breaking news
caste commitments
-
Rajasthan elections 2023: ఏం ‘మాయ’ చేయనుందో...!
రాజస్తాన్లో హోరాహోరీ తలపడుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ గెలుపోటములను మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మరోసారి ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దాంతో పోలింగ్ మరో పది రోజుల్లోకి వచ్చిన వేళ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను బీఎస్పీ ప్రభావితం చేసింది. ఏకంగా 6 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 60 స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సాక్షి, న్యూఢిల్లీ కుల సమీకరణలతో... ► రాజస్తాన్ ఓటర్లలో 18 శాతం మంది ఎస్సీలు, 9 శాతం మంది ముస్లింలున్నారు. దాంతో ఉత్తర్ప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడ కూడా దళిత–ముస్లిం ఫార్ములానే బీఎస్పీ నమ్ముకుంది. ► గత ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో బీఎస్పీ 6 అసెంబ్లీ స్థానాలు నెగ్గడమే గాక 4 శాతం ఓట్లు రాబట్టింది. ► బీఎస్పీ ప్రభావం చూపిన మరో 30 స్థానాల్లో బీజేపీ ఏకంగా 17 స్థానాలను అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్కు కోల్పోయింది. ► మరో మూడింట స్వతంత్రులు గెలిచారు. ఈ దెబ్బకు బీజేపీ అధికారాన్నే కోల్పోవాల్సి వచి్చంది. ► ఆ 17 స్థానాల్లో బీజేపీ గెలుచుంటే ఆ పార్టీ బలం 73 నుంచి 90 స్థానాలకు పెరిగేది. ► 100 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ 83కు పరిమిత ► మయ్యేది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఈసారి కూడా... ► ఈసారి కూడా రాష్ట్రంలో 200 సీట్లకు గాను ఏకంగా 183 చోట్ల బీఎస్పీ బరిలో దిగింది. మిషన్–60 లక్ష్యంతో దూసుకెళ్తోంది. ► ఆ 60 స్థానాల్లో బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఈ విషయంలో పార్టీ నిపుణుడైన రామ్జీ గౌతమ్ వ్యూహాలను అమలు చేస్తోంది. ► ధోల్పూర్, భరత్పూర్, కరౌలీ, సవాయి మధోపూర్, దౌసా, ఆళ్వార్, సికర్, ఝుంఝును, ఛురు, హనుమాన్గఢ్, గంగానగర్, బార్మేర్, జాలోర్, నగౌర్, జైపూర్ రూరల్ జిల్లాల్లోని 60 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేస్తోంది. ► ఈ నెల 17 నుంచి 20 వరకు మాయావతి భరత్పూర్, అల్వార్, ఖేత్రి జిల్లాల్లో ఏకంగా 8 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ► దాంతో గాలి తమకు మరింత అనుకూలంగా మారుతుందని బీఎస్పీ అభ్యర్థులు అంటున్నారు. -
కులం కట్టుబాట్లకు ‘ఆ నలుగురు’ దూరం
జగిత్యాల జోన్ : కులం కట్టుబాట్లతో ‘ఆ నలుగురు’ దూరమైనా తామున్నామంటూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ముందుకు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. అప్పటి వరకు కన్నీరుమున్నీరవుతున్న మృతురాలి కుటుంబ సభ్యులకు తాము అండగా ఉన్నామని భరోసానిచ్చారు. ఈ సంఘటన మండలంలోని పోరండ్లలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇవీ.. గ్రామానికి చెందిన మారుపాక బక్కవ్వ తన తాత పేరిట ఉన్న 20 గుంటలను విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం గ్రామానికి అప్పగించింది. భూమిలో తమకు వాటా ఉందని, గ్రామానికి ఎందుకు ఇచ్చావంటూ ఆమె సామాజిక వర్గానికి చెందిన ఎనిమది మంది పంచారుుతీ పెట్టారు. దీని వల్ల సబ్స్టేషన్ నిర్మాణం ఆగిపోతుందని, గ్రామానికి అప్పగించిన భూమికి బదులు వేరే ప్రాంతంలో తాము 30 గుంటలు అప్పగిస్తామని గ్రామస్తులు ఆ ఎనిమిదిమందిని సముదాయించారు. ఈ క్రమంలోనే బక్కవ్వ అత్త రాజవ్వ ఆదివారం మృతిచెందింది. కానీ, సోమవారం మధ్యాహ్నం వరకూ శవం వద్దకు కులస్తులెవరూ వెళ్లలేదు. శవాన్ని శ్మశానవాటిక వద్ద తీసుకెళ్లేవారే లేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యూరు. స్పందించిన గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు రాజవ్వ అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాజవ్వతో ఎలాంటి బంధం లేకున్నా మానవతా దృక్పథంతో ఈ తంతు పూర్తి చేశారు. పోలీసుల విచారణ.. కాగా, సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు పోరండ్లకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులైన కులస్తుల నుంచి వివరాలు సేకరించారు. మానవ సంబంధాలను కాదన్న వారిని తప్పుబట్టారు. వారికి కౌన్సెలింగ్ చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది.