breaking news
Challapalli zone
-
జిల్లాలపై హర్షాతిరేకాలు
చల్లపల్లి/ముత్తుకూరు: జిల్లాల పునర్విభజనకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా చల్లపల్లిలో గురువారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్కు సెంటర్ వద్ద నుంచి లక్ష్మీపురం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఏఎంసీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సీ కాలనీ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. రామానగరం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంతర్భాగం చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. ‘జగనన్న వరం–సర్వేపల్లి జన నీరాజనం’ వారోత్సవాల్లో భాగంగా గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుకూరులో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఆ ఫ్లెక్సీపై పూలవర్షం కురిపించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ముత్తుకూరు కూడలిలో జరిగిన సభలో కాకాణి ప్రసంగించారు. గతంలో చంద్రబాబు చేయలేని పనిని ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని కొనియాడారు. ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకటరమణయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధనరెడ్డి, సర్పంచ్ బూదూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
3 గ్రామాలకు మహర్దశ
దివిసీమలోని పల్లెలను దత్తత తీసుకున్న ‘మిత్సుబిషి’ రూ.7.9 కోట్లతో ‘స్మార్ట్’గా అభివృద్ధి 2,200 కుటుంబాలకు లబ్ధి ముఖ్యమంత్రి, మిత్సుబిషి కంపెనీ చైర్మన్ వెల్లడి విజయవాడ : జిల్లాలోని నాగాయలంక మండలం సొర్లగొంది, నాలి, చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఈ గ్రామాలను జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ దత్తత తీసుకుంది. స్థానిక ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన సమావేశంలో మూడు గ్రామాలతో పాటు వాటి శివారు గ్రామాలను మిత్సుబిషి కంపెనీ స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దే శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఆయా గ్రామాల ప్రజలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రూ.7.9 కోట్లతో అభివృద్ధి దివిసీమకు వచ్చిన ఉప్పెనలో సొర్లగొంది, నాలి, మంగళాపురం గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. సొర్లగొంది, నాలి గ్రామాలతో పాటు మరో నాలుగు శివారు గ్రామాలు సముద్రం ఒడ్డున ఉంటాయి. ఈ గ్రామాల్లో ఎక్కువమంది మత్స్యకారులే జీవిస్తారు. మంగళాపురం వ్యవసాయదారుల గ్రామం. దీనికి మరో శివారు గ్రామాన్ని కలిపి మొత్తం ఎనిమిది గ్రామాలను అభివృద్ధి చేసేందుకు మిత్సుబిషి కంపెనీ ముందుకొచ్చింది. ఈ గ్రామాల్లో 2,200 కుటుంబాలు ఉంటాయి. గ్రామాల అభివృద్ధికి కంపెనీ సుమారు రూ.7.9 కోట్లు ఖర్చు చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత నిర్వహించడంలో భాగంగా స్వామినాథన్ ఫౌండేషన్ సూచన మేరకు ఈ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి సముద్రతీర ప్రాంతాన్ని రక్షించేందుకు, మడ అడవుల పెంపకంపై స్వామినాథన్ ఫౌండేషన్ పనిచేస్తోంది. అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు ఆయా గ్రామాల్లో ప్రజల జీవనశైలిలో మార్పులు తెచ్చేందుకు మిత్సుబిషి కంపెనీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించిందని సమావేశంలో మిత్సుబిషి కంపెనీ చైర్మన్ మసకబు నకకిడ తెలిపారు. ఆయా గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, ప్రజలకు మంచినీరు, పారిశుధ్యం, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పిస్తారు. గ్రామస్తులు ఆర్థికంగా స్థిరపడేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు. మత్స్యకారులు తమ ఉత్పత్తులు ఎక్కువ ధరలకు విక్రయించుకోవడంపై కూడా శిక్షణ ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మిత్సుబిషి కృషిచేస్తుంది. కోరాపుట్ అభివృద్ధిలో మిత్సుబిషి ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో మిత్సుబిషి, డాక్టర్ స్వామినాథన్ ఫౌండేషన్లు కలిసి పనిచేశాయి. ఫలితంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ వ్యవసాయ వారసత్వ వ్యవస్థగా పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించడం విశేషం. మనజిల్లాలోని ఈ మూడు ప్రాంతాలను కూడా ఈ రెండు సంస్థలు అద్భుతమైన స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతాయేమో వేచి చూడాలి.