద్‌లోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన 150 మంది తల్లులు, వారి పిల్లలను (2–7 ఏళ్లు) ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. పిల్లల శారీరక పెరుగుదల, బరువును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పరిశీలించారు. అలాగే తల్లుల అవగాహనను, వారు పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు ప్రదర్శించే ప్రవర్తనను ఒక ప్రశ్నావళి ద్వారా అంచనా వేశారు.77 శాతం మందిలో మధ్యస్థ లక్షణాలు..ఈ అధ్యయనంలో పాల్గొన్న పిల్లల్లో దాదాపు 77 శాతం మందికి మధ్యస్థంగా, 11.3 శాతం మందికి తీవ్రంగా ఫుడ్ నియోఫోబియా సమస్య ఉన్నట్లు తేలింది. 12 శాతం మంది పిల్లలు మాత్రమే కొత్త ఆహారాన్ని సులభంగా స్వీకరిస్తున్నారు. ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లో కొత్త ఆహారాన్ని నిరాకరించే గుణం కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తగినంత బరువు లేని పిల్లలు కొత్త వంటకాలను తినడానికి ఎక్కువ మొండితనం ప్రదర్శిస్తున్నట్లు ఈ పరిశోధనలో స్పష్టమైంది. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలా తినిపించాలనే విషయాలపై అవగాహన, ఓర్పు ఉన్న తల్లుల పిల్లల్లో ఈ భయం తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.బలవంతంగా తినిపించవద్దు..పిల్లల ఆహార అలవాట్లను మార్చడానికి తల్లులు కొన్ని నియమాలు పాటించాలని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కార్తికేయన్ రామానుజం సూచించారు. కొత్త వంటకాలను పిల్లలకు బలవంతంగా తినిపించకూడదని.. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పలుమార్లు ఆ ఆహారాన్ని వారికి పరిచయం చేయాలన్నారు. భోజనం చేసే సమయంలో పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు.పిల్లలు ఆహారం తినేందుకు నిరాకరిస్తే వారిని తిట్టరాదని.. ప్రేమగా తినిపించడం అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలు, పోషకాహార పథకాల ద్వారా తల్లులకు ఈ విధమైన తినిపించే పద్ధతులపై కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలను అధిగమించవచ్చని ఎన్ఐఎన్ తెలిపింది. పిల్లల చిన్నతనంలో తినే వైవిధ్యమైన ఆహారంపైనే వారి భవిష్యత్తు ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని.. కాబట్టి తల్లిదండ్రులు ఓపికతో వ్యవహరించాలని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: మనసంతా తిండి మీదే! ఆ రీజన్ వల్లే ఈ సమస్య.. -
బాబు తినడం లేదా? అసలు కారణం ఇదే!
మా బాబు వయసు మూడున్నరేళ్లు. సరిగ్గా తినడం లేదు. కొంచెం తిన్న వెంటనే ఇక చాలు అంటున్నాడు. అందుకే, వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు పెరగడం లేదు అనుకుంటున్నాను. మా అబ్బాయి బాగా తినాలంటే ఏం చేయాలి?– రమణి, హైదరాబాద్.పిల్లల విషయంలో అసలు ప్రశ్న ‘ఎంత తిన్నాడు?’ అనేది కాదు ‘ఏం తిన్నాడు?’ అనేదే. పిల్లల కడుపు నిండితే సరిపోదు. మెదడు ఎదగాలి, ఎముకలు బలపడాలి, కండరాలు పెరగాలి, రోగనిరోధక శక్తి మెరుగవ్వాలి! పిల్లల పెరుగుదలకు క్యాలరీల కంటే క్వాలిటీ న్యూట్రిషన్ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..మెదడుకు ‘ఫ్యూయల్’ కావాలి!పిల్లల జీవితంలోని తొలి సంవత్సరాలు మెదడు అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ సమయంలో ప్రొటీన్ , ఐరన్ , జింక్, అయోడిన్ , ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అందేలా చూడాలి.