breaking news
Chalamalasetti ramanujaya
-
కాపులకు రుణాలపై కొత్త మెలిక
విజయవాడ: కాపు కులస్తులకు రుణాల మంజూరు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తన మోసకారి తనాన్ని బయటపెట్టుకుంది. ముద్రగడ దీక్ష సమయంలో చేసిన వాగ్ధానాన్ని తుంగలో తొక్కుతూ .. దరఖాస్తులు చేసుకున్న అందరికీ రుణాలు ఇవ్వబోమని వెల్లడించింది. (చదవండి: కాపులకు మరో షాక్!) కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుంజయ శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఏడాదికి 40 వేల మందికి మాత్రమే రుణాలు ఇస్తామని, అదికూడా యూనిట్లు ఏర్పాటుచేసుకున్నవారికే ఇస్తామని తెలిపారు. కొంతమంది రుణాలను దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే యూనిట్ లేకుండా రుణం ఇవ్వబోమని రామానుంజయ అన్నారు. -
సత్రం భూములు కొంటే.. తప్పేంటి?
చౌకగా వచ్చాయి కాబట్టే కొన్నాం : రామానుజయ సాక్షి, విశాఖపట్నం: ‘‘సదావర్తి సత్రానికి చెందిన భూములు చౌకగా వస్తున్నాయి కాబట్టే కొనుగోలు చేశాం.. దాంట్లో తప్పేముంది’’ అని రాష్ర్ట కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ప్రశ్నించారు. వేలంలో ఇతర పాటదారులు, మీడియా సమక్షంలోనే ఈ భూములను తన కుమారుడు సొంతం చేసుకున్నాడని స్పష్టం చేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణదారుల నుంచి భూములను పరిరక్షించుకోలేక సత్రం పాలకవర్గం వేలం నిర్వహించిందన్నారు. వీటి విలువ మార్కెట్లో భారీగానే ఉన్నప్పటికీ వివాదాల కారణంగా తక్కువ ధరకే వేలం వేశారని చెప్పారు. 83 ఎకరాల విక్రయానికి వేలం నిర్వహించారని వెల్లడించారు. ఇతర పాటదారుల మాదిరిగానే తన కుమారుడు కూడా పాల్గొని, భూములను సొంతం చేసుకున్నాడని చెప్పారు. ఈ వ్యవహారాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.