breaking news
Chandrapal
-
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చందర్‌పాల్, ఎడ్వర్డ్స్, ఖాదిర్
సిడ్నీ: వెస్టిండీస్ దిగ్గజం చందర్‌పాల్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ చార్లట్ ఎడ్వర్డ్స్, పాకిస్తాన్ దివంగత స్పిన్ లెజెండ్ అబ్దుల్ ఖాదిర్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చారు. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ సందర్భంగా ముగ్గురు క్రికెటర్లకు ఐసీసీ పురస్కారాలు అందజేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో చందర్ పాల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 20,988 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు, 125 అర్ధసెంచరీలున్నాయి. ఇంగ్లండ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఎడ్వర్డ్స్‌కు ప్రత్యేక స్థానముంది. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ వన్డే, టి20 ఫార్మాట్లలో ప్రపంచకప్‌లు సాధించింది. పాక్ దిగ్గజ లెగ్ స్పిన్నర్ ఖాదిర్ 63 వయస్సులో (2019) కన్నుమూశారు. టెస్టు క్రికెటర్లలో అలనాటి గ్రేటెస్ట్ స్పిన్నర్‌గా వెలుగొందారు. 67 మ్యాచుల్లోనే 236 వికెట్లు తీసిన ఘనత ఆయనది. 1987లో ఇంగ్లండ్‌పై 56 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు. ఖాదిర్ తరఫున అతని కుమారుడు ఉస్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు. చదవండి: Team India: ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా! -
కుమార్తెపై పెంపుడు తండ్రి, స్నేహితుల గ్యాంగ్ రేప్
27 ఏళ్ల కుమార్తెను పెంపుడు తండ్రితోపాటు అతడి ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసి అపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ సంబల్ ప్రాంతంలోని హయత్ నగర్లో చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి పెంపుడు తండ్రి చంద్రపాల్‌తోపాటు ఇద్దరు స్నేహితులు రవి శర్మ, రాంబాబులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఫ్యాక్టరీలో పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న యువతిని పెంపుడు తండ్రి ప్రోద్బలంతో అతడి స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.