ఐరన్ ఎంతో ముఖ్యమైనది! ఐరన్ తక్కువైతే రక్తహీనత మాత్రమే కాదు, ఏకాగ్రత, చురుకుదనం తగ్గి, నేర్చుకునే సామర్థ్యం ప్రభావితం కావచ్చు. అందుకే పప్పులు, ఆకుకూరలు, గుడ్డు, మాంసాహారం, రాగి వంటివి పిల్లల భోజనంలో చేర్చాలి. ఐరన్ ఉన్న ఆహారంతో పాటు నిమ్మ, జామ, ఉసిరి వంటి విటమిన్ –సి ఉన్న పదార్థాలు ఇస్తే ఐరన్ శరీరంలోకి బాగా చేరుతుంది.ప్రొటీన్ ఎదుగుదలకు బిల్డింగ్ బ్లాక్స్!‘బాబు బాగా తింటున్నాడు’ అనడం కంటే ‘బాబుకు రోజూ మంచి ప్రొటీన్ అందుతోందా?’ అని ఆలోచించండి. గుడ్డు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, పెసలు, చేపలు, మాంసం వంటివన్నీ పిల్లల ఎదుగుదలకు మంచి ప్రొటీన్ వనరులు.బలమైన ఎముకలకు పాలు!పాలు మంచివే. కానీ ఎముకల బలానికి పాలు ఒక్కటే సరిపోవు. కాల్షియం, విటమిన్ –డి, శారీరక చలనం కూడా అవసరం. పాలు, పెరుగు, రాగి, నువ్వులు, పనీర్ వంటి వాటి ద్వారా కాల్షియం అందుతుంది. వైద్యుల సూచన మేరకు అవసరమైతే మందుల ద్వారా కూడా తీసుకోవటం ఉత్తమం.జింక్ కొంచెమే... ఫలితమే ఘనంజింక్ పిల్లల ఎదుగుదలకు, కణాల అభివృద్ధికి, రోగనిరోధకతకు సహాయపడుతుంది. పప్పులు, గింజలు, నువ్వులు, గుడ్లు, చేపలు, మాంసాహారం వంటి వాటిలో జింక్ లభిస్తుంది.విటమిన్ –ఏ అంటే క్యారెట్ మాత్రమేనా?కాదు. విటమిన్ –ఏ కళ్ల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. క్యారెట్‌తో పాటు గుమ్మడికాయ, ఆకుకూరలు, మామిడి, బొప్పాయి వంటి రంగురంగుల పండ్లు, కూరగాయలను పిల్లల ఆహారంలో చేర్చాలి. పిల్లల ప్లేట్లో రంగులు పెరిగితే, పోషకాల్లో కూడా వైవిధ్యం పెరుగుతుంది.ఒమేగా–3 ఎందుకు అవసరం?ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు, కళ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయి. చేపలు దీనికి మంచి వనరులు. శాకాహారంలో అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ వంటి వాటి ద్వారా కూడా ఇవి లభిస్తాయి. అయితే చిన్నపిల్లలకు గింజలు, నట్స్ ఇస్తున్నప్పుడు వయసుకు తగినట్లు సురక్షిత రూపంలోనే ఇవ్వాలి.పిల్లల ప్లేట్‌కి ‘5 కలర్స్’ చాలెంజ్!పిల్లల ప్లేట్లో పసుపు రంగులో ధాన్యం అన్నం, రొట్టె, రాగి, జొన్న; ఆకుపచ్చ రంగులో కూరగాయలు, ఆకుకూరలు; ఎరుపు రంగులో పప్పు, గుడ్డు, చేప, మాంసం; నారింజ రంగులో పండు; తెలుపు రంగులో పాలు, పెరుగు ఉండేలా ప్రయత్నించండి. వివిధ రకాల ఆహారాలను కలిపి ఇవ్వడం వల్ల పిల్లలకు అనేక రకాల పోషకాలు అందుతాయి.చిరుతిండ్లు పూర్తిగా మానేయాలా?పూర్తిగా నిషేధించడం కంటే వాటిని అలవాటుగా మారకుండా చూడటం ముఖ్యం. రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వడం మంచిది. తరచుగా ప్యాకెట్ ఆహారం, తీపి పానీయాలు అధికంగా ఇవ్వడం వల్ల పిల్లల ఆహార నాణ్యత తగ్గుతుంది.మొబైల్ చూపిస్తూ తినిపించడం తప్పా?తినేటప్పుడు మొబైల్ చూపించడం అలవాటుగా మారితే పిల్లలు ఆకలి, తృప్తి సంకేతాలను గమనించకుండా తినే అవకాశం ఉంటుంది. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మొబైల్‌ను పక్కన పెట్టి, పిల్లలతో మాట్లాడటం, వాళ్లు తినే ఆహారంపై దృష్టి పెట్టేలా చేయడం మంచిది.బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనా?అసలు కాదు. పిల్లల ఆరోగ్యాన్ని కేవలం బరువుతో నిర్ణయించలేం. ఎత్తు, బరువు, వయసుకు తగిన శరీర బరువు సూచిక, ఎదుగుదల పట్టికలను కలిపి చూడాలి. బరువు తక్కువగా ఉండటమే ఆందోళనకరం కాదు, అధిక బరువు కూడా అంతే శ్రద్ధ పెట్టాల్సిన విషయమే.ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?పిల్లల బరువు సరిగ్గా పెరగకపోతే, ఎత్తు పెరుగుదల మందగిస్తే, తరచు అనారోగ్యానికి గురైతే, చాలాకాలంగా ఆకలి తగ్గిపోయి ఉంటే లేదా ఎప్పుడూ నీరసంగా కనిపిస్తే దాన్ని కుటుంబంలో అందరికీ ఇలాగే ఉంటుంది అని వదిలేయకండి. పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.చివరగా ఒక మాట– పిల్లల ప్లేట్ నిండితే సరిపోదు, అది పోషకాలతో నిండాలి.- డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ఇదీ చదవండి: Health: నో ఆపరేషన్, నో చిప్స్... కేవలం ఐ డ్రాప్స్‌తో మళ్లీ చూపు! -
