breaking news
child name
-
రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?
మెగా ఇంట్లో ఈ ఏడాది పండగ వాతావరణం నెలకొంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టింది. జూన్ 20న రామ్ చరణ్ భార్య ఉపాసన పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. తాజాగా మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) ఈ వేడుకలో తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డ పేరును క్లీంకార అంటూ రివీల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాసన తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే మెగా వారసురాలి పేరుపై ఉపాసన మదర్ శోభన కామినేని ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఉపాసన బిడ్డ పేరును ప్రస్తావిస్తూ ఫోటోలను షేర్ చేసింది. మొదట ఉపాసన పుట్టినప్పుడు ఈ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఉపాసన బిడ్డకు ఈ పేరు పెట్టడంతో చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది. ఉపాసన రిప్లై ఈ పోస్ట్ చూసిన ఉపాసన కూడా స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తన తల్లి శోభన పోస్ట్‌ను షేర్ చేసింది. లవ్ యూ మామ్ అంటూ మదర్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) View this post on Instagram A post shared by Shobana Kamineni (@shobanakamineni) -
తమ కొడుకు పేరు చెప్పేసిన కాజల్ భర్త గౌతమ్ కిచ్లు
Kajal Aggarwal Son Name: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం వారికి మగ బిడ్డ పుట్టినట్లు తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లు, ఆమె సోదరి నిషా అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకుగౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. అలాగే నిషా అగర్వాల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరు నీల్ కిచ్లుగా గౌతమ్ ధృవీకరించాడు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్! కాగా ఈ ఏడాది జనవరిలో కాజల్ తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలను, భర్త గౌతమ్ కలిసి బేబీ బంప్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ వచ్చింది. ఇక 2020 అక్టోబర్ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) చదవండి: కొత్త జంటకు రణ్‌బీర్ తల్లి కళ్లు చెదిరే ఫ్లాట్ గిఫ్ట్, ఖరీదెంతంటే! -
పదిరాత్రులు తర్వాత నామకరణం..
మనిషికి జరిపే ప్రథమ సంస్కారం జాతకర్మ. ఈ సంస్కారాన్ని, బిడ్డ పుట్టిన రోజేకానీ లేదా పదకొండురోజులలో ఏదో ఒక రోజునకానీ జరపాలని శాస్త్రం. ప్రసవానికి ఒక మాసం ముందే ప్రసూతి గృహాన్ని వాస్తు శిల్పాచార్యుల సూచనల మేరకు తూర్పు/ఉత్తరం/దక్షిణ వాకిలితో నిర్మించి, వారి ఆశీర్వాదం తీసుకుని, దేవతలను పూజించి, సంతానం గల ముత్తైదువలు, మంత్రసానులతో ప్రసవదినానికి మూడు/నాలుగు రోజుల ముందు ఆ గృహంలో ప్రవేశించాలి. ప్రసవ దినాన, స్వర్ణశిల్పాచార్యులచే నూత్నంగా చేయించిన బంగారు చెంచాతో బాగా రుద్దిన తేనెను నెయ్యితో కలిపి శిశువుకు నాకించాలి. తర్వాత బియ్యాన్ని, యవలను కూడా నాకించాలి. తదుపరి శోష్యంతీ హోమం చేయాలి. సంస్కార విధానం: శుభదినాన, సంకల్పం చెప్పుకుని, గణపతిపూజ, పుణ్యహవాచనం జరిపించి, తండ్రి తన ఒడిలో శిశువునుంచుకోవాలి. కొన్ని వేదమంత్రాలను శిశువు కుడిచెవిలో చదివి, శిశువుచేత నెయ్యి కలిపిన తేనెనూ, బియ్యాన్నీ, యవలనూ నాకించాలి. తరువాత శిశువుకి స్నానం చేయించి శోష్యంతీ హోమం జరిపించాలి. తరువాత శిశువుకు మాతృస్తన్యం ఇప్పించాలి. తదుపరి కులాచారాన్ని, కుటుంబాచారాలను అనుసరించి ఒక శుభనక్షత్రాన శిశువు తల్లికి పగటిపూట స్నాన ం చేయించాలి. 12వ రోజున గృహ శుద్ధి కొరకు స్వస్తి పుణ్యహవాచనం జరిపించి శాంతిహోమం చేసి ఆచార్యులకు భోజన దక్షిణ తాంబూలాదులను ఇచ్చి పంపాలి. నిష్క్రమణం: శిశువును ప్రసూతి గృహం నుంచి శాస్త్రం చెప్పిన ప్రకారం బైటకు తీసుకు రావడాన్నే నిష్క్రమణం అంటారు. ఈ సంస్కారాన్ని శిశువు పుట్టిన పన్నెండవరోజునుండి మూడుమాసాలలోపల చెయ్యాలని శాస్త్రవచనం. ఈ సంస్కారాన్ని శిశువు మేనమామ చేయించాలి. ఒకరోజు ఒక శుభ ముహుర్తాన సూర్యదర్శనం చేయించి ఆ తర్వాత మరొక రోజు మరొక శుభముహుర్తాన చంద్ర దర్శనం చేయించాలని స్మృతివాక్యం. సంస్కార విధానం: శుభదినాన ఉదయాన్నే, ఇంటి ఆవరణలో ఒకచోట సూర్యరశ్మి పడుస్థలాన్ని ఆవుపేడతో అలికి ముగ్గులుపెట్టాలి. దానిపై అక్షింతలు, నవధాన్యాలు చల్లాలి. శిశువుమేనమామ శిశువును ఎత్తుకుని ప్రసూతి గృహమునుండి బైటకు నడుచుచుండగా, ఆచార్యులు శుభ సూక్తాలు పఠించుచుండగా, శిశువుతల్లిదండ్రులు, బంధువులు మంగళవాద్యాలతో అనుసరించాలి. శుభప్రదేశంలో, కూర్చుని, గణపతిపూజ, సూర్యావాహనం, అష్టదిక్పాలక ఆవాహనం, ఇష్టదేవతాపూజ జరిపించి, అందరిచేత శిశువుకు ఆశీర్వచనాలు ఇప్పించి భోజనాదులను చేయించి పంపాలి. ఇలాగే ఒక రాత్రిపూట, శిశువుకు చంద్రదర్శనం కూడా చేయించాలి.ఈ సంస్కారంలో హోమం చేయించాలని కొందరు స్మృతికారులు చెప్పియున్నారు. నామకరణం: శిశువుపుట్టిన పదిరాత్రులు గడచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం. కొందరు స్మృతికారులు సంవత్సరంలోపు చేయవచ్చని చెప్పియున్నారు. శిశువుకు మూడురకాల పేర్లు పెట్టవచ్చని శాస్త్రాలలో చెప్పారు. అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి, గ్రహదోషాలు, పాపపీడలుపోవుటకు రహస్య నామం (నక్షత్రం నామం) ఒకటి, అందరూ పిలుచుకోవడానికి వ్యవహార నామం ఒకటి. శిశువులకు పెట్టే పేరు విషయంలో చాలా నియమాలను పాటించాలని స్మృతికారులు చెప్పియున్నారు. వారిలో భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ, ఏతావాతా ప్రధానంగా కొన్ని సారూప్యాలు గమనించగలం. మగ శిశువుకు రెండు లేక నాలుగు అక్షరాలతో, ఆడ శిశువుకు మూడు లేక ఐదు అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం. మరొక స్మృతికారుడు, మగ శిశువుకు సరి సంఖ్యలో, ఆడ శిశువుకు బేసి సంఖ్యలో అక్షరాల సంఖ్య వుండాలని చెప్పాడు. గ, ఘ, ఙ, జ, ఝ, ఞ, డ, ఢ, ణ, ద, ధ, న, బ, భ, మ, య, ర, ల, వ, హ, అను అక్షరాలతో పేరు మొదలవ్వాలని నియమం చెప్పారు. మాతృభాషలోగానీ, దేవభాషలోగానీ పేరు పెట్టుకోవాలని శాస్త్ర నియమం. దేవతల పేర్లు, ప్రకృతి సంబంధమైన పేర్లుగానీ పెట్టుకోవాలని స్మతికర్తలు సూచించారు. పితామహ (జేజినాయన), ప్రపితామహ (జేజినాయన తండ్రి) , మాతమహ (తాత), గోత్రకర్త, మొదలగువారి పేర్లు పెట్టుకోవచ్చు. అర్థం మాలినవి, మనకు సంబంధం లేని భాషలపదాలు, రెండుమూడు భాషలలోని పదాలు కలిపి, అశుభాన్ని సూచించేవి, పలకడానికి కష్టంగా వుండేవి, ఎక్కువ దీర్ఘాక్షరాలతో వుండేవి, లకారాంతం వుండేవి పనికిరావని స్మృతికారులు చెప్పియున్నారు. సరళమైనవి, శుభకరమైనవి, పేరు చివరలో దీర్ఘం కానీ విసర్గగానీ వుండేవి, స్పష్టమైన అర్థంకలవి, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం. పురుషుల పేర్లు స్త్రీలకు, అలాగే స్త్రీలపేర్లు పురుషులకు పెట్టరాదు అని నియమం. కొన్ని కొన్ని సార్లు, ఎక్కువమంది పిల్లలు పుట్టి చనిపోతుంటే, దుష్టశక్తులబారినుండి శిశువులను కాపాడేందుకు, విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది. సంస్కార విధానం: శుభ ముహుర్తాన, శిశువు తల్లిదండ్రులు నూతన వస్త్రాలు ధరించి, గణపతి పూజ, పుణ్యహవాచనము జరిపించాలి. ఒక ఇత్తడి పళ్ళెంలో బియ్యంపోసి, ఆ శిశువు జన్మించిన మాస నామం, నక్షత్ర నామం, వ్యావహారిక నామం బంగారంతో వ్రాసి, వానిపై నక్షత్రాధిదేవతలనూ, ఇంటి ఇలవేల్పులనూ, సకల దేవతలనూ ఆవాహనంచేసి షోడశోపచారాలతో పూజించాలి. ఆవుపాలను నైవేద్యంగా సమర్పించి, ఆ పాలను శిశువుచేత తాగించాలి. శిశువుకుపెట్టిన వ్యావహారిక నామంతో, శిశువు తండ్రి, తల్లి, శిశువు చెవిలో మూడుసార్లు పిలవాలి. శాస్త్రానుసారం హోమాది ఇతర ఆచారాలను పూర్తిచేసి, అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత శిశువు తల్లి మండలం రోజులవరకు వంటచేయరాదు. శిశువు జన్మించినది మొదలు సంవత్సరం వరకు తల్లిదండ్రులు మాంసాహారం తినరాదని శాస్త్రం. ఎందుకనగా, సంవత్సరం వరకూ శిశువు తల్లిదండ్రులు ప్రతిమాసంలో జన్మదినమందు స్థాలీపాకం చేయాలి. జన్మ నక్షత్రంలో దోషముండినగానీ, లేక ఇతర దోషాలుండినచో, నక్షత్ర శాంతి, లేక దోషానికి సంబంధించిన శాంతులు శాస్త్రోక్తంగా జరిపించాలి. ఆరోజుకానీ, మరుసటిరోజుకానీ, శిశువును ఊయలలో పడుకోబెట్టాలి. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు (సశేషం) -
పిల్లాడికి 'వికీలీక్స్' పేరు పెట్టొద్దు!!
పిల్లాడికి ఇష్టమైన పేరు పెట్టాలన్నా కూడా తప్పేనా? అవునంటోంది జర్మనీ ప్రభుత్వం. అక్కడ ఓ జంట తమకు కొత్తగా పుట్టిన పిల్లాడికి వికీలీక్స్ అనే పేరు పెట్టాలనుకుంది. కానీ, ఆ పేరు పెట్టడానికి వీల్లేదంటూ ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. ఆ పేరు పెడితే భవిష్యత్తులో పిల్లవాడికి ప్రమాదం కలగొచ్చన్నది వారి అభ్యంతరం. ఇరాక్‌కు చెందిన హజర్ హమాలా అనే పాత్రికేయుడు జర్మనీలో ఉంటాడు. అతడు తన పిల్లాడికి జూలియన్ అసాంజ్ స్థాపించిన 'వికీలీక్స్' అనే పేరు పెట్టాలనుకున్నాడు. అయితే, మార్చి 14న పుట్టిన ఆ పిల్లాడికి ఆ పేరు పెట్టడానికి, రిజిస్టర్ చేయడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డుపడ్డారు. పిల్లల సంక్షేమానికి, భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని భావిస్తే ఆయా పేర్లను పెట్టకుండా అడ్డుకోవచ్చని అక్కడి జనన ధ్రువీకరణ అధికారులకు హక్కులు ఇచ్చారు. దాంతోనే ఇప్పుడు వికీలీక్స్ పేరును సదరు అధికారి అడ్డుకున్నట్లు తెలుస్తోంది.