breaking news
chief commissioner of Income Tax
-
ఆదిమూలపు సురేష్ సతీమణి విజయలక్ష్మికి భారీ పదోన్నతి
సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి ఇన్‌కంట్యాక్స్ చీఫ్ కమిషనర్‌గా 1992 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారిణి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సతీమణి టీహెచ్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈనెల 11వ తేదీ ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 33 సంవత్సరాలుగా ఇన్‌కంట్యాక్స్ అధికారిణిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఆయా స్థానాలకు వన్నెతెచ్చిన ఉత్తమ అధికారిణిగా గుర్తింపు పొందారు. తన విధి నిర్వహణలో జాయింట్ కమిషనర్‌గా బెంగళూరు, రాయచూర్‌లలో, అడిషనల్ కమిషనర్‌గా కర్నూలులో, కమిషనర్‌గా చెన్నైలో, ప్రిన్సిపల్ కమిషనర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు. విజయలక్ష్మి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈసీఈ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎం బెంగళూరులో ఎంబీఏ కోర్సు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ప్రజా విధానాలపై సింగపూర్ యూనివర్సిటీ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక డిగ్రీ సాధించారు. -
సీబీఐ వలలో ఐటీ చీఫ్ కమిషనర్
రాజస్థాన్: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ జోధ్‌పూర్ ఐటీ చీఫ్ కమిషనర్ పీకే శర్మ సీబీఐ వలకు చిక్కారు. దాదాపూ రూ. 15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మాజీ ఐటీ ఉన్నతాధికారి శైలేంద్ర బండారిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారిని సీబీఐ కార్యాలయానికి తరలించింది.


