chalasani srinivasa rao
-
ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర: చలసాని
-
మార్ఫింగ్ ఫొటోతో దుష్ప్రచారం
సాక్షి, అమరావతి బ్యూరో: మహిళల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మార్ఫింగ్ ఫొటోలను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్న వ్యవహారంలో పోలీసులు నిజానిజాలను వెలికి తీశారు. ఫేక్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడానికి ప్రయత్నించిన ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, చలసాని అజయ్‌కుమార్, అమ్మినేని శివప్రసాద్, కొత్తపల్లి సీతాంశులతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడు రాజధానులు వద్దని, అమరావతిలోనే అన్నీ ఉంచాలంటూ ఈ నెల 10న బందరు రోడ్డుపై నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంపై పోలీస్ అసోసియేషన్ ఆదివారం రాత్రి విజయవాడలో ఫిర్యాదు చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆ ఫొటో వెనుక ఉన్న నిజాలను వెలికి తీశారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు 2017లో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సందర్భంలో ఒక మహిళను మహిళా పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలిస్తున్న దృశ్యాన్ని కొందరు వీడియో, ఫొటోలు తీశారు. ఆ ఫొటోను అప్పట్లో కాంగ్రెస్ నేతలు కొందరు మార్ఫింగ్ చేసి పోలీసులపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడదే ఫొటోను మరోసారి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. -
చలసాని, శివాజీని నడిపిస్తోంది చంద్రబాబే!
సాక్షి, విజయనగరం : ప్రత్యేక హోదా విషయంలో చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీలను నడిపిస్తోంది చంద్రబాబేనని, ఆయన తెరవెనుక ఉండి వారితో మాట్లాడిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి అని, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఆయనే అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, జాతీయ రహదారి, డిఫెన్స్ ప్రాజెక్టులను కేటాయించామని తెలిపారు. -
ఆత్మగౌరవ దీక్ష భగ్నం
-
'పది, ఇరవై రోజుల్లోనే వెళ్లిపోదాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం సరికాదని ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. నిర్దాక్షిణ్యంగా ఎలాంటి సమస్యలు పట్టించుకోకుండా అహేతుకంగా విభజించి, వెళ్లిపోవాలన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నందున ఇక్కడ(హైదరాబాద్) ఎంతమాత్రమూ ఉండడం సరికాదని చెప్పారు. 10 లేదా ఇరవై రోజుల్లోనే ఇక్కడనుంచి వెళ్లిపోవడం మంచిదన్నారు. హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సహకారంపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. -
ఎవరెవరూ ఏమన్నారంటే..
పది, ఇరవై రోజుల్లోనే వెళ్లిపోదాం: పాలడుగు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం సరికాదని ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు శుక్రవారం ఇక్కడ పేర్కొన్నారు. నిర్దాక్షిణ్యంగా ఎలాంటి సమస్యలు పట్టించుకోకుండా అహేతుకంగా విభజించి, వెళ్లిపోవాలన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నందున ఇక్కడ(హైదరాబాద్) ఎంతమాత్రమూ ఉండడం సరికాదని చెప్పారు. 10 లేదా ఇరవై రోజుల్లోనే ఇక్కడనుంచి వెళ్లిపోవడం మంచిదన్నారు. హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సహకారంపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగ నాయకుడి వల్లే ఉద్యమానికి విఘాతం పరోక్షంగా అశోక్‌బాబును తప్పుపట్టిన చలసాని శ్రీనివాస్ సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన ఉద్యోగ నాయకుడి నాయకత్వలోపం వల్లే సమైక్యాంధ్ర ఉద్యమానికి విఘాతం కలిగిందని ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తద్వారా పరోక్షంగా ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబును తప్పుపట్టారు. ఆయన నాయకత్వ లోపమే సీమాంధ్ర పాలిట శాపంగా మారిందని, ఇకపై కొత్త వేషాలతో ప్రజల ముందుకొచ్చే నాయకుల మాయమాటలకు ఎవరూ మోసపోవద్దని సీమాంధ్రులకు సూచించారు. శుక్రవారమిక్కడ ఏపీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు న్యాయంగా పోరాటం చేశారని, వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పాతికేళ్ల వరకూ కాంగ్రెస్ కోలుకోదు: వట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పాతికేళ్ల వరకూ కోలుకునే అవకాశమే లేదని మంత్రి వట్టి వసంతకుమార్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పలువురు మంత్రులు శుక్రవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అంతా ఒక చోటకు చేరడంతో వారి మధ్య సరదా సంభాషణ సాగింది. భవిష్యత్ కార్యక్రమం గురించి ప్రస్తావన రాగా తాను పోటీ చేయాలనుకోవడం లేదని వట్టి చెప్పారు. తమ ప్రాంతంలో కాంగ్రెస్ పట్ల జనాగ్రహం బాగా కనిపిస్తోందన్నారు. రామనారాయణరెడ్డిని మీరేం చేయబోతున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ పోటీ చేస్తానన్నారు. రఘువీరా మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాటం: సీపీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పూర్తయినందున రెండు రాష్ట్రాల అభివృద్ధికి పోరాడాలని సీపీఎం