breaking news
Chegondi book
-
40 సీట్ల కోసం పవన్ ప్రయత్నం: హరిరామజోగయ్య
సాక్షి, విజయవాడ: ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే కనీసం రెండున్నరేళ్లయినా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. జన సైనికులు కూడా ఇదే భావిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్‌కు తాను చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం హరిరామజోగయ్య ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 40 నుంచి 60 సీట్లు కోరాలని పవన్‌కు సూచించానని తెలిపారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం 40 సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తనతో చెప్పారని జోగయ్య పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపైనా పవన్‌తో చర్చించానని తెలిపారు. గతంలోనూ హరిరామ జోగయ్య ఇదే విధంగా బహిరంగ లేఖ విడుదల చేయడం గమనార్హం. ఇదీచదవండి.. ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా -
కలకలం రేపుతున్న చేగొండి పుస్తకం
-
కలకలం రేపుతున్న చేగొండి పుస్తకం
- రంగా హత్యోదంతంలో కుట్ర కోణంపై తీవ్ర చర్చ - చంద్రబాబుపై కాపు యువత ఆగ్రహావేశాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు: వంగవీటి మోహనరంగా హత్యోదంతంలో ఆనాటి టీడీపీ కర్షక పరిషత్ చైర్మన్, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు తెరలేపాయి. వాస్తవానికి రంగా కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబుపై గతంలోనే ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే రంగా హత్యకు దారితీసిన పరిణామాలను చేగొండి తన పుస్తకంలో పూసగుచ్చినట్టు ఇపుడు బయట పెట్టడం కలకలం రేపుతోంది. చేగొండి సీనియర్ నాయకుడు కావడం, తెలుగుదేశం రాజకీయాలను సన్నిహి తంగా చూసినవాడు కావడంతో ఆయన పుస్తకంలోని అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. అధికార తెలుగుదేశం పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో చేగొండి సోమవారం ఉదయం నుంచి.. ఇవన్నీ నేను అంతకుముందు చెప్పినవే.. కొత్తగా చెప్పిందేమీ లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. బలీయమైన శక్తిగా ఎదుగుతున్న కాపు నాయకుడు రంగాను మట్టుబెట్టిన పథకానికి రూపక ర్తలు ఎవరు.. కుట్రకు అసలు మూలం ఎవరు అనేది ఆయన పుస్తకం చదివితే ఎవరికైనా తెలిసిపోతుంది. రంగా కు భద్రత ఇవ్వకుండా అడ్డుకున్న వైనం మొదలుకుని.. రంగాను మట్టుబెట్టేందుకు దారుణ హత్యోదంతం రూపకర్తలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారో జోగయ్య పుస్తకం చదివితే ఇట్టే అర్థమవుతుంది. మరోవైపు కాపులలో ఇది తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యింది. రంగా హత్య కేసును తిరగదోడాలని, చంద్రబాబును ప్రధాన నిందితునిగా చేర్చి సీబీఐతో విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు యువనేతలు సోమవారం వివిధ ప్రాంతా ల్లో రోడ్లపైకి వచ్చారు. బాబుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. దేశం నేతల్లో కలవరం: ఇక టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పూర్తిగా పక్కన పెట్టేశారన్న వాదనలున్నాయి. కాపులకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టామంటూ చినరాజప్పకు హోంశాఖ అప్పగించినా.. ఆ శాఖలో ఎవరి పెత్తనం సాగుతుందో అందరికీ తెలుసన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బలమైన నేతలకు నామమాత్రపు పదవులు, పట్టులేని నాయకులకు కీలక పదవులు అప్పగించే చంద్రబాబు ధోరణితో కాపునేతలు విసుగెత్తిపోయారు. ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను అటకెక్కించిన బాబు వైఖరిపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇదే సమయంలో జోగయ్య రేపిన పాత గాయం పార్టీని ఏ మేరకు దెబ్బతీస్తుందనే లెక్కల్లో టీడీపీ నేతలు మునిగిపోయారు.