breaking news
Buchamma Buchodu
-
అందుకు బాధగా ఉంది!
‘‘ఈ చిత్రం కోసం నేను 18 నెలలు కష్టపడ్డాను. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని సినిమా పూర్తి చేశాం. నిర్మాతలు రాజీపడకుండా తీశారు. సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ, ఆ ఘనత మొత్తం శివాజీనే తీసుకుంటున్నారు. అందుకు బాధగా ఉంది’’ అని రేవన్ యాదు చెప్పారు. ఆయన దర్శకత్వంలో శివాజి హీరోగా నటించిన ‘బూచమ్మా బూచోడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవన్ యాదు మాట్లాడుతూ -‘‘కథ నచ్చి నిర్మాతలను కూడా శివాజీనే సెట్ చేశారు. అయితే ఆయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునేవారు. వాస్తవానికి శివాజి జోక్యం కనుక లేకపోయి ఉంటే.. ఈ చిత్రం 175 రోజులు ఆడేది’’ అన్నారు. తాను పోసాని కృష్ణమురళి దగ్గర రచయితగా చేశానని, గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశానని చెప్పారు. -
సినిమా దర్శకుణ్ణే పక్కన పెట్టేశారు!
-
ఫామ్‌హౌస్‌లో ప్రణయం
‘‘నాకో మంచి హిట్ రావాలనే ఆశయంతో అందరూ కష్టపడి ఈ సినిమా చేశారు. కొంతమందైతే పారితోషికం కూడా తీసుకోలేదు. అందరూ మనసు పెట్టి సినిమా చేస్తే తెలుగు పరిశ్రమ బాగుంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని శివాజీ చెప్పారు. ఆయన హీరోగా శ్రేయాస్ మీడియా సమర్పణలో స్నేహ మీడియా, హెజెన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘బూచమ్మా బూచోడు’. రేవన్ యాదు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఆడియో సీడీని మధుర శ్రీధర్ ఆవిష్కరించి మల్టీ డైమన్షన్ వాసుకి ఇచ్చారు. బిగ్ సీడీని మారుతి విడుదల చేశారు. వినోద ప్రధానంగా సాగే హారర్ మూవీ ఇదని, ఈ నెల 18 లేక 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఓ యువజంట ఫామ్‌హౌస్‌లోకి అడుగుపెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదే ఈ చిత్రం ప్రధానాంశం అని దర్శకుడు తెలిపారు. ఇది కొత్త జానర్లో సాగే సినిమా అని చిత్రసంగీతదర్శకుడు శేఖర్ చంద్ర చెప్పారు.