breaking news
BS Four
-
కరోనా ఎఫెక్ట్: రిజిస్ట్రేషన్లు అనుమానమే..
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లకు ఇంకా వారం మాత్రమే గడువు ఉండడంతో బీఎస్–4 వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 31వ తేదీలోగా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోక పోతే ఆ వాహనాలను తుప్పుగా పరిగణించనున్నారు. వాహన కాలుష్యంతో వాతావరణం సమతుల్యత దెబ్బతింటుందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బీఎస్–4 వాహనాల స్థానంలో బీఎస్–6 వాహనాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2016లోనే ఇందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆర్టీఏ కార్యాలయం నిత్యం సందడిగా కనిపిస్తోంది. అయితే ‘కరోనా’ వైరస్ ప్రజా జీవనంపైనే కాదు రవాణా శాఖపై కూడా తన ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్, లర్నింగ్, డ్రైవింగ్ టెస్ట్‌లు, లర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి గాను స్లాట్ బుకింగ్‌లు నిలిపివేశారు. వాహన ఫిట్నెస్, వాహన రిజిస్ట్రేషన్లు మాత్రమే సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు తక్కువ సమయం ఉండటంతో పాటు కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించడానికి మోటారు వాహన రంగంలో ఎప్పటికప్పుడు వాహన తయారీలో పెనుమార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు నడిచిన బీఎస్–4 వాహనాలు ఇక పాత మోడల్స్‌గా మిగిలిపోనున్నాయి. ప్ర స్తుతం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బీఎస్–6 వాహనాలకు చాలా క్రేజ్ ఏర్పడుతోంది. ఇక బీఎస్–3, 4 ఇతర పాత వాహనాలకు మార్చి 31 వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తి చేయనున్నారు. గత పది రోజుల్లో మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి ఏకంగా 2,150 వాహనాల రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–4 (భారత్ స్టేజీ–4) వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిషేధించారు. బీఎస్–6 ప్రమాణాల మేరకు ఉన్న వాహనా లనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తూ సుప్రీం కో ర్టు సైతం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రి జిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. రెండు జిల్లాల్లో వివరాలు.. బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ నిబంధనలపై గత నెల రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. వివిధ షోరూం నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. నూతన వాహనాలకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వాహనదారులకు అవగాహన కూడా కల్పించారు. మంచిర్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాలు, కార్లు, గూడ్స్ ఇతర వాహనాలు మొత్తంగా 4,858 వాహనాలు ఉండగా కుమురం భీం జిల్లాలో 2,683 వాహనాలు కలిపి రెండు జిల్లాల్లో 7541 ఉన్నాయి. ఇందులో రెండు జిల్లాల్లో కలిపి 5391 ఇంకా రిజిస్ట్రేషన్ కావాలి్సన వాహనాలు ఉన్నాయి. బీఎస్ 6 వాహనాలు రానుండగా బీఎస్–4 తయారీ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించకుంటే నష్టమే.. ఈ నెలాఖరులోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయించుకోకపోతే కొనుగోలు దారులు చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈనెల 31 తరువాత బీఎస్–4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయరు. దీంతో ఆ వాహనం పట్టుపడితే సీజ్ చేయడం ఖాయం. బీమా కంపెనీలు ఆ వాహనాలను ఇన్‌స్రూెన్స్ చేయరు. దీంతో ఆ వాహనానికి ఏ ప్రమాదం జరిగినా బీమా వర్తించదు. దీనికి తోడు బీమా లేకుండా వాహనం నడిపితే కొత్త చట్టం ప్రకా రం జరిమానా, జైలు శిక్ష కూడా తప్పదు. గడువులోగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఉన్న డీలర్లకు బీఎస్–4 వాహన అమ్మకాలు నిలిపివేయాలని స్పష్టం చేశాం. ఈ నెలఖారులోగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఏ వాహనమైనా మార్చి 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకుంటే రిజిస్ట్రేషన్ లేని వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా గుర్తిస్తారు. – ఎల్.కిష్టయ్య, జిల్లా రవాణా శాఖాధికారి ‘కరోనా’ ప్రభావంతో కష్టమే.. కరోనావ్యాధి తీవ్ర నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వస్తుండటంతో రద్దీ ఏర్పడి ‘కరోనా’ వ్యాధి వ్యాప్తించేందుకు అవకాశం ఉంది. కార్యాలయాల్లో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా భయాందోళన తప్పడం లేదు. సామూహికంగా కార్యాలయానికి రాకుండా చూడటంతో పాటు శానిటైజర్ ఇస్తూ, చేతులు కడిగిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా చూస్తున్నారు. కంప్యూటరీకరణ చేసేటప్పుడు వ్యక్తుల మధ్య మీటర్ దూరం ఉండేలా చూస్తున్నారు. కార్యాలయంలో వైరస్ జాగ్రత్తలను తెలియజేసేలా ఎల్సీడీలు ఏర్పాటు చేయించారు. -
మహీంద్రా నుంచి బిగ్ బొలెరో పికప్
1.5 టన్నుల సామర్థ్యం ధర రూ. 6.34-6.49 లక్షలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్స్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా బిగ్ బొలెరో పికప్ వాహనాలను బుధవారం ఆవిష్కరించింది. వీటి గరిష్ట సామర్ధ్యం 1.5 టన్నులు కాగా, కార్గొ బాడీ పొడవు తొమ్మిది అడుగుల మేర ఉంటుంది. బీఎస్ త