breaking news
celabrate
-
World Coconut Day: కొబ్బరి బోండానికీ ఒకరోజు.. అది నేడే..
కొబ్బరి.. మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయింది. శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు మొదలుకొని, అనారోగ్యం నుంచి ఉపశమనం పొందేవరకూ కొబ్బరికి ఉన్న ప్రాధాన్యత కొలవలేనిది. చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్లతో అనారోగ్యాల బారిన పడుతున్న మనకు కొబ్బరి స్వీట్లు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా మారాయి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలను పలు రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలున్న కొబ్బరిని విశేషంగా గుర్తించేందుకు ఒక రోజు ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఎప్పుడు ఎలా మొదలైందనే విషయానికొస్తే..అన్నీ ఉపయోగపడేవే..కొబ్బరి చెట్టు కాండం, కాయలు,ఆకులు, కొబ్బరి నీళ్లు, పీచు, కొబ్బరి పాలు,నూనె.. ఇన్ని రకాల ప్రయోజనాలున్నందున ఈ చెట్టు మనిషికి భూలోక కల్పవృక్షంగా మారింది. ప్రపంచ కొబ్బరి దినోత్సవ ప్రధాన లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరికి ఉన్న ప్రాముఖ్యత గుర్తించడం. అందరికీ అవగాహన కల్పించడం. ఆసియా, పసిఫిక్ దేశాలు ప్రపంచంలో అత్యధికంగా కొబ్బరిని పండిస్తున్నాయి. 2009 లో తొలిసారిగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరిగింది. ఇండోనేషియాలోని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టుంది.కొబ్బరి ఉత్పత్తిలో టాప్‌లో భారత్ ప్రపంచంలో కొబ్బరి చెట్టు లేని దేశం అంటూ ఉండదు. అన్ని కాలాల్లోనూ పంట ఇస్తుంది. భారత్ లో కొబ్బరి చెట్టుకు ఉండే ప్రత్యేకత అమోఘమైనది. ప్రపంచ దేశాల్లో కొబ్బరి ఉత్పాదకత కలిగిన దేశాల్లో భారతదేశం టాప్‌లో ఉంది. కొబ్బరి డెవలప్ మెంట్ బోర్డు..కేరళ, తమిళనాడు, కర్నాటక, గోవా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలలో కొబ్బరి దినోత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. కొబ్బరి ఉత్పత్తిని పెంచేందుకు సంబంధించి అవగాహన కోసం నిపుణుల సారధ్యంలో సదస్సులు నిర్వహిస్తుంటుంది.అనేక ప్రయోజనాలుకొబ్బరి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా పేదరిక నిర్మూలనలో కొబ్బరి పాత్రను సూచించడానికి ప్రపంచ కొబ్బరి దినోత్సవ ప్రయత్నిస్తుంది. ఖనిజాలు, ప్రోటీన్లు,బి-విటమిన్ల సమ్మేళనమైన కొబ్బరి మన ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మానికి తేమను సమకూరుస్తుంది. శీతాకాలంలో శరీరం పొడిబారిపోకుండా కొబ్బరి నూనెను రాసుకుంటారు. కొబ్బరి నీరు రిఫ్రెష్ పానీయం అని చెప్పకతప్పదు.మూత్రపిండాల్లో రాళ్లను కొబ్బరి నీరు ఇట్టే కరిగిస్తుంది. అలాగే తక్షణ శక్తినివ్వటంలో కొబ్బరి నీళ్లను మించిన ఔషధ లేదని చెబుతారు. కొబ్బరి, కొబ్బరి నీళ్లు మనలోని శక్తి స్థాయిలను పెంచుతాయి. -
ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్
నటి రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బహుభాషా నటి ఆమె. ఆమె నిర్మాతగా పలు చిత్రాలు, సీరియళ్లు నిర్మించారు. ఆరుపదుల వసంతాలను దాటిన ఈమె ఇప్పటికీ నాట్ అవుట్‌గా నటిస్తూనే ఉన్నారు. నటిగా 45 వసంతాలను పూర్తి చేసుకున్నారు. (ఇదీ చదవండి: హన్సిక సంగతేంటి నెల్సన్..?) 1978లో దర్శకుడు భారతీ రాజా కిళక్కే పోగుమ్ రయిల్ అనే తమిళ చిత్రం ద్వారా రాధికను కథానాయకిగా పరిచయం చేశారు. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని పూవరసంపు పూత్తాచ్చు అనే పాట ఇప్పటికీ తమిళనాడులో వాడ వాడలా మారుమోగుతూనే ఉంది. ఆ తర్వాత తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ తెలుగు, హిందీ భాషల్లోనూ తన సత్తాను చాటారు రాధిక శరత్ కుమార్. సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. పలు జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె నిర్మించి, నటించిన ఒరుకాదల్ కథై చిత్ర దర్శకుడికి ఇందిరాగాంధీ అవార్డు వరించింది. కాగా ఈమె నటిగా 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం తన భర్త శరత్ కుమార్‌తో కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) -
గుమ్మడికాయ కొట్టారు
సెట్లో గుమ్మడికాయ కొట్టారు కామ్రేడ్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా రూపొందిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. ‘గీతగోవిందం’ వంటి హిట్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ఇది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో భరత్ కమ్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూమెంట్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు టీమ్. స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సమాజం పట్ల బాధ్యత కలిగిన యువకుడి పాత్రలో నటించారు విజయ్. క్రికెటర్ లిల్లీ పాత్రలో కనిపిస్తారు రష్మిక. ఈ సినిమాకు జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందించారు. త్వరలో ‘డియర్ కామ్రేడ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వికెట్ తీసిన ఆనందంలో గంతేస్తే..
హరారే: వికెట్ తీయగానే బౌలర్లు ఎగిరిగంతేస్తారు. ఇక్కడ ఒక్కో బౌలర్ ఒక్కో సిగ్నేచర్ స్టెప్‌తో అలరిస్తారు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాళ్లు ముందుంటారు. ముఖ్యంగా విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో వికెట్ తీయగానే అతడు వేసే స్టెప్పులు అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటాయి. ఇలా వికెట్ తీసి సంబరాలు చేసుకునే క్రమంలో బౌలర్ గాయపడటం అనేది చాలా అరుదు. అయితే పాక్ బౌలర్ హసన్ అలీ వికెట్ తీసిన ఆనందంలో గాయపడ్డాడు. హసన్ అలీ వికెట్ తీయగానే తనదైన రీతిలో సిగ్నేచర్ స్టైల్ (బాంబ్ ఎక్స్ప్లోజన్)తో పాక్ అభిమానులను అలరిస్తుంటాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో హసన్ అలీ ఆతిథ్య బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయగానే తనదైన రీతిలో సంబరాలు ప్రారంభించాడు. తన స్టైల్లో ఆనందం వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మెడ కండరాలు పట్టేశాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నెటిజన్లు పాక్ బౌలర్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడితే.. మరికొందరు జాలి పడుతున్నారు. దీనిపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) అలీ గాయం అంత తీవ్రతరమైనది కాదని పేర్కొంది. -
వికెట్ తీసి సంబరాలు చేసుకునే క్రమం
-
కేటీఆర్ తీరుపై నిరసన
సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా సాధన విషయంలో మంత్రి కేటీఆర్ తీరుకు టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి అనుకూలంగా సంబురాలు.. ఉద్యమ కారుల నుంచి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక గాంధీచౌక్‌లో టీఆర్ఎస్ యూత్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అయితే, సిరిసిల్లను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సుంకపాక మనోజ్, గజ్జెల దేవరాజు, మెట్ట రాజు, కూర శ్రీధర్, సబ్బని హరీశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. స్థానిక సాయినగర్‌లోని మానేరువాగు సమీప ఒర్రెలో గుర్తుతెలియని వ్యక్తులు సీఎంకేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు చిత్రపటాలకు పిండప్రదానం చేసి నిరసన తెలిపారు. దాడి చేసిన వారిని సస్పెండ్ చేయాలి మంత్రి కేటీఆర్‌కు పద్మశాలిలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి ఇంటికెల్లి ఆమె భర్త సుదర్శన్‌పై దాడి చేసిన టీఆర్ఎస్ యూత్ విభాగం కార్యకర్తలను వెంటనే సస్పెండ్ చేయాలని పద్మశాలి ప్రముఖులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వస్త్రవ్యాపార సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాయకులు గౌడ సురేశ్, గుండ్లపల్లి పూర్ణచందర్, గోనె ఎల్లప్ప, బూట్ల సుదర్శన్, బూట్ల నవీన్, గోనె ఎల్లప్ప, పంతం రవి, ఆడెపు రవీందర్, గడ్డం బాస్కర్, కాముని వనిత తదితరులు పాల్గొన్నారు.