breaking news
case against woman
-
రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో మూడో భర్తతో పరారైంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తేని జిల్లా కూడలూరుకు చెందిన విజయ్‌బోస్ (32) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. విద్య (30) ను 2014లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగ నిమిత్తం భర్త మరో ఊరిలో ఉండేవాడు. కుమారుడి ఆలనాపాలన చూడకుండా విద్య అధిక సమయం సెల్ఫోన్లో గడుపుతుండేది. ఈ క్రమంలో కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న విజయ్‌బోస్ ఇంటికి వచ్చి భార్యను మందలించాడు. మాట వినకపోవడంతో భార్య తరఫు బంధువులకు ఫిర్యాదు చేయగా విద్యకు గతంలో పెళ్లయినట్లు, విజయ్‌బోస్ రెండోభర్త అనే విషయం బయటపడింది. దీంతో, ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కుమారుడిని భర్త వద్దే వదిలేసి విద్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎలాగోలా నచ్చజెప్పి భార్యను కాపురానికి తీసుకురావాలని విజయ్‌బోస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడా ది మేలో మురళి అనే వ్యక్తిని విద్య మూడో వివాహం చేసుకుంది. ఈ పరిణామంతో మరింత ఖంగుతిన్న విజయ్‌బోస్ తన అత్తింటివారిని నిలదీయగా, వరకట్న వేధింపుల కేసు పెడతాం అని బెదిరించారు. మహిళా పోలీస్ స్టేషన్లో విజయ్‌బోస్ ఫిర్యాదు చేయడంతో విద్య, ఆమె తండ్రి సుకుమారన్, తల్లి చిత్ర, తమ్ముడు శరణ్‌కుమార్, తాజా భర్త మురళి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అబ్బాయిని రేప్ చేసి వీడియో తీసింది
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 23 ఏళ్ల యువతి 16 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసింది. సహరన్పూర్ జిల్లా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సంబంధిత యువతి బాధితుడిపై అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియో తీసింది. పెళ్లి చేసుకోకుంటే ఈ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించింది. ఇద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణలు, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించిన అనంతరం యువతిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.