breaking news
Bye
-
తొలి రౌండ్లో అమిత్‌కు ‘బై’
టోక్యో: ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ బాక్సర్ అమిత్ పంఘాల్ (52 కేజీలు) సహా నలుగురు బాక్సర్లకు ఒలింపిక్స్ తొలి రౌండ్లో ‘బై’ లభించింది. గురువారం తీసిన ‘డ్రా’లో పురుషుల విభాగంలో సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), మహిళల విభాగంలో లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు)లకు తొలి రౌండ్లో బై లభించగా... వీరంతా నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడతారు. అయితే మొత్తమ్మీద భారత బాక్సర్లందరికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. తదుపరి రౌండ్లలో గత ఒలింపిక్స్ పతక విజేతలు, మేటి ప్రత్యర్థులు ఎదురుకానుండటంతో బాక్సర్లకు కష్టాలు తప్పేలా లేవు. 25న జరిగే తొలి రౌండ్ బౌట్లో హెర్నాండెజ్ (డొమినికా)తో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, స్టార్ మహిళా బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)... ఇచ్రక్ చైబ్ (అల్జీరియా)తో పూజా రాణి (75 కేజీలు) పోటీపడతారు. ప్రిక్వార్టర్స్‌లో లవ్లీనా... నడిన్ అప్టెజ్ (జర్మనీ)తో, సిమ్రన్‌జీత్... సుదపొర్న్ సీసొండి (థాయ్‌లాండ్)తో తలపడతారు. పురుషుల ఈవెంట్ తొలి రౌండ్లో లూక్ మెక్కార్మక్ (బ్రిటన్)తో మనీశ్ కౌశిక్ (63 కేజీలు)... మెన్సా ఒకాజావ (జపాన్)తో వికాస్ కృషన్ (69 కేజీలు)... ఎర్బెకి తౌహెటా (చైనా)తో ఆశిష్ (75 కేజీలు) తలపడతారు. -
బై బై గణేశా !
వైభవంగా వినాయక శోభాయాత్ర రెండు చోట్ల అపశ్రుతులు.. ఇద్దరి మృతి జిల్లా అంతటా బుధవారం ఆధ్యాత్మిక శోభ సంతరించకుంది. డప్పు చప్పుళ్లు .. బాజాబజంత్రీలు.. డ్యాన్సులు.. కోలాట నృత్యాలతో గణనాథుల శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. నవరాత్రులు పూజలందుకున్న పార్వతీ తనయుడిని భక్తులు నిమజ్జనానికి తరలించారు. నల్లగొండ పట్టణంలోని 1వ వార్డులో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు.14వ మైలు, వల్లభరావు చెరువు, వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద విఘ్నేశ్వరుల విగ్రహాలను నిమజ్జనం చేశారు. అంతకుముందు మండలపాల వద్ద లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సురేష్(24) చెరువులో మునిగి, భువనగిరిలో నేరెల్ల రాజు(30) అనేయువకుడు కత్తిపోట్లకు గురై మృత్యువాత పడ్డారు.