ఈ షాట్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు.. | Chamara Silva's Attempt At Inventing New Shot Ends In Major Embarrassment | Sakshi
Sakshi News home page

ఈ షాట్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Nov 22 2017 9:30 AM | Updated on Mar 20 2024 3:54 PM

క్రికెట్‌లో ధోని హెలికాప్టర్‌ షాట్‌, సె‍హ్వాగ్‌ అప్పర్‌ కట్‌, దిల్షాన్‌ దిల్‌స్కూప్‌, డివిలియర్స్‌ రివర్స్‌ స్వీప్‌ షాట్‌లు చూసుంటారు. కానీ.. శ్రీలంక బ్యాట్స్‌మన్‌ చమర సిల్వా ప్రయత్నించి చతికిలబడ్డ ఓ షాట్‌ను చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా.. వికెట్లు ముందే బ్యాటింగ్‌ చేస్తాడు. కానీ చమరా దీనికి వినూత్నంగా ఆలోచించాడు.. తన పేరిట ఓ షాట్‌ క్రియేట్‌ చేద్దాం అనుకున్నాడో లేక త్వరగా అవుట్‌ కావలనుకున్నాడో ఏమో కానీ వింతగా బ్యాటింగ్‌ చేసి నవ్వుల పాలయ్యాడు. లంక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ సోషల్‌ మీడియా తెగ వైరల్‌ అయింది. కొలంబో వేదికగా ఏమ్‌ఏఎస్‌ యునిచెల, తీజే లంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చమర సిల్వా ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌లో ఏకంగా వికెట్ల వెనుకకు పరుగెత్తి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త వికెట్లకు తగలడంతో నవ్వులపాలయ్యాడు. బంతి మాత్రం బ్యాట్‌కు తగిలితే చమర హీరో అయ్యేవాడని కొందరూ.. అతని భార్యతో బయటకు వెళ్లే పని ఉందో ఏమో.. అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మ్యాచ్‌లో చమర జట్టు 52 పరుగుల తేడాతో గెలిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement