తెలుగు ప్రజలు ఆడపడుచుగా అభిమానించినా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు విదేశీ బుద్ధి పోలేదని మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
పిఠాపురం, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలు ఆడపడుచుగా అభిమానించినా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు విదేశీ బుద్ధి పోలేదని మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే తెలుగు ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘తెలుగుజాతి విశిష్టత - విభజన వ ల్ల అనర్థాలు’ అంశంపై తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆదివారం జరగిన చర్చాగోష్టిలో చలసాని మాట్లాడారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టడానికి చూస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కూతురు కవిత చరిత్రహీనులని దుయ్యబట్టారు.
సీమాంధ్ర ఉద్యోగులను పెట్రోలు పోసి తగులబెట్టాలని పిలుపునిచ్చిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చదువుకున్న మూర్ఖుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువారికి ఉద్యోగావకాశాలు ఉండగా, హైదరాబాద్‌లో సీమాంధ్రులను నాన్‌లోకల్ చేయడం ద్వారా ఉద్యోగావకాశాలను హరించారన్నారు. తెలంగాణ కు వంత పాడుతున్న మంత్రి బొత్స తెలుగుజాతిలో పుట్టిన చీడపురుగని విమర్శించారు. భద్రాచలం డివిజన్‌ను కోస్తాంధ్రలో కలపాలని, లేకపోతే నీటి వివాదాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.