breaking news
capital of india
-
దేశ రాజధాని మార్పు అవసరమేనా?
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికిచేరింది. తాజాగా అక్కడ గాలి నాణ్యతా సూచి 500 మార్క్ చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో కాలుష్య మయమైన ఢిల్లీని భారతదేశ రాజధానిగా కొన సాగించడం అవసరమా అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లేవనెత్తిన అంశం చర్చకు దారి తీస్తోంది.మొఘల్ చక్రవర్తుల రాజధానిగా ఒక వెలుగు వెలిగిన ఢిల్లీ... బ్రిటిష్ రాణి పాలనా కాలంలోనూ, స్వాతంత్య్రం తరువాత కూడా రాజధాని హోదాతోనే ఉంది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్ట్, ప్రధాన మంత్రి కార్యా లయం వంటి అత్యున్నత సంస్థలు ఢిల్లీలో ఉన్నాయి. ఇతర నగరాలతో పోటీ పడుతూ వాణిజ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందింది. అంతర్జాతీయసంబంధాల రీత్యానూ ఢిల్లీ కీలకమైన స్థానం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజధాని మార్పుఅంశం తెర మీదకు వచ్చింది.ప్రపంచంలో కొన్ని దేశాలు తమ తమ రాజధానులను అవసరం మేరకు మార్చుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నైజీరియా పాత రాజధాని లాగోస్ నుంచి 1991లో ‘అబుజా’కు మార్చుకుంది. లాగోస్‌లో అధిక జనసాంద్రత సమస్య, ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. అందుకే దేశానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న అబుజాను కొత్త రాజ ధానిగా ఎంచుకున్నారు. ఇక 2006లో యాంగోన్ (రంగూన్) నుంచి నైపిటావ్కు మయన్మార్ తన రాజధానిని మార్చుకుంది. భద్రత, పరిపాలన సామర్థ్యం పెంపొందించుకోవడం వంటి కార ణాలుఇందుకు కారణాలు. 1918లో రష్యా కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి మాస్కోకు రాజధానిని మార్చింది.వ్యూహాత్మకంగా మాస్కో మరింత ప్రాముఖ్యం ఉన్న ప్రాంతమని రష్యా భావించింది. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ 1963లో కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు రాజధానిని మార్చుకుంది. కరాచీ నగరానికి భద్రతా సమస్యలు ఉండటం, అక్కడ అధిక జనాభా ఉండడం వంటి కారణాలతో దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న ఇస్లామాబాద్‌కు రాజధానిని తరలించు కున్నారు. బ్రెజిల్,, కజకిస్తాన్, టాంజానియా వంటివీ రాజధానులను మార్చుకున్నాయి. ఇక ప్రస్తుతం మన విషయానికి వస్తే... పుణే, హైదరాబాద్, నాగపూర్ వంటి నగరాలు దేశానికి మధ్యలో ఉండటం వల్ల వీటిలో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ఎంచుకోవాలని కొందరు సూచిస్తు న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో కొన్ని తక్షణ చర్యలు చేపట్టాలి. గ్రీన్ బెల్ట్స్ అభివృద్ధి చేయాలి. పునఃవిని యోగ ఇంధన వనరులన వాడకాన్ని అధికం చేయాలి. పరిపాలనా కార్యా లయాలను ఇతర నగరాలకు విస్తరించాలి. ఈ క్రమంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే అంశం మరో సారి తెరపైకి వస్తోంది. ఇక్కడి మౌలిక వసతుల నేపథ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయా లని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బాబా సాహెబ్ అంబేడ్కర్ అప్పట్లోనే అన్నారని, ఆ అర్హత హైదరాబాద్‌కు ఉందని కొందరు గుర్తు చేస్తు న్నారు. హైదరాబాద్‌లో కూడా కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుందని, భాగ్యనగరంతో పాటు తెలంగాణలో వివిధ ప్రదేశాల్లో పరిపా లనా కేంద్రాలను నిర్మిస్తే బాగుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.శశిథరూర్ లేవనెత్తిన అంశంపై మరింత చర్చ జరగాలి. ఢిల్లీవంటి నగరంలో పెరుగుతున్న కాలుష్యం, జనాభా, మౌలిక సదు పాయాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజధానిని మార్చడం అనేది తక్షణావసరం కాకపోయినా, భవిష్యత్తులో పరిశీల నార్హమైన అంశం. అదే సమయంలో ఢిల్లీని కాలుష్యం బారి నుంచి రక్షించడం తక్షణ అవసరం.– ఎక్కులూరి నాగార్జున్ రెడ్డిఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 90320 42014 -
‘ఢిల్లీ.. దేశ రాజధాని అని ఎక్కడ ఉంది!’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఢిల్లీ పాలనపై రాష్ట్రానికి పూర్తి అధికారాలు ఉండాలంటూ అరవింద్ కేజ్రీవాల్ చాలాకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతంఈ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. దేశ రాజధానిగా ఢిల్లీని పేర్కొంటూ.. రాజ్యాంగంలోకానీ, లేదా పార్లమెంట్ కానీ ఎక్కడా చట్టం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టుకు తెలిపింది. రాజ్యాంగంలోకానీ, లేదా ఏదైనా చట్టం ద్వారా కానీ దేశరాజధానిగా ఢిల్లీని పేర్కొన్నారా? అంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించింది. ఢిల్లీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుల వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ మేరకు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోకానీ, చట్టం ద్వారా కానీ ఢిల్లీని దేశ రాజధానిగా ప్రకటించలేదని.. ఈ నేపథ్యంలో రాజధానికి ఇక్కడనుంచి మరోచోటకు తరలించి ఢిల్లీ ప్రభుత్వానకి కార్యనిర్వహణాధికారాలు దఖలు పర్చవచ్చని ఆయన తెలిపారు. -
దేశ రాజధాని అందరిదీ: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రతీ ఒక్కరి సొంతమని, ఈశాన్య రాష్ట్ర విద్యార్థిపై దాడి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ రాజధానిలో దాడికి గురై మృతిచెందిన అరుణాచల్ విద్యార్థి నిడోటినీ ఉదంతంపై కోర్టు స్వచ్ఛందంగా విచారణ చేపట్టింది. షాపు సిబ్బంది కొట్టిన దెబ్బలకే మరణించాడన్న మీడియా వార్తలపై స్పందించిన హైకోర్టు.. ఘటనకు సంబంధించిన సమాచారంతోపాటు ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రాజివ్ సహాయ్‌లతో కూడిన బెంచ్ సోమవారం కేంద్ర హోంశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.