breaking news
Cerebral
-
Cerebral Palsy Day: మస్తిష్క పక్షవాతం అంటే..
నేడు వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. సెరిబ్రల్ పాల్సీ అంటే మస్తిష్క పక్షవాతం. ఇదొక నరాల వ్యాధి. దీనిపై అవగాహన కల్పించేందుకు సెరిబ్రల్ పాల్సీ డేను అక్టోబర్ 6న నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటీ 70 లక్షలకు పైగా సెరిబ్రల్ పాల్సీ కేసులు నమోదయ్యాయి.కొందరికి పుట్టుకతో, మరికొందరికి తలకు గాయమైనప్పుడు మస్తిష్క పక్షవాతం సంభవిస్తుంది. దీని కారణంగా మెదడులో ఎదుగుదల లోపించి కండరాలు, కదలికలపై సమన్వయం అనేది లోపిస్తుంది. బాల్యంలో సంభవించే ఈ వైకల్యానికి జన్యుపరమైన లోపాలే ప్రధాన కారణంగా నిలుస్తాయి. భారతదేశంలోని ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురికి మస్తిష్క పక్షవాతం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మస్తిష్క పక్షవాతం సోకిన పిల్లల్లో దొర్లడం, కూర్చోవడం, నడవడం వంటివి ఆలస్యమవుతాయి. ఇది ఆడపిల్లల కంటే కంటే మగపిల్లలలోనే అధికంగా కనిపిస్తుంది.మూడు నెలల వయసులో శిశువును ఎత్తిన సందర్భంలో తల వెనక్కి వాలిపోవడం, శరీరమంతా బిగుసుకోపవడం, కండరాల బలహీనత, ఆరు నెలలకు గానీ దొర్లకపోవడం, రెండు చేతులను కూడదీసుకోవడంలో వైఫల్యం, నోటివద్దకు చేతులు తీసుకురావడంలో సమస్యలు.. ఇవన్నీ మస్తిష్క పక్షవాతం లక్షణాలని వైద్యులు చెబుతుంటారు. ఇది కండరాల తీరు, ప్రతిచర్యలు, భంగిమ సమన్వయాన్ని, కదలికలు, కండరాల నియంత్రణను సమన్వయం చేయక ఇబ్బందులకు గురిచేస్తుంది.గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధిపై ప్రభావం చూపే రుబెల్లా వ్యాధి, శిశువు మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడటం, ప్రసూతిలో సమయంలో ఆక్సిజన్ కొరత మొదలైనవి మస్తిష్క పక్షవాతానికి దారితీస్తాయి. మస్తిష్క పక్షవాతం నయం చేయలేని వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే మందులు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ మొదలైనవి మస్తిష్క పక్షవాతం బాధితులకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ వ్యాధి బారినపడినవారికి సకాలంలో వైద్యం అందిస్తే వ్యాధిని కొంత వరకు అరికట్టవచ్చని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం -
హీరో అజిత్ కుమార్ బాధపడుతోంది ఈ వ్యాధితోనే..!
ఇటీవల తమిళ హీరో అజిత్ కుమార్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏమైందంటూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై అజిత్ పీఏ సురేశ్‌చంద్ర స్పందించి వివరణ ఇచ్చారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు చెవి వెనుక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పుకొచ్చారు. అయితే వైద్య నటుడు అజిత్ కుమార్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్తో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అసలేంటీ ఈ వ్యాధి? ఎందువల్ల వస్తుందంటే.. ఈ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్ని వైద్యపరంగా ఇస్కీమిక్గా స్ట్రోక్ అని పిలుస్తారు. తగినంత ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినండంతో ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడులోని ధమని బ్లాక్ అయినప్పుడు లేదా చిట్లినప్పుడూ ఈ సమస్య తలెత్తుంది. ఇది మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని నరాలు వాపుకి దారితీయడంతో ఇదంతా జరుగుతుంది. దీంతో రోగికి పక్షవాతం రావడం లేదా కొన్ని సమయాల్లో సీరియస్ అయ్యి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రోగికి తక్షణమే చికిత్స అందడం అనేది అత్యంత ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు.. వికారం లేదా వాంతులు కంటి కదలికలో సమస్యలు, సరిగా కనిపించకపోవడం తలనొప్పి మాట్లాడడంలో ఇబ్బంది చేతులు, పాదాలు లేదా ముఖంలో తిమ్మిరి అనుభూతి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లిపోవడం కారణాలు అధిక రక్తపోటు మధుమేహం, ధూమపానం, ఊబకాయం, కొలస్ట్రాల్, డయాబెటిస్, లేదా సడెన్‌గా చక్కెర స్థాయలు పెరగడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. నివారణ ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ఆదిలోనే గుర్తించగలుగుతాం. అలాగే స్ట్రోక్ వచ్చిన రోగులకు థ్రోంబోలిటిక్ మందులతో నయం చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రావీనస్ ఆర్‌టీపీఏ థెరపీని అందిస్తే రోగిని సుమారు 3 గంటల్లో మాములు మనిషిగా చెయ్యొచ్చు. (చదవండి: కేన్సర్‌పై యువతి పోరు..ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో!) -
లోగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర కేవలం మెదడు తూకంలోని తేడాల ఆధారంగా జంతువుల మేధోశక్తిని అంచనా వేసుకోలేం. మనిషి మెదడుకంటే ఏనుగు మెదడు కనీసం 20 రెట్లు పెద్దదిగా ఉంటుంది. తెలివిలో 2000 రెట్లు తక్కువగా ఉంటుంది. మొదటి ఘట్టం తొలిదశలో సంఖ్యాపరంగా జంతువుల విస్తృతి పెద్దగా లేదుగానీ, పలురకాల స్తన్యజంతువులు అప్పటికే రంగంలో దిగిపోయాయి. ఊరకే దిగిపోవడంగాదు, ఒక్కొక్కటి ఒక్కోదిశగా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలెట్టాయి. గడ్డి మేస్తూ శాకాహార జీవితంలో కొన్ని తరగతులు స్థిరపడగా, వాటిల్లో కొన్ని పలుకారణాల మూలంగా చెట్లమీదికి నివాసం మార్చుకుని శాకాజీవితానికి అలవాటుపడుతున్నాయి. మరికొన్ని మాంసాహారులుగా మిగిలిపోగా, తిమింగలాల వంటి కొన్ని జంతువులు నీటిలో బతికే జీవితానికి తిరోగమించాయి. ఏ తరహా జీవితాన్ని స్వీకరించినా, సీనోజోయిక్ జంతువులు తమ ప్రమేయం లేకుండానే కొద్దికొద్దిగా పెరుగుతున్న మెదడును తమ జీవనవిధానానికి పరికరంగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే, అదే జాతికి చెందిన ఇప్పటి వారసులతో పోలిస్తే ఆ శకంలో జంతువులకు మెదడు చాలా చిన్నది. ఉదాహరణకు ఖడ్గమృగానికున్న మెదడులో కనీసం పదోవంతైనా లేనివి వాటి పితామహులైన ‘టిటరాథోరియం’ పేరుగల ఆ తరం జంతువులు. మనకు తెలిసిన ఖడ్గమృగమే ఏమంత తెలివైన జంతువు కాదు. దీన్నిబట్టి అప్పటి జంతువుల మేధోశక్తి ఎంత ముతకగా ఉండేదో మనమొక అంచనాకు రావచ్చు. ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఏమిటంటే, 25 కోట్ల సంవత్సరాలుగా జీవి తమ మెదడును పెంచుకునేందుకు చేసే ప్రయత్నం సీనోజోయిక్ యుగంలో లాభదాయకమైన ఫలితాలను ప్రారంభించింది. అప్పటినుండి అది నిరంతరంగా పెరుగుతూ, 40వేల సంవత్సరాలనాడు మానవునితో ఆగిపోయింది. ఇక్కడే ఆగుతుందో ఇంకా పెరుగుతుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. పెరుగుదలను ప్రోత్సహించే అవసరాలు ముందు ముందు ఏమి రానున్నాయో ఎవరికి తెలుసు? అయితే, అది దగ్గరి భవిష్యత్తులో జరిగేది కాదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పుడు ఉన్నదాన్నే మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. తనకుండే మేధోసామర్థ్యంతో మనిషి ఉపయోగించుకుంటున్నది కేవలం 18 నుండి 20 శాతమే! దీన్నిబట్టి మరో అంతరార్థం మనకు వెల్లడౌతుంది. పరిణామక్రమంలో భౌతిక మార్పులకంటే ముందుగా జరిగేది మెదడు పెరుగుదలేననిపిస్తుంది. ఆ పెరిగిన మెదడు జీవిని తన అలవాట్లూ, తదనుగుణంగా శరీరనిర్మాణం సంతరించుకునేలా బలవంతంగా తోసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఇదేనిజమైతే, కొన్ని వేల సంవత్సరాల తరువాత మనిషి శరీరం ఏ ఆకారం తీసుకుంటుందో! చెవులు చేటల్లాగా, ముక్కు తొండంలాగా పెరిగే అవకాశాలు మాత్రం లేవు. ఏమిటి ఆ ధీమా అంటారా - అవి అదివరకున్న పరిమాణంతోనే ఉపయోగం తక్కువై, జ్ఞానేంద్రియాల సైజు మనిషి కుదించిపోయింది. ఉదాహరణకు మెదడులో వాసన గ్రహించే గ్రంథులనే తీసుకుంటే, అవి కుక్కకు బాతుగుడ్డు సైజులో ఉండగా, మనిషిలో నలిగిపోయిన యాలకతొక్క సైజుకు తగ్గిపోయాయి. ‘మెదడును పూర్తి స్థాయిలో మనం ఎందుకు వినియోగించుకోవడం లేదు?’ అనే సందేహం ఇక్కడ కలగొచ్చు. అవగాహన కోసం పాతతరం మోటారుకారు స్పీడామీటరును గుర్తుకు తెచ్చుకోవాలి. అందులో సున్నా నుండి నూట ఇరవైకిలోమీటర్ల వేగందాకా చూపించైతే ఉంటుందిగానీ, గరిష్టస్థాయి వేగంతో బండిని నడపడం సాధ్యపడదు. 60 కిలోమీటర్ల వేగం అందుకోగానే కారు భాగాలు ఎక్కడివక్కడ విడిపోతాయేమోనన్నంత అందోళన కలిగిస్తుంది. ఆ కుదుపులకూ ప్రకంపనాలకూ లోపల కూర్చున్న మనుషులు గంటా గంటన్నర వ్యవధికి అలసిపోతారు. మరికొంత దూరం ఆ వేగాన్ని కొనసాగిస్తే, ఇంజనులో నీళ్ళు పూర్తిగా ఆవిరై, మెత్తని లోహభాగాలు కరిగిపోవడం మొదలౌతుంది. అంటే, ఆ గరిష్టవేగంతో పరిగెత్తే శక్తి ఇంజనుకు ఉన్నా, ఆ వేగాన్ని స్వీకరించగల సత్తా దాని ‘బాడీ’కి లేదు; ఆ వేగానికి సహకరించే రహదారి లేదు. అదే ఈ తరం కార్లైతే 120 కి.మీ. వేగాన్ని సునాయాసంగా అందుకుంటాయి. ఆ వేగాన్ని భరించగల బాడీ నిర్మాణం ఇప్పుడొచ్చింది. అనుకూలమైన రహదారులు ఇప్పుడు అందుబాటుకొచ్చాయి. అయినా, కొత్తతరం స్పీడామీటరు చూపించే గరిష్టవేగాన్ని అందుకునేందుకు ఇప్పుడు గూడా సాధ్యపడదు. ఇక మానవుని శరీరం విషయానికొస్తే, వర్తమానజీవితం ఒత్తిళ్ళకే తట్టుకోలేక, ‘స్పేర్ పార్ట్స్’ కోసం ఆస్పత్రులకు పరుగులు పెడుతూంటే, పూర్తిస్థాయి మెదడును ఎక్కడ వాడుకోగలడు? మెదడు సైజును గురించి మాట్లాడుకునే సందర్భంలో మనం గుర్తుంచుకోవలసిన విషయం మరొకటుంది. కేవలం మెదడు తూకంలోని తేడాల ఆధారంగా జంతువుల మేధోశక్తిని అంచనా వేసుకోలేం. మనిషి మెదడుకంటే ఏనుగు మెదడు కనీసం 20 రెట్లు పెద్దదిగా ఉంటుంది. తెలివిలో 2000 రెట్లు తక్కువగా ఉంటుంది. అందువల్ల, మొదట మనం చూడవలసింది శరీరం బరువులో మెదడు తూగే నిష్పత్తి. మనిషిలో ఈ నిష్పత్తి 1:47. రెండవది - మనం అంచనాలోకి తీసుకోవలసింది కేవలం పెద్దమెదడును. ఎందుకంటే, పెద్దమెదడు వెలుపలి పొరగా ఏర్పడిన ‘గ్రే మేటర్ (బూడిద రంగు పదార్థం)’లో మాత్రమే ఆలోచనకు సంబంధించిన మేధోకణాల ఉనికి మనకు కనిపించేది. రచన: ఎం.వి.రమణారెడ్డి