నిర్ణయించింది. పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం శుక్రవారమిక్కడ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాష్ట్రాల ఏర్పాటు అనంతర పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి రెండు తీర్మానాలను ఆమోదించింది. రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు తప్పవని అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన జరిగినా ప్రపంచ బ్యాంకు విధానాలే అమలవుతాయని, ఇప్పటి పాలకులే తిరిగి రెండుచోట్లా ఏలతారని, ఫలితంగా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్న అంచనాకు వచ్చింది. రాష్ట్రంలోని లక్షా 82 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించింది. సమ్మె తీవ్రతరం కాకమునుపే కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ‘సీమ’లోనే రాజధాని ఉండాలి: బెరైడ్డి అనంతపురం, న్యూస్‌లైన్: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. ఆ ఒప్పందాన్ని అమలు చేయకపోతే రణరంగం సృష్టిస్తామన్నారు. అనంతపురంలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా సీమకు అన్యాయం జరుగుతోందన్నారు. నికర జలాలు, సీమలో రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలు, సంపూర్ణ మద్యపాన నిషేధం తదితర డిమాండ్లతో ఈ నెల 24, 25 తేదీల్లో సీమ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీమ వ్యాప్తంగా 52 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు. అసెంబ్లీ నిర్ణయం మేరకే రాజధాని: జేపీ సాక్షి, హైదరాబాద్: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడన్నది అక్కడి శాసనసభ నిర్ణయం మేరకు జరగాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ(జేపీ) అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని, అసెంబ్లీ వంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ పెద్దలెవరని ఆయన ప్రశ్నించారు. అయితే అక్కడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిని వికేంద్రీకరించాలన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సత్తా పార్టీ శాఖలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేయడానికి ప్రస్తుత, గత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో సన్నాహక కమిటీని ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్‌కు మరో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంపూర్ణ తెలంగాణ సాకారం కాలేదు: విరసం సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల పోరాటం ద్వారా కోరుకున్న తెలంగాణ సాకారం కాలేదని, పోరుబాటలో బాసటగా నిలిచిన పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం దుర్మార్గమైన చర్య అని విప్లవ రచయితల సంఘం(విరసం) విమర్శించింది. ఆంధ్రకు నష్టపరిహారంగానో, ప్యాకేజీగానో నిర్మించాలని నిర్ణయించిన పోలవరం ప్రాజెక్టు మూడు లక్షల మంది ఆదివాసులను, రెండు వందల గ్రామాలను, 3 లక్షల ఎకరాలను ముంచివేస్తుంటే, బాధితులను ఆంధ్రలో కలపడం ఏమిటని విరసం కార్యదర్శి వి. వరలక్ష్మి, సీనియర్ సభ్యులు వరవరరావు, కార్యవర్గ సభ్యులు పాణి, కాశిం, రాంకీ, రివేరా ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. -
విభజన బిల్లును సమైక్యంగా వ్యతిరేకించాలి: అశోక్‌బాబు
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: విభజన బిల్లు సీమాంధ్రపాలిట మారణశాసనమని, పార్టీలు విభేదాలు పక్కనపెట్టి కలసికట్టుగా అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. సోమవారం ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తూ మార్గమధ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో చిలకలూరిపేట ఎన్జీవోల సంఘం, ఉద్యోగసంఘాలు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, బిల్లుపై కేంద్రప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు.రాజకీయాలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశంలేదని స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అసెంబ్లీలో జరిగే కీలకఘట్టానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల్లో ఐక్యత కనిపించడం లేదన్నారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుడు మతాలను కించపరిచే విధంగా మాట్లాడడం సబబుకాదన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ వంశీ మాట్లాడుతూ పార్టీలకతీతంగా అసెంబ్లీలో ఓటింగ్‌లో పాల్గొని బిల్లును ఓడించాలని కోరారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బరాజు వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట తాలూకా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఎన్.నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె: అశోక్‌బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మెను ఆఖరి అస్త్రంగా ఉపయోగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చిన వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. రైల్‌రోకో, బంద్, చలోఅసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈసారి నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. విభజనపై కేంద్రం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలైనా సమైక్యవాదాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించాలని కోరారు. ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించేందుకు స్టీరింగ్ కమటీ ఏర్పాటు చేస్తున్నామని అశోక్‌బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు సమైక్య ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని చలసాని శ్రీనివాస్ అన్నారు. -
