breaking news
CHENNUR police
-
సెల్యూట్ పోలీస్.. 7 నిమిషాల్లో రక్షించారు
చనిపోవాలని అనుకున్నాడు. ఉరితాడు ప్యాన్‌కు వేలాడింది. చావు చివరి కోరిక వీడియో సందేశాన్ని పోన్ ద్వారా పంపాడు. చివరికి ఆ సందేశం ఆధారంగానే అతన్ని ఉరితాడు నుంచి విముక్తి కల్పించారు పోలీసులు. 7 నిమిషాల్లో నిండు ప్రాణాలను కాపాడి తల్లి వద్దకు కొడుకుని చేర్చిన సంఘటన మంచిర్యాల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. చెన్నూరులోని ఓ వ్యక్తి కుటుంబ సమస్యలతో బాధపడుతూ అత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్యాన్ ఉరివేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో తను చనిపోతున్నానని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. చదవండి: పల్లెల్లో షీటీమ్స్! వెంటనే అప్రమత్తమైన అతని తల్లి, మిత్రులు చెన్నూరు పోలీసులను ఆశ్రయించారు. పోన్ సందేశాన్ని పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ఉరేసుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే సంబంధిత ప్రాంతానికి పోలీసులు నిమిషాల్లో చేరుకొని బాధితుడి ప్రాణాలు కాపాడారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాలలో జరిగిపోవడంతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసుల తీరును కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ విషయాన్నిరామగుండం పోలీస్ కమిషనర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. -
పోలీసుస్టేషన్లో యువకుడి ఆత్మహత్యాయత్నం
చెన్నూర్ : ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ పోలీసుస్టేష న్లో పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు నిప్పంటిం చుకున్నాడు. బంధువుల కథనం ప్రకారం.. కొత్తగూడెం కాలనీకి చెందిన సాధనబోయిన ప్రవీణ్ సోదరుడు సాయికిరణ్‌కు నెల క్రితం కిష్టంపేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపో యాడు. అదే స్థలంలో గ్రామానికి చెందిన పలువురు దాడిచేసి చంపారని అతని కుటుంబ సభ్యు లు వారం తర్వాత చెన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ప్రవీణ్ శనివారం రాత్రి పోలీసుస్టేషన్ కు వెళ్లాడు. వెంట తెచ్చుకుని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌కు తీసుకెళ్లారు.