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే డాక్టర్ రెడ్డీస్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా పిల్లల పోషణ ఉత్పత్తుల్లోకి ప్రవేశించింది. సెలీహెల్త్ కిడ్జ్ ఇమ్యునో ప్లస్ పేరుతో రోగ నిరోధక శక్తిని పెంచే గమ్మీస్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..? వెల్మ్యూన్, ప్రీబయోటిక్స్, విటమిన్లు, లవణాల వంటి పదార్ధాల కలయికతో శాస్త్రీయంగా వీటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 30 గమ్మీస్తో కూడిన ప్యాక్ ధర రూ.480 ఉంది. మందుల షాపుల్లో, ఆన్లైన్లో లభిస్తుంది. (అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్: భారీగా పెరిగిన ఈ-కామర్స్ ఎగుమతులు) -
చిట్టి పొట్ట నిండుతలేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శిశుపోషణ ఆందోళనకరంగా మారుతోంది. నవజాత శిశువుకు ఆరు నెలల వరకూ తల్లి పాలు ఇస్తుండగా.. ఆ తర్వాత ఘనాహారం ఇవ్వాలి. చిన్నారుల ఎదుగుదలకు ఈ సమయంలో పోషణే కీలకం. కానీ రాష్ట్రంలో మెజారిటీ శాతం పిల్లలకు సరైన పోషణ అందడం లేదు. ఆరు నెలలు దాటిన చిన్నారులకు ఘనాహారం పంపిణీపై శిశు సంక్షేమ శాఖ పరిశీలన నిర్వహించగా.. పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 9.6 శాతం మంది పిల్లలు మాత్రమే ఆరు నెలలు నిండిన తర్వాత ఘనాహారం తీసుకుంటున్నట్లు ఈ పరిశీలనలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉన్నా.. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ కేంద్రాలు. వీటి పరిధిలో 23.71 లక్షల మంది చిన్నారులు నమోదు కాగా.. వీరిలో 7.25 లక్షల మంది ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు వయసున్నవారు. ఈ క్రమంలో చిన్నారులు ఘనాహారం తీసుకునే తీరుపై ఆ శాఖ పరిశీలన చేయగా.. ఇందులో సగటున 9.6 శాతం చిన్నారులు మాత్రమే సకాలంలో ఘనాహారం తీసుకుంటు న్నట్లు వెల్లడైంది. ఆరు నెలలు దాటిన చిన్నారుల ఎదుగుదల రెండురెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా అవయవాల పెరుగుదల వేగం పుంజుకుంటుంది. దీంతో ఆరు నెలలు దాటిన తర్వాత చనుబాలతో పాటు ఉగ్గు, ఫారెక్స్లాంటి పొడితో కూడిన పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకీ వెనుకబాటు.. చిన్నారులకు పోషకాహారం ఇవ్వడం తప్పనిసరైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువభాగం చనుబాలతోనే సరిపెడుతున్నారు. ఎక్కువ మంది చిన్నారులకు ఏడాది దాటిన తర్వాతే పోషకాహార పంపిణీ మొదలుపెడుతున్నట్లు శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో పోషకాల పంపిణీపై అవగాహన లేకపోవడం కారణమైతే.. కొన్ని సందర్భాల్లో ఆర్థిక స్తోమత మరో కారణమని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే పోషకాహార పంపిణీ ఆందోళనకరంగా ఉంటోందని శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది. ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోషకాహార పంపిణీ చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు నెలలు నిండిన చిన్నారులకు ఉగ్గు తదితరాలు కాకుండా సాధారణ భోజనం(మొత్తగా వండిన అన్నం), పెరుగన్నం లాంటివి మెత్తబర్చి పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే తృణధాన్యాలతో కూడిన పోషకాల పంపిణీ సంతృప్తికరంగా జరగడంలేదు. సరైన పోషకాలు అందకపోవడంతో చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈ బండకో దండం!
సాక్షి, కాకినాడ : ‘గ్యాస్’ బండ సామాన్యులకే కాదు..చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలకు సైతం గుదిబండగా తయారైంది. అస్తవ్యస్తంగా తయారైన ఆధార్ అనుసంధాన ప్రక్రియతో ఇప్పటికే సామాన్యులు నరకం చూస్తుంటే ఇప్పుడు ఆ వరసలో అంగన్వాడీ కేంద్రాలూ చేరాయి. అంతేకాదు.. కేంద్రాలకు సరఫరా చేసే గ్యాస్‌కు సబ్సిడీ లేకపోవడంతో మార్కెట్ రేటే చెల్లించక తప్పదు. జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న అంగన్వాడీ కేంద్రాలకు రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా 890 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. కట్టెల పొయ్యిలతో ఇక్కట్ల పాలవుతున్నప్పటికీ గ్యాస్ కనెక్షన్లు తీసుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 24 ప్రాజెక్టుల పరిధిలో 5,300 కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో 30 మంది చిన్నారులు, 20 మంది వరకు గర్భిణులు, బాలింతలుంటారు. గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరకిలో నూనె సరఫరా చేస్తారు. ప్రతి చిన్నారికీ రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల ఆయిల్ సరఫరా చేస్తారు. వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. పప్పులో కలుపు కూర వేసేందుకు ఒక్కో చిన్నారికి 20 పైసల చొప్పున చెల్లిస్తారు. వీటిని వండేందుకు పుల్లల ఖర్చు కింద గతంలో రూ.150 ఇచ్చే వారు. ప్రస్తుతం రూ.210 చెల్లిస్తున్నారు. బండరేటు రూ.1100.. ఇచ్చేది రూ.210 నవంబర్ ఒకటి నుంచి పాఠశాలల మాదిరిగానే ఈ కేంద్రాలు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పనిచేసేలా వేళలను మార్చారు. అలాగే ఈ కేంద్రాలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. గతంలో 17 ప్రాజెక్టులు మాత్రమే ఉండేవి. వీటి పరిధిలో ఉండే కేంద్రాలకు నెలనెలా పుల్లల ఖర్చు ఇచ్చేవారు. 2002లో మంజూరైన కొత్త కేంద్రాలకు అప్పట్లో గ్యాస్కనెక్షన్లు మంజూరు చేశారు. 2006లో ‘రెడీ టు ఈట్ స్కీమ్’ రావడంతో మొత్తం కేంద్రాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. మళ్లీ 2010లో మూడవ వంతు కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఈలోగా ఆధార్ అనుసంధానం అమలులోకి రావడంతో అంగన్వాడీ కార్యకర్తలు తమ ఆధార్‌నే ఈ కనెక్షన్లకు అనుసంధానం చేశారు. దీంతో వ్యక్తిగతంగా వారి పేరిట ఉండే గ్యాస్ కనెక్షన్లు పూర్తిగా లాక్ అయ్యాయి. కేంద్రాల్లో ఉన్న కనెక్షన్లకు తమ ఆధార్ నంబర్‌తో అనుసంధానించడం వలన ప్రస్తుతం ఇంట్లో కనెక్షన్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని అంగన్వాడీలు ఐసీడీఎస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయింది. ఇటీవల అమలు లోకి వచ్చిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వారికి భారంగా తయారైంది. బయట కట్టెల పొయ్యిలపై వండించి కేంద్రాలకు తీసుకొచ్చి చిన్నారులకు పెడుతున్నారు. ఈ తరుణంలో మంజూరైన గ్యాస్ కనెక్షన్లు వీరికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. నాన్‌సబ్సిడీ కోటాలో ఇస్తున్న ఈ గ్యాస్ సిలిండర్‌కు మార్కెట్ రేటు ప్రకారం రూ.1100 పైగా చెల్లించాల్సి వస్తుంది. కానీరూ.210 మాత్రమే పుల్లల ఖర్చు కింద చెల్లిస్తామని, మిగిలిన మొత్తాన్ని అంగన్వాడీ కార్యకర్తలే భరించాలని ప్రభుత్వం అంటోంది. దీనికితోడు ఆధార్ నంబర్ లేకుండా ఈ కనెక్షన్ మంజూరు చేసే పరిస్థితి లేదు. ఎవరి ఆధార్ నంబర్ ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితిలో అంగన్వాడీ కార్యకర్తలున్నారు. ఎలా చూసినా గ్యాస్ కనెక్షన్ గుదిబండగానే తయారైంది. దాంతో అంగన్వాడీ కార్యకర్తలు మాకొద్దీ కనెక్షన్లంటూ మొర పెట్టుకుంటున్నారు. అలా కాకపోతే.. ఆధార్‌తో లింకు పెట్టకుండా సబ్సిడీ ధరకే తమ కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