నివురుగప్పిన నిప్పులా మారిన విజయనగరం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మూడురోజుల పాటు కొనసాగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలకు మంగళవారం విరామం లభించినట్లయింది. పట్టణం మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రజల సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పాలు, నీళ్లు, మందులు వంటి అత్యవసరాలకు సైతం ప్రజలు అవస్థలు పడ్డారు. పరిస్థితి బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. లోలోపల రాజుకుంటూనే ఉందని చెప్పాలి. పోలీసులు వీధి వీధి శోధిస్తూ అనుమానం వచ్చిన వారందర్నీ అదుపులోకి తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూ సడలించడంతో ప్రజలు నిత్యావసరాల కోసం అవస్థలుపడ్డారు. పెట్రోలు బంకులు, ఏటీఎం కేంద్రాలు, పాల బూత్‌ల వద్ద బారులు తీరారు. సమయం సరిపోక కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. రైతుబజార్లలో డబ్బులు చెల్లించకుండానే ప్రజలు కూరగాయలు, సరుకులు ఎత్తుకెళ్లారు. ఉదయం 8 గంటలకు మళ్లీ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో వీధుల్లో కనిపించిన వారినల్లా పోలీసులు తరిమేశారు. ఇప్పటివరకూ 110 మందిని అరెస్టుచేసినట్లు ఎస్పీ కార్తికేయ వెల్లడించారు. అయితే ఇంతకు మూడింతలమంది వారి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీధుల్లో యువకులు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించి ఎక్కడెక్కడో తిప్పి మరుసటిరోజు వదిలిపెడుతున్నారు. నేడు రెండుగంటల పాటు కర్ఫ్యూ సడలింపు మంగళవారం గంటసేపు సడలింపు ఇచ్చిన అధికారులు బుధవారం ఉదయం 7 నుంచి 9 వరకూ కర్ఫ్యూను సడలించనున్నారు. త్వరలో జరగనున్న పైడితల్లమ్మ ఉత్సవాలకు సంబంధించి సిరిమాను చెట్టును పట్టణంలోకి తీసుకొచ్చే ఘట్టం బుధవారం పోలీసు బందోబస్తు మధ్య అతి కొద్దిమందితో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌పై అందరికీ హక్కు హైదరాబాద్‌పై అందరికీ హక్కు ఉందని రైతన్నలు నినదించారు. మంగళవారం విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస జంక్షన్లో జరిగిన నాగావళి రైతు గర్జనకు వేలాదిగా అన్నదాతలు తరలివచ్చారు. సమైక్య నినాదాలు మార్మోగించారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇక ముక్కలైతే తీవ్రమయ్యే సాగునీటి ఎద్దడితో సీమాంధ్ర రైతాంగానికి విపరిణామాలే ఎదురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ సభ్యుడు చొక్కాపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ పాల్గొన్నారు. -
చలసాని శ్రీనివాస్ అలా అనలేదు: డాక్టర్ కె.వెంకట్రావు
పిఠాపురం, న్యూస్‌లైన్: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కల్యాణ మంటపంలో ‘తెలుగుజాతి విశిష్టత- విభజన వల్ల అనర్థాలు’ అంశంపై ఆదివారం జరిగిన చర్చాగోష్ఠిలో రాష్ట మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తన ప్రసంగంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, తెలంగాణ నేతలైన కేసీఆర్, కవిత, కోదండరాంలపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని గోష్ఠి నిర్వాహకులు, శ్రీ సూర్యారాయ విద్యానంద గ్రంథాలయ పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ కె. వెంకట్రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చలసాని తన ప్రసంగంలో పేర్కొనని వ్యాఖ్యానాలు వార్తలో చోటుచేసుకున్నాయని, అవి వాస్తవానికి విరుద్ధమని, ఇందుకు తాము చింతిస్తున్నామన్నారు. -
విదేశీ బుద్ధి పోని సోనియా
పిఠాపురం, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలు ఆడపడుచుగా అభిమానించినా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు విదేశీ బుద్ధి పోలేదని మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే తెలుగు ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘తెలుగుజాతి విశిష్టత - విభజన వ ల్ల అనర్థాలు’ అంశంపై తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆదివారం జరగిన చర్చాగోష్టిలో చలసాని మాట్లాడారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టడానికి చూస్తున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కూతురు కవిత చరిత్రహీనులని దుయ్యబట్టారు. సీమాంధ్ర ఉద్యోగులను పెట్రోలు పోసి తగులబెట్టాలని పిలుపునిచ్చిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చదువుకున్న మూర్ఖుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువారికి ఉద్యోగావకాశాలు ఉండగా, హైదరాబాద్‌లో సీమాంధ్రులను నాన్‌లోకల్ చేయడం ద్వారా ఉద్యోగావకాశాలను హరించారన్నారు. తెలంగాణ కు వంత పాడుతున్న మంత్రి బొత్స తెలుగుజాతిలో పుట్టిన చీడపురుగని విమర్శించారు. భద్రాచలం డివిజన్‌ను కోస్తాంధ్రలో కలపాలని, లేకపోతే నీటి వివాదాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.