breaking news
Chamara Silva
-
ఈ షాట్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో ధోని హెలికాప్టర్ షాట్, సెహ్వాగ్ అప్పర్ కట్, దిల్షాన్ దిల్‌స్కూప్, డివిలియర్స్ రివర్స్ స్వీప్ షాట్లు చూసుంటారు. కానీ.. శ్రీలంక బ్యాట్స్‌మన్ చమర సిల్వా ప్రయత్నించి చతికిలబడ్డ ఓ షాట్‌ను చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా.. వికెట్లు ముందే బ్యాటింగ్ చేస్తాడు. కానీ చమరా దీనికి వినూత్నంగా ఆలోచించాడు.. తన పేరిట ఓ షాట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడో లేక త్వరగా అవుట్ కావలనుకున్నాడో ఏమో కానీ వింతగా బ్యాటింగ్ చేసి నవ్వుల పాలయ్యాడు. లంక ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియా తెగ వైరల్ అయింది. కొలంబో వేదికగా ఏమ్‌ఏఎస్ యునిచెల, తీజే లంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చమర సిల్వా ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో ఏకంగా వికెట్ల వెనుకకు పరుగెత్తి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త వికెట్లకు తగలడంతో నవ్వులపాలయ్యాడు. బంతి మాత్రం బ్యాట్‌కు తగిలితే చమర హీరో అయ్యేవాడని కొందరూ.. అతని భార్యతో బయటకు వెళ్లే పని ఉందో ఏమో.. అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మ్యాచ్‌లో చమర జట్టు 52 పరుగుల తేడాతో గెలిచింది. ఇక చమర ఇలా ఆడటం మెదటి సారే ఏం కాదు. ఇంతకు ముందు కూడా ఇలా నిర్లక్ష్యంగా ఆడటంతో లంకబోర్డు రెండేళ్ల నిషేదం విధించింది. ఇక చమర సిల్వా అంతర్జాతీయ క్రికెట్లో 11 టెస్టులు, 75 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. -
ఈ షాట్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
-
శ్రీలంక క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం
కొలంబో:మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీలంక వెటరన్ క్రికెటర్ చమర సిల్వాపై రెండేళ్ల నిషేధం పడింది. ఈ ఏడాది ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనే ఆరోపణలతో చమర సిల్వాపై రెండేళ్ల నిషేధం విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమల్లోకి వచ్చే నిషేధం కారణంగా అతను క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరం కానున్నాడు. ఈ ఏడాది జనవరిలో పాండురా క్రికెట్ క్లబ్ -కలుతారా ఫిజికల్ కల్చర్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చమర సిల్వ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏడు నెలల సుదీర్ఘ విచారణ చేపట్టిన తరువాత చమర సిల్వాపై నిషేధం విధిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 1999-2011 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చమర సిల్వా 11 టెస్టులు 75 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.