breaking news
chennai women
-
అమెరికాలో డిప్యూటీ మేయర్‌గా చెన్నై మహిళ
టీ.నగర్: అమెరికాలో డిప్యూటీ మేయర్‌గా చెన్నైకు చెందిన మహిళ ఎన్నికయ్యారు. చెన్నైకు చెందిన మహిళ షెపాలి రంగనాథన్(38) ఈమె అమెరికాలో సీటిల్ నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈమె ఒక స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. షెపాలి తండ్రిపేరు రంగనాథన్. తల్లి పేరు షెరిల్. వీరు చెన్నైలో ఉంటున్నారు. ఇలా ఉండగా షెపాలి తన విద్యాభ్యాసాన్ని చెన్నై నుంగంబాక్కంలో గల గుడ్‌షెప్పర్డ్ కాన్వెంట్లో పూర్తి చేశారు. స్టెల్లా మేరీస్ కళాశాలలో బీఎస్సీ జువాలజీ పట్టా పొందారు. అన్నావర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో ఉత్తీర్ణులై బంగారు పతకాన్ని పొందారు. 2001లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లారు. అంతేకాకుండా షెపాలి రంగనాథన్ చెన్నై బోట్‌క్లబ్‌లో నిర్వహించిన అనేక పడవ పోటీల్లో పాల్గొన్నారు. -
బ్రేక్ ఫెయిలై భక్తురాలి పైనుంచి..
తిరుమల: చెన్నై నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ భక్తురాలి పైనుంచి ప్రమాదవశాత్తూ బొలేరో వాహనం వెళ్లింది. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న పార్కింగ్‌లో ఉంచిన బొలేరో వాహనం గేర్, హ్యాండ్ బ్రేక్ ఫెయిలవ్వడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన గీత (47) కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. గో గర్భం డ్యాం వద్ద మౌనస్వామి మఠంలో బస చేశారు. శ్రీవారిని ద ర్శించుకుని తిరిగి గదికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో గదిని ఖాళీ చేసి వెలుపల తమ వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఎత్తు ప్రాంతంలో పార్కింగ్‌లో ఉంచిన బొలెరో వాహనం వేగంగా దూసుకువచ్చింది. ఎదురుగా పార్కింగ్‌లో ఉంచిన టెంపో ట్రావెలర్‌ను ఢీకొని, తర్వాత రోడ్డు పక్కనే నిలబడిన గీతను ఢీకొట్టింది. ఆమె తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో అశ్విని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బొలేరో వాహనం మఠాల్లో దోబీ బట్టలు తీసుకెళ్లేందుకు వచ్చిందని, గేర్, బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తమతో ఆనందంగా గడిపిన గీత నిమిషాల వ్యవధిలో మృతిచెందడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


