breaking news
Central Provident Fund Organization
-
0.5 శాతానికి ఈపీఎఫ్‌వో పరిపాలనా రుసుము
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు కంపెనీల యజమానులు చెల్లించే పరిపాలనా రుసుము 0.5 శాతానికి తగ్గింది. దీంతో అన్ని కంపెనీలకూ కలిపి ఏటా మొత్తంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గనుంది. ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనంలో 0.65 శాతాన్ని పరిపాలనా రుసుము కింద కంపెనీలు ఇప్పటివరకు ఈపీఎఫ్‌వోకు చెల్లించేవి. వచ్చే నెల నుంచి ఈ రుసుమును 0.15 శాతం తగ్గించి 0.5 శాతంగా ఉండేలా ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య పెరుగుతున్నందున తమ పరిపాలనా ఖర్చులకు అవసరమైన వాటికన్నా ఎక్కువ నిధులే వస్తున్నాయనీ, ఈ కారణంగానే చార్జీలను తగ్గిస్తున్నట్లు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. -
మూడు రోజుల్లోనే ‘పీఎఫ్’!
-
మూడు రోజుల్లోనే ‘పీఎఫ్’!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాదారులకు అందించే సేవల్లో మరింత పారదర్శక తెస్తామని కేంద్ర భవిష్యనిధి సంస్థ చీఫ్ కమిషనర్ కృషన్‌కుమార్ జలాన్ తెలిపారు. వచ్చే ఐదు నెలల్లో ఆన్లైన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఉద్యోగులు పీఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే క్లెయిమ్‌లు పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూనివర్సల్ అకౌంట్ నంబర్లను కేటాయిస్తున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పీఎఫ్ కార్యాలయాల సిబ్బం దితో జలాన్ భేటీ అయ్యారు. అత్యాధునిక సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సమావేశంలో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఎస్కేవీ సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేవీ సర్వేశ్వరరావు పాల్గొన్నారు. ‘ఆన్లైన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే కేవలం 3 నుంచి 10 రోజుల్లోనే పీఎఫ్ ఖాతాదారుల సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ చేయటం సాధ్యపడుతుంది. యాజమాన్యాల సంతకాలను డిజిటైజ్ చేయడం వల్ల వారి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సులభంగా పరిష్కరించే అవకాశం కలుగుతుంది. ఆన్లైన్లో సులభంగా క్లెయిమ్ చేసుకునేలా సరళీకరిస్తున్నాం. ఫిర్యాదులపై కేంద్ర నిఘా విభాగం, పీఎఫ్ కేంద్ర కార్యాలయం దృష్టి పెట్టింది.’ అని జలాన్ తెలిపారు. ఈ 3 తప్పనిసరి..: ఆన్లైన్ సేవలు అందించేందుకు పీఎఫ్ ఖాతాదారుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు జలాన్ తెలిపారు. ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలు, పాన్, ఆధార్ కార్డు నంబర్లను పీఎఫ్ ఖాతాకు జత చేయాలన్నారు. ఈ మూడు డాక్యుమెంట్లు తప్పనిసరని, ఇవి ఉంటేనే యూనివర్సల్ నంబర్ ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్ పత్రాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్వాలేదన్నారు. పీఎఫ్ ఇచ్చిన బ్యాంకు ఖాతా మా ర్చుకుంటే వెంటనే ఆ సమాచారం అందజేయాలని కోరారు. ►పీఎఫ్ ఖాతాల్లో నిలిచిన సొమ్ము రూ. 32,000 కోట్లు ►దేశవ్యాప్తంగా గత 10 రోజుల్లో 50 లక్షల యూఎన్ఏ నెంబర్లు జారీ. ►ఈ నెలాఖరు కల్లా కనీసం కోటి మంది ఖాతాదారుల పూర్తి డేటా సేకరణకు సిద్ధం. ►ఉద్యోగులు సంస్థలు మారడం, చిరునామాలు సరిగా లేక పీఎఫ్ ఖాతాల్లో స్తంభించిన సొమ్ము దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో రూ. 32 వేల కోట్లకు చేరుకుంది.