గుమ్మడికాయ కొట్టారు | dear comrade shooting completed after celebrations | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టారు

Apr 28 2019 2:04 AM | Updated on Jul 14 2019 1:11 PM

dear comrade shooting completed after celebrations - Sakshi

విజయ్‌ దేవరకొండ

సెట్‌లో గుమ్మడికాయ కొట్టారు కామ్రేడ్‌. విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా రూపొందిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ‘ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌’ అనేది ఉపశీర్షిక. ‘గీతగోవిందం’ వంటి హిట్‌ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ఇది. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో భరత్‌ కమ్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ మూమెంట్‌ను హ్యాపీగా సెలబ్రేట్‌ చేసుకున్నారు టీమ్‌. స్టూడెంట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సమాజం పట్ల బాధ్యత కలిగిన యువకుడి పాత్రలో నటించారు విజయ్‌. క్రికెటర్‌ లిల్లీ పాత్రలో కనిపిస్తారు రష్మిక. ఈ సినిమాకు జస్టిస్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించారు. త్వరలో ‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement