breaking news
central package
-
పటిష్టంగా కేంద్ర ప్యాకేజీ అమలు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలుచేయడం ద్వారా సమాజంలోని పేదలు సహా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అమలుపై రాష్ట్రస్థాయి కమిటీ ప్రాథమిక సమావేశం సోమవారం జరిగింది. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూనే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ అమలుకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతో ఏయే శాఖకు ఎంతమేరకు నిధులు సమకూరుతాయో అంచనా వేసి ఆ ప్రకారం వివిధ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధిచేకూర్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రత్యేక కార్యదర్శి కె. సత్యనారాయణ, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనాపై విస్తృత అవగాహన కల్పించాలి కరోనాపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సీఎస్ విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి తప్పనిసరిగా పాటించాల్సిన 10 అంశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించాలని ఆదేశించారు. -
ఇది ప్రోత్సాహమే కాదు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎక్సయిజు మినహాయింపుల్లేవు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీల్లేవు. ప్రత్యేక రాయితీలు లేవు. ఆఖరికి ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా లేవు. ఇచ్చిందల్లా.. కొత్త పరిశ్రమలు గనక పెడితే వాటి ప్లాంటు, యంత్రాలకయ్యే ఖర్చుల్లో 15 శాతాన్ని తొలి ఏడాది అదనంగా తరుగుదలగా మినహాయించుకునే వెసులుబాటు. వచ్చే ఐదేళ్లలో ఏ పరిశ్రమ పెట్టినా దాని ప్లాంటు యంత్రాలకయ్యే ఖర్చులో 15 శాతం ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్. ఇది కూడా తరుగుదల మాదిరిగా పన్ను మినహాయింపునకు తప్ప వేరెందుకూ పనికిరాదు. పెపైచ్చు ఈ రెండూ వర్తించేది కూడా నోటిఫై చేసిన ప్రాంతాల్లో పెట్టే పరిశ్రమల్లో మాత్రమే. ఇదీ.. ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు ఆశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌కు, ప్రత్యేక హోదా కావాలని అడిగిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ. నిజానికి ఈ రాయితీలతో వాస్తవంగా పరిశ్రమలకు మిగిలేదేమీ ఉండదని, ఒక్క భారీ పరిశ్రమను ఆకర్షించ డానికి కూడా ఇవి పనికిరావనేది పరిశ్రమలకు చెందిన వివిధ వర్గాల అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే ఈ రెండు ప్రోత్సాహకాల్లో ప్రధానంగా గుర్తించాల్సిందేంటంటే వీటివల్ల మికేంద్రం వర్తింపజేస్తున్నదల్లా ఆదాయపు పన్ను మినహాయింపు మాత్రమే. నిజానికి ఆదాయపు పన్ను మినహాయింపు అనేది లాభాలొచ్చినపుడే వర్తిస్తుంది. ఆ లాభాల నుంచి చెల్లించాల్సిన పన్ను కొంత మినహాయించుకుని ఇంకాస్త నగదు మిగుల్చుకోవటానికి పై రెండు రాయితీలూ పనికొస్తాయి. కానీ పరిశ్రమ పెట్టిన తొలి ఏడాదే లాభాలెలా వస్తాయన్నది పారిశ్రామికుల ప్రశ్న. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమ పెట్టిన తొలి ఏడాది కాదుకదా... ఐదారేళ్ల తరవాత కూడా లాభాలొస్తాయని గ్యారంటీగా చెప్పలేకపోతున్నాం. పెపైచ్చు లాభార్జనకు దీర్ఘకాలం తీసుకునే ప్రాజెక్టులైతే ఇలాంటి రాయితీల వల్ల లాభం ఉండదు’’ అనేది వారి అభిప్రాయం. అసలీ ప్యాకేజీ నయాపైసా పెట్టుబడులను ఆకర్షించదని వారు కరాఖండిగా చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ప్రయోజనమన్నది యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఉంది. అయితే రూ.100 కోట్లు ఆపై పెట్టుబడి పెట్టే కంపెనీలకు మాత్రమే దాన్ని వర్తింపజేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మొత్తాన్ని రూ.25 కోట్లకు కుదించింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదే శ్ రాష్ట్రాల్లో ఈ 25 కోట్ల షరతును కూడా తొలగించారు. అంతే!!. 15 శాతం... ఏ మూలకు? మన రాష్ట్రంలో పరిశ్రమలు పుంజుకోవాలంటే కేంద్రం నుంచి సరైన రాయితీలు ఉండాలి. కానీ ఇప్పటి వరకూ అలాంటి రాయితీలు పెద్దగా లేవు. కేంద్రం తాజాగా ప్రకటించిన 15 శాతం రాయితీలు పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఏ మాత్రం సరిపోవు. పారిశ్రామికవేత్తలకు దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. కేంద్రం నుంచి ఆశించిన మేర ప్రోత్సాహం కనిపించడం లేదు. - ముత్తవరపు మురళీకష్ణ, అధ్యక్షుడు (ఎలెక్ట్), ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్, విజయవాడ. కేవలం కంటితుడుపు రాయితీ.. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లో కొత్త పరిశ్రమలకు నూరు శాతం రాయితీలు లభిస్తున్నాయి. అక్కడ పాత పరిశ్రమలకూ రాయితీలు లభించాయి. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు ఒనగూరింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆ మాదిరి ప్రోత్సాహం కొరవడింది. 15 శాతం రాయితీలంటే కంటితుడుపు అన్నట్టే. యంత్ర పరికరాల కొనుగోలు, పెట్టుబడుల్లో కనీసం 50 రాయితీలను ప్రకటించాలి. అలాంటప్పుడు ప్రోత్సాహంగా ఎలా భావిస్తాం. - సుంకర దుర్గాప్రసాద్, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ అధ్యక్షుడు, విజయవాడ. పెట్టుబడులు వస్తాయా..? 'వెనుకబడ్డ ప్రాంతాలల్లో పెట్టుబడి పెడితే ఈ రాయితీలిస్తామని చెబుతున్నారు. కానీ అలాంటి ప్రాంతాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించరు. ఎందుకంటే అన్ని వసతులూ ఉంటేనే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారు' అని ఫ్యాప్సీ మాజీ ప్రెసిండెట్ శ్రీనివాస్ అయ్యదేవర వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడ్డ 7 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు కేటాయించినా... ఎంత కాలానికి ఖర్చు చేస్తారనే స్పష్టత లేదన్నారు. 15 శాతం అదనపు తరుగుదల పయోజనం, 15 శాతం అదనపు పెట్టుబడి అలవెన్స్ ఇవ్వడం వల్ల కొత్తగా రెండు రాష్ట్రాలకూ పారిశ్రామికంగా ఒరిగేదేమీ లేదని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైసెస్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎంఈ) ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి వెల్లడించారు. -శ్రీనివాస్ అయ్యదేవర గొప్ప ప్యాకేజీ కాదు.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ గొప్పదేమీ కాదని సీఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ సురేశ్ రాయుడు చిట్టూరి స్పష్టంచేశారు. ‘‘ప్రత్యేక హోదా అంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టించింది. కొత్త ప్రభుత్వంలోనైనా మంచి ప్యాకేజీ వస్తుందని ఎందరో వ్యాపారవేత్తలు ఎదురు చూశారు’’ అని చెప్పారు. ఎక్సైజ్ సుంకం మినహాయింపు కూడా ఇవ్వాల్సిందన్నారు. ఎలికో ఎండీ రమేష్ దాట్ల మాట్లాడుతూ... ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆదాయపు పన్ను లెక్కింపు సమయంలో మ్యాట్, అదనపు పెట్టుబడి అల వెన్స్ ఏ దశలో తగ్గిస్తారో స్పష్టత ఇవ్వలేదు. మ్యాట్ ఉండడంవల్ల పారిశ్రామికవేత్తలకు ఏమీ ప్రయోజనం రాదు. తెలుగు రాష్ట్రాల్లోనైనా మ్యాట్ మినహాయించాల్సింది’’ అని చెప్పారు. -సురేశ్ రాయుడు చిట్టూరి ఏదైనా ఒక అడుగు పడినట్లే.. తెలంగాణలోని వెనుకబడ్డ జిల్లాల్లో పరిశ్రమలు వచ్చేందుకు కేంద్ర ప్రోత్సాహకాలు దోహదం చేస్తాయని, ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తుందని సీఐఐ తెలంగాణ శాఖ చైర్పర్సన్ వనిత దాట్ల చెప్పారు. పెట్టుబడి పెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్న కంపెనీలకు తాజా ప్యాకేజీతో లాభమేనని సీఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ చైర్మన్, మాలక్ష్మి గ్రూప్ చైర్మన్ వై.హరీష్చంద్ర ప్రసాద్ చెప్పారు. భారీ పెట్టుబడితో వచ్చే కంపెనీలకే ఈ ప్యాకేజీ లాభిస్తుందంటూ... ‘‘ప్యాకేజీ విషయంలో మరింత స్పష్టత రావాలి’’ అన్నారు. కొత్త పెట్టుబడులు వచ్చేందుకు ఒక అడుగు ముందుకు పడ్డట్టేనని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీఏపీసీసీఐ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్‌రెడ్డి చెప్పారు. -వై.హరీష్చంద్ర ప్రసాద్