breaking news
Cash flow
-
ఏదైనా అదుపులో ఉందాం..
మోనికా హెలెన్ ఫైనాల్సియల్ జర్నలిస్ట్, రచయిత్రి, స్పీకర్, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ నిపుణురాలు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్న మోనిక స్టాన్ఫోర్డ్ యూనిర్శిటీలో బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో పట్టా అందుకున్నారు. జటిలమైన ఆర్థిక విషయాలను కూడా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఆమె ప్రసిద్ధ పుస్తకం... లెట్స్ టాక్ మనీ. ఏది చేయాలి? ఏది చేయకూడదు?... మన ఆర్థిక విషయాలకు సంబంధించి సరైన అవగాహన కలిగించే ఈ పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు...‘రెండు వారాలు తిరిగేసరికల్లా నెల జీతం మొత్తం ఖర్చయిపోతుంది. డబ్బు ఎక్కడికి పోతుందో ఏమిటో!’ అని చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. క్లాష్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ సిస్టమ్ డబ్బును ఖర్చు, పొదుపుగా వర్గీకరించడంలో సహాయపడుతుంది.నీడ్స్ వర్సెస్ గ్రీడ్→ ‘ఇవ్వాళ ఖర్చు చేశాం. రేపు సంపాదిస్తాం’ అనే నిర్లక్ష్య ధోరణి వీడి... ఎందుకు ఖర్చు చేశాం? అనవసర ఖర్చా? అవసరమైన ఖర్చా? ఈ విషయాలు ఎప్పటికప్పుడూ విశ్లేషించుకుంటే వృథా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ‘ఎమోషనల్ పర్చేజింగ్’కు దూరంగా ఉండాలి.→ త్రీ–బకెట్ (మూడు ఖాతాల) విధానాన్ని అమలు చేయాలి.1. ఇన్కామ్ ఎకౌంట్ (అన్ని రకాల నగదు రాబడుల కోసం)2. ఖర్చుల ఖాతా–స్పెండ్ ఇట్ ఎకౌంట్ (నెలవారీ ఖర్చుల కోసం)3. పెట్టుబడుల ఖాతా: ఇన్వెస్ట్–ఇట్ ఎకౌంట్ (పొదుపు, పెట్టుబడుల కోసం) త్రీ–బకెట్ సిస్టమ్‌ను అమలు చేసిన మూడు నెలల లోపు మనకు అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చుల గురించి ఒక అవగాహన వస్తుంది.→ పొదుపు పద్దతులను అలవాటు చేసుకోవడానికి మొదట్లో సమయం పట్టవచ్చు. పొదుపు విషయంలో క్రమబద్ధమైన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.→ జీవితం అన్నాక ఊహించని ఖర్చులు ఉంటాయి. అలాంటి సందర్భాలో ఎవరినో అప్పు అడిగే బదులు, ఇబ్బందులు పడే బదులు అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.→ పొదుపు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవాలంటే క్యాష్ ఫ్లో సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్‌ను మనం సమగ్రంగా అర్థం చేసుకోవాలి.→ డబ్బుకు ఒక నిర్దిష్ట ఉద్దేశాన్ని (లేబుల్)ను కేటాయించడం వల్ల దాన్ని ఇతర అవసరాలకు వాడకుండా నిరోధించవచ్చు.నీటిని కూడా...సాధారణంగా ఎండాకాలంలో మాట్లాడే నీటి పొదుపు గురించి వర్షాభావం పుణ్యమా అని ఈ కాలంలో కూడా తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. మన ఇంట్లో నీటి పొదుపుకు కొన్ని మార్గాలు...→ చాలా నగరాల్లో నీరు వృథా కావడానికి కారణం... పళ్లు తోముకునేటప్పుడు, ముఖం కడిగేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు కుళాయిని మూసివేయకపోవడం. దీన్ని నివారించడానికి కుళాయి తెరిచిన ప్రతీసారి అప్రమత్తంగా ఉండాలి. నీరు వృథా కాకుండా చూడాలి.→ కుళాయిల నుండి నీరు వృథాగా పోయే సమస్యకు వాటర్ ఏరేటర్లు ఒకే ఒక్క పరిష్కార మార్గం. సాధారణ కుళాయిలతో పోలిస్తే ఏరేటర్లు నిమిషానికి దాదాపు 35–40 శాతం నీటిని ఆదా చేస్తాయి.→ తడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ కంపోస్టింగ్. పట్టణ ప్రాంతాలలో మిద్దెతోటలు ప్రాచుర్యం పొందుతుండడం వల్ల మొక్కలు ఉన్న ఇళ్లలో నీటి వినియోగం పెరిగింది. కంపోస్టింగ్ ఎరువును ఉపయోగించడం ద్వారా తక్కువ నీరు అవసరమవుతుంది.→ షవర్హెడ్స్ ద్వారా ఎన్నో లీటర్ల నీరు వృథా అవుతోంది. దీనికి బదులు ఒక బకెట్ నీటితో స్నానం చేస్తే మంచిది. సాధారణ షవర్హెడ్స్కు బదులుగా నీటిని ఆదా చేసే షవర్హెడ్స్ను అమర్చుకోవడం ద్వారా 80 శాతం వరకు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఇంధన వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు.→ నీటిని పునర్వినియోగించుకోవడమే నీటి పొదుపుకు ఉత్తమ మార్గం. ఉదా: కూరగాయలు, పండ్లు కడిగిన నీటిని తోట పనులకు తిరిగి ఉపయోగించవచ్చు. కూరగాయలను ఆవిరిపై ఉడికించడానికి ఉపయోగించిన నీటిని పారబోస్తుంటాం. చల్లారిన తరువాత ఈ నీటిని మొక్కలకు తిరిగి పోయడానికి ఉపయోగించవచ్చు. వంట నీటిని తిరిగి ఉపయోగించడం అనేది వ్యర్థాలను తగ్గించే సులభ మార్గం. మొక్కలకు సహజమైన బలాన్ని కూడా ఇస్తుంది.→ కండెన్సేషన్ ట్రేలు ఉన్న డిహ్యూమిడిఫైయర్లు, రిఫ్రిజిరేటర్లు నీటిని గ్రహిస్తాయి. ఈ నీటిని మురుగు కాలువలో పారబోయడానికి బదులుగా ఫ్లోర్‌ను శుభ్రం చేయడానికి, టాయిలెట్లను ఫ్లష్ చేయడానికి, మొక్కలకు నీరు పోయడానికి తిరిగి ఉపయోగించవచ్చు.→ కూరగాయలు, పండ్లు కడిగేటప్పుడు చాలా నీరు వృథా అవుతుంది. దీనికి బదులుగా ఒక గిన్నె లేదా బేసిన్‌ను ఉపయోగించడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు.→ వంటగదులు, బాత్రూమ్లలో పుష్–బటన్ కుళాయిలు లేదా మోషన్–సెన్సార్ కళాయిలను అమర్చడం ద్వారా నీటి వృథాను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ కుళాయిలు వాటంతట అవే ఆగిపోతాయి. చేతులు కడుక్కోవడం, పళ్లు తోముకోవడం...మొదలైన వాటికి సంబంధించి నీటి వాడకాన్ని పరిమితం చేయడానికి చిన్న ట్యాప్ టైమర్స్ ఉపయోగపడతాయి. -
తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ నష్టం.. తొలిసారి పాజిటివ్ క్యాష్ ఫ్లో
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్థిక సంవత్సరం (2025–26) నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.500 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.870 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి నష్టం 42.5 శాతం తగ్గింది. ఆదాయం 57 శాతం క్షీణించి రూ.611 కోట్ల నుంచి రూ.265 కోట్లకు దిగజారింది.ఆదాయం తగ్గినా, స్థూల మార్జిన్లు మెరుగయ్యాయి. ఇవి వార్షిక ప్రాతిపదికన 13.7% నుంచి 38.5 శాతానికి చేరాయి. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, మెరుగైన స్థూల మార్జిన్లు, కఠినమైన వ్యయ నియంత్రణ కారణంగా కంపెనీ చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాల నగదు ప్రవాహం పాజిటివ్‌గా మారి క్యూ4లో రూ.91 కోట్లుగా నమోదైంది. ఆటోమొబైల్ వ్యాపారం నుంచి రూ.213 కోట్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, రూ.173 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) నమోదయ్యాయి.మార్చి త్రైమాసికంలో మొత్తం 20,256 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కంపెనీ విక్రయించింది. ఇక పూర్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ మొత్తం రూ.2,253 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. రూ.1,833 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 1,73,794 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను డెలివరీ చేసింది. -
ఒక్కో ఓటుపై రూ.700
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన వ్యయం, తాయిలాలను ఇందులో లెక్కించినట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 10 నుంచి చివరి విడత ఎన్నికలు జరిగిన మే 19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర రూపాల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇందులో కలిపినట్లు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి రూ.100 కోట్లను ఖర్చు పెట్టినట్లు తేల్చింది. అంటే ఒక్కో ఓటు కోసం సగటున రూ.700 ఖర్చు పెట్టారన్నమాట. ఒకవేళ ఈసీ ఎన్నికల నిర్వహణ ఖర్చులను, ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగిస్తే ఒక్కో ఓటుపై రాజకీయ పార్టీలు రూ.583 ఖర్చుపెట్టినట్లు అవుతుంది. పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం.. మనదేశంలో రాష్ట్రాలను బట్టి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అదే అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 8,049 అభ్యర్థులు బరిలో నిలవగా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3,589 మంది పోటీ చేశారు. నిజానికి ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు చేసిన వ్యయం రూ.6,639.22 కోట్లు దాటకూడదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఖర్చు రూ.24,000 కోట్లు దాటిపోయిందని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, విలువైన లోహాలతో పాటు మత్తుపదార్థాలను సైతం తాయిలాలుగా అందించినట్లు వెల్లడైంది. కేవలం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనే రూ.1,280 కోట్ల డ్రగ్స్‌ను సీజ్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3 రెట్లు అధికంగా నగదును ఈసీ జప్తు చేసింది. ఎన్నికల రారాజు బీజేపీ.. ఈ సార్వత్రిక ఎన్నికల ఖర్చులో సింహభాగం బీజేపీదే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రూ.24,750 కోట్ల నుంచి రూ.30,250 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం. మొత్తం ఎన్నికల ప్రచార వ్యయంలో బీజేపీ వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 నుంచి 20 శాతానికి పరిమితమైంది. ధనప్రవాహం ఎక్కడిది? సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి రాకపోవడం రాజకీయ పార్టీల పాలిట వరంగా మారుతోంది. దీంతో తమకు విరాళాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పార్టీలు బయటపెట్టకపోవడంతో పారదర్శకత అన్నది కొరవడింది. దీనికితోడు ఎలక్టోరల్ బాండ్లు కూడా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాతరేశాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల చివరివరకూ 4,794 ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రియల్ఎస్టేట్, మైనింగ్, టెలికం, రవాణా రంగాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది. వీటికితోడు పలు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లు, ఎన్జీవో సంస్థలు కూడా తమ ప్రయోజనాల రీత్యా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయని చెప్పింది. ఎన్నికల వ్యయ నియంత్రణ, పారదర్శకత విషయమై 54 దేశాల్లో తాము జరిపిన అధ్యయనంలో భారత్ 31 పాయింట్లు సాధించినట్లు సెంటర్ ఫర్ స్టడీస్ తెలిపింది. అంటే భారత్ ఈ జాబితాలో దిగువ నుంచి 12వ స్థానంలో ఉందని పేర్కొంది. -
ఈ ఏడాది 78 స్థాయికి రూపాయి!
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 78 స్థాయిని చూసే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ కార్వీ తెలియజేసింది. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటులు దీనికి ప్రధాన కారణం కానున్నాయని సంస్థ తన వార్షిక కమోడిటీ, కరెన్సీ నివేదికలో పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు సైతం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా కార్వీ కమోడిటీస్ అండ్ కరెన్సీల విభాగం సీఈఓ రమేశ్ వరకేద్కర్ తెలిపారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 68– 69.50 శ్రేణి బేస్‌గా 73.70– 74.50 శ్రేణి కనిష్ట స్థాయికి రూపాయి చేరవచ్చు. ఈ స్థాయి కిందకు పడితే, ఖచ్చితంగా ఇదే ఏడాది రూపాయి 78 దిశగా పతనం అయ్యే అవకాశం ఉంది. ► ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితంపై తీవ్ర అనిశ్చితి ఉంటుంది. అందువల్ల అటు విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టర్లు ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులకు తక్షణం దూరంగా ఉండే వీలుంది. ► 2017–18 పూర్థి ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 48.72 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచే నాటికే ఈ విలువ 34.94 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే విధంగా రెండవ ఆరునెలల గణాంకాలూ నమోదయితే, క్యాడ్ దేశానికి తీవ్ర భారంగా తయారయ్యే అవకాశం ఉంది. ► ఒపెక్, రష్యాలు తమ ఉత్పత్తుల కోత నిర్ణయం తీసుకుంటే, అంతర్జాతీయంగా క్రూడ్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ► వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా వృద్ధి భయాల వల్ల కాపర్, అల్యూమినియంసహా బేస్‌మెటల్ ధరలు బలహీనంగానే ఉంటాయి. ► సరఫరాల సమస్యల వల్ల పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది. ► అధిక పంట దిగుబడుల వల్ల సొయాబీన్ మార్కెట్లో ఈ ఏడాది రెండవ భాగంలో అమ్మకాలు ఒత్తిడి ఉండే వీలుంది. ► తక్కువ దిగుబడివల్ల జీర, చిక్కుడు ధరలు సానుకూలంగా ఉండవచ్చు. 71.56 వద్ద రూపాయి... డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం కేవలం ఒక్కపైసా లాభంతో 71.56 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 71.68–71.49 శ్రేణిలో తిరిగింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 10 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడు బల్లమీదకు ఎక్కింది. ఇప్పటికిప్పుడు రూపాయి 68 దిశగా బలపడే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. -
వెంకన్న హుండీకి నోట్ల వెల్లువ
-
వెంకన్న హుండీకి నోట్ల వెల్లువ
తిరుపతి: పెద్ద నోట్ల రద్దు వల్ల తోపుడు బండ్లు, చిల్లర దుకాణాలు మొదలు మాల్స్ వరకు వ్యాపారాలు పడిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. బంగారం షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్నా.. వడ్డికాసులవాడు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీపై ఏమాత్రం ప్రభావం పడలేదు. మునిపటి కంటే ఎక్కువగా శ్రీవారికి కానుకలు పోటెత్తుతున్నాయి. 'ఏడాదికి హుండీ ద్వారా మాత్రమే దాదాపు వెయ్యి కోట్ల నగదు వస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేసినా ఏమాత్రం ప్రభావం పడలేదు. దేశవ్యాప్తంగా వస్తున్న భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తున్నారు. బంగారు, వెండి కానుకలు గాక హుండీ ద్వారా రోజుకు సరాసరిన మూడు కోట్ల రూపాయల డబ్బు వస్తోంది. నవంబర్ 9 నుంచి పది రోజుల్లో హుండీ ద్వారా 30.36 కోట్ల రూపాయల నగదు కానుకగా వచ్చింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన డబ్బుతో పోలిస్తే ఈ మొత్తం 8 కోట్ల రూపాయలు ఎక్కువ' అని టీటీడీ అధికారులు చెప్పారు.


