breaking news
Buchepalli Venkayamma
-
‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్ జగన్‌ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?...2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్ జగన్‌తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్ జగన్ నన్ను జడ్పి చైర్ పర్సన్‌ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్ జగన్ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు. -
మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ
‘‘మా సంస్థలో నిర్మించిన ఐదో చిత్రం ఇది. ఇందులో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ‘అమ్మ’ పాట చాలా హృద్యంగా ఉంటుంది. మా అబ్బాయి ఆ పాట మాకు వదిలి తను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’ అని బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. కమలాకర్ హీరోగా చింతలపూడి వెంకట్ దర్శకత్వంలో బూచేపల్లి వెంకాయమ్మ సమర్పణలో బి. నాగలక్ష్మి నిర్మించిన ‘బ్యాండు బాలు’ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమలాకర్ తల్లి వెంకాయమ్మ తన కొడుకుని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో ‘అమ్మ...’ మీద ఉన్న పాటను తన గుర్తుగా మాకు వదిలేసి, తను వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. కమలాకర్ పిల్లల కోసం తాము బతుకుతున్నామనీ, లేకపోతే తను వెళ్లిపోయినప్పుడే మేమూ... అంటూ దుఃఖంతో మాట్లాడలేకపోయారు. కమలాకర్ తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ -‘‘2012లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి, పది నెలల్లో పూర్తి చేశాం. విడుదలకు సిద్ధం చేస్తున్న సమయంలో కమలాకర్ మరణం మమ్మల్ని కలిచివేసింది. ఆ మానసిక క్షోభ కారణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కొంచెం తేరుకున్నాం. సెంటిమెంట్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. సినిమా మీద మమకారంతో లాభాలను బేరీజు వేసుకోకుండా కమలాకర్ సినిమాలు తీసి, పది మందికి ఉపాధి కల్పించాడని నటుడు చలపతిరావు చెప్పారు. దర్శకుడు చింతలపూడి వెంకట్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ మీద ఒక పాట ఉంది. ఈ పాట చిత్రీకరిస్తున్న సమయంలో వెంకాయమ్మగారు షూటింగ్‌కి వస్తే, ఆవిడ కూడా ఉంటే బాగుంటుందన్నాను. కానీ, కమలాకర్ వద్దన్నాడు. చివరికి ఆయన భార్య, ‘అమ్మ పాటే కదా.. ఉంటే బాగుంటుంది’ అనడంతో కమలాకర్ అంగీకరించాడు. ఈ విధంగా ఈ పాటలో ఆమె ఉన్నారు. ‘ప్రతి తల్లికీ ఈ పాట మంచి బహుమతి’ అని కమలాకర్ అనేవారు. అంత గొప్పగా ఉంటుంది’’ అన్నారు. కమలాకర్ సోదరుడు శివప్రసాద్‌రెడ్డి, నటులు బెనర్జీ, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.