breaking news
cheap smart phone
-
రూ. 251 ఫోన్లాగే.. చవగ్గా టీవీ ఇస్తాం!
ఫ్రీడమ్ 251.. ఈ పేరుతో అత్యంత చవగ్గా కేవలం 251 రూపాయలకే ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తామంటూ ఊదరగొట్టిన రింగింగ్ బెల్స్ సంస్థ ఇప్పటివరకు ఆ ఫోన్లనయితే డెలివరీ చేయలేదు గానీ, అప్పుడే మరో సంచలన ప్రకటన మాత్రం చేసింది. ఎల్ఈడీ స్క్రీన్, హెచ్డీ రిజల్యూషన్‌తో ఇంతవరకు ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఫ్రీడమ్ టీవీని గురువారం ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు బుధవారమే ఫ్రీడమ్ 251 ఫోన్లు అందాల్సి ఉంది. కానీ అది మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. ఇదే అంశంపై గురువారం నాడు కంపెనీ ఎండీ మోహిత్ గోయల్ ఓ ప్రకటన కూడా చేస్తారని రింగింగ్ బెల్స్ తెలిపింది. 251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఫోన్ ఇవ్వడానికే ఇంత ఆలస్యం చేసి.. ఇన్ని వాయిదాలు వేసినవాళ్లు ఇక టీవీలు అందించడానికి ఇంకెంత ఆలస్యం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. మరొక్క రోజు ఆగితే ఫ్రీడమ్ టీవీల విషయం కూడా తెలిసిపోతుంది. -
ముందు.. వెనకా 5 ఎంపీ కెమెరాతో ఫోను!
నోకియా అన్న పేరు లేకుండా మైక్రోసాఫ్ట్ తన చవక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లూమియా 535 అనే ఈ మోడల్ ఫోను ఖరీదు సుమారు రూ. 8300 వరకు ఉంది. నోకియా కంపెనీని కొనేసిన మైక్రోసాఫ్ట్ తొలిసారిగా తన బ్రాండు పేరుతో ఫోను విడుదల చేసింది. ఇంతకుముందు కూడా నోకియా లూమియా పేరుతో కొన్ని ఫోన్లు విడుదల చేసింది. అందులో విండోస్ ఓఎస్ ఉండటం ప్రధాన లక్షణం. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన లూమియా 535లో వెనక కెమెరాతో పాటు ఫ్రంట్ కెమెరా కూడా 5 మెగాపిక్సెల్స్ ఇవ్వడం గమనార్హం. దీనివల్ల సెల్ఫీలు మరింత స్పష్టంగా వస్తాయి. ఇన్నాళ్లూ ఉన్న ఫోన్లలో ఫ్రంట్ కెమెరాలు 1, 1.5 మెగాపిక్సెల్స్ మాత్రమే ఉండేవి. ఇక ఇందులో 5 అంగుళాల స్క్రీన్ ఉంది. ఈనెలలోనే భారతదేశంలో కూడా లూమియా 535 మార్కెట్లోకి వస్తుంది. సియాన్, ఆకుపచ్చ, కాషాయ, తెలుపు, నలుపు, బూడిద రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్లు: డిస్ప్లే సైజు: 5 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 5 ఎంపీ వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా: 5 ఎంపీ ఫ్లాష్ రకం: ఎల్ఈడీ ఫ్లాష్ ఇంటర్నల్ స్టోరేజి: 8 జీబీ (మైక్రో ఎస్డీ కార్డుతో పెంచుకోవచ్చు) ర్యామ్: 1 జిబి ప్రాసెసర్ రకం: క్వాడ్ కోర్ 1.2 గిగాహెర్ట్జ్ గరిష్ఠ టాక్ టైం: 11 గంటలు గరిష్ఠ స్టాండ్ బై టైం: 23 రోజులు