breaking news
cessna plane
-
దడ పుట్టించిన చేజింగ్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ చిన్న విమానాన్ని జెట్ విమానం వెంబడించడం కలకలం రేపింది. అసాధారణ వేగంతో ప్రయాణిస్తూ యుద్ధ విమానం నుంచి వెలువడిన సోనిక్ శబ్ధం వాషింగ్టన్ వాసుల గుండెల్లో దడ పుట్టించింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏవియేషన్ విభాగం సమాచారం ప్రకారం.. ఆ సెస్నాసైటేషన్ విమానం టెన్నెస్సీలోని ఎలిజెబెత్టన్ నుంచి బయలుదేరింది. లాంగ్ ఐల్యాండ్‌లోని మెక్ ఆర్థర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా, న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మీదుగా, సరాసరి వాషింగ్టన్ డీసీ వైపుగా వచ్చింది. దేశ రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన నిషిద్ధ ప్రాంతాల మీదుగా అది వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేడియో సిగ్నళ్లకు పైలట్ స్పందించకపోవడంతో వెంటనే ఎఫ్–16 జెట్ విమానాన్ని పంపారు. అది సోనిక్ శబ్ధంతో ప్రయాణిస్తూ దూసుకెళ్లింది. ఆ శబ్దం వాషింగ్టన్‌తోపాటు, మేరీల్యాండ్, వర్జీనియాలోని కొన్ని ప్రాంతాల వారికి సైతం వినిపించింది. సదరు విమానం పైలట్ దృష్టిలో పడేందుకు ఫైటర్ జెట్ ఎఫ్–16 విమానం మంటలను సైతం వదులుతూ వెళ్లింది. భూమిపైని వారి భద్రతను, సదరు విమానం భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వర్జీనియాలోని మౌంట్ మొంటెబెల్లోకు సమీపంలోని పర్వత ప్రాంతంలో చివరికి చిన్న విమానం కుప్పకూలింది. విమానం మండిపోయిందని, అందులో వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు. చివరి క్షణంలో అది నిమిషానికి 30 వేల అడుగుల చొప్పున వేగంగా నేలవైపుగా దూసుకొచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ రికార్డులు చెబుతున్నాయి. పర్వత ప్రాంతంలో విమానం కూలిన చోటుకు కాలినడకన చేరుకునేందుకు పోలీసులకు దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఫ్లోరిడాకు చెందిన ఎన్కోర్ మోటార్స్ పేరిట ఆ విమానం రిజిస్టరై ఉంది. ఈ కంపెనీ నిర్వాహకుడు జాన్ రంపెల్ మాట్లాడుతూ..ఆ విమానంలో పైలట్‌తోపాటు తన కూతురు, రెండేళ్ల మనవరాలు, ఆయా ఉన్నారన్నారు. వీరు నార్త్ కరోలినా నుంచి ఈస్ట్ హాంప్టన్‌కు వస్తున్నారన్నారు. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు తనకు తెలియదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇది 1999 నాటి ఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పట్లో లీయర్జెట్ విమానం సాంకేతిక లోపం తలెత్తి అడ్డదిడ్డంగా తిరుగుతూ సౌత్ డకోటా ప్రాంతంలో కూలిపోయింది. అందులోని ఆరుగురూ చనిపోయారు. -
‘రివర్స్’ కారు!
రేసులో యాక్సిడెంట్ అయి కారు బోల్తాపడలేదు. సరిగ్గా చూడండి.. కారే అలాగుంది. రీమోడలింగ్‌లో స్పెషలిస్టు అయిన అమెరికాకు చెందిన జెఫ్ బ్లోచ్ దీన్నిలా తయారుచేశాడు. ఆ మధ్య చిన్నపాటి సెస్నా విమానాన్ని రేస్కారులా మార్చేసిన జెఫ్.. తాజాగా అక్కడి ప్రఖ్యాత లెమన్ రేసులో పాల్గొనడం కోసం ఈ వినూత్న వాహనాన్ని రూపొందించాడు. కారు క్లీనింగ్ యమ కాస్ట్లీ! కారు కడిగించుకోవాలి.. టెఫ్లాన్ కోటింగ్ వేయించుకోవాలి... మహా అయితే ఎంతవుతుంది? రూ.2, 3 వేలకు మించి అవదు అంతేగా.. ఓసారి స్కాట్లాండ్లోని కిర్క్కాల్డీలో ఉన్న ‘అల్టిమేట్ షైన్’ కంపెనీలో కారు క్లీనింగ్ చేయించుకుని చూడండి.. అక్కడి వాళ్లు మీ కారును కడగడంతోపాటు బ్యాంకులో ఉన్న మొత్తం సొమ్మునూ కడిగిపారేస్తారు. ఎందుకంటే.. వీరు రెండు కార్ల క్లీనింగ్‌కు ఏడాదికి రూ.90 లక్షలు చార్జి చేస్తారు! అలాగని.. ప్రతి నెలా క్లీన్ చేస్తారనుకునేరు.. ఏడాదికి మహా అయితే.. మూడు లేదా నాలుగుసార్లు కడుగుతారు అంతే..