breaking news
Buses collided
-
ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం
అబుజాన్: ఐవరీకోస్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్సులు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది దుర్మరణం పాలవ్వగా 28 మంది దాకా గాయపడ్డారు. బ్రొకోవా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దేశ రవాణాశాఖ మంత్రి స్పందించారు.రోడ్లపై ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఐవరీకోస్ట్‌లో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో ఏటా వెయ్యి మంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గత నెలలోనే దేశంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదీ చదవండి: స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి హత్య -
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 70 మందికి గాయాలు.
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులు నజ్జునుజ్జుయినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
కొండపల్లిలో రెండు బస్సులు ఢీ
మహిళ మృతి 16 మందికి గాయాలు చెత్త తగులబెట్టిన పొగ వల్లే ప్రమాదం మృతురాలి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో 16మంది గాయపడగా ఒక మహిళ మృతి చెందారు. కొండపల్లి జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈఘటన జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం తిరువూరు ఆర్టీసీ డిపోకు చెందిన అద్దెబస్సు విజయవాడ నుంచి తిరువూరు వెళ్తుంది. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన 350 సర్వీసు నంబరు బస్సు మైలవరం నుంచి విజయవాడ వస్తుండగా కొండపల్లి వద్దకు వచ్చేసరికి రెండుబస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈసంఘటనలో 350 సర్వీసు బస్సు ఎదురుభాగం నుంచి 10అడుగుల దూరం పూర్తిగా ధ్వంసమైంది. రెండు బస్సుల్లో సుమారు 80 మంది ప్రయాణిస్తుండగా 16మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన డ్రైవర్ ప్రకాష్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.పోలీసులు, స్థానికులు ఆప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను 108వాహనంలో విజయవాడకు తరలించారు. మార్గం మధ్యలో 350బస్సులో ప్రయాణిస్తున్న ఉండవల్లికి చెందిన వై.లక్ష్మి(38) మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. స్వల్ప గాయాలైన ప్రయాణికులను స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు పంపారు. ఈప్రమాదానికి రహదారి పక్కన ఉన్న పంచాయతీ డంపింగ్ యార్డు నుంచి దట్టంగా వెలువడుతున్న పొగే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది డంపింగ్ యార్డులో మండుతున్న మంటలను ఆర్పేశారు. క్రేన్ల సహాయంతో ఢీకొన్న వాహనాలను వేరుచేశారు. సహాయక చర్యల్లో ఎస్ఐలు కృష్ణ, గణేష్, యువకుమార్ పాల్గొన్నారు. 16మందికి వైద్య సేవలు కొండపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటనలో గాయపడిన 16మందికి వైద్యసహాయం అందిస్తున్నామని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వై.సురేష్‌బాబు తెలిపారు. గాయపడిన పాతపాడుకు చెందిన లక్ష్మీ(26), తేజ(7), రాణి(36), నర్శమ్మ(70), యశ్వంత్(5), ప్రకాష్(డ్రైవర్), రాజారావు(డ్రైవర్) మరో ఇద్దరితో కలిపి 9మంది ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారిని తెలిపారు. కొండపల్లి ప్రైవేట్ వైద్యశాలలో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఉండవల్లి గ్రామానికి చెందిన వై.లక్ష్మి మృతి చెందారని, ఆమె కుటుంబ సభ్యులకు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తామన్నారు. ఆర్టీసీ ఎండీ ఉత్తర్వుల మేరకు ఈ సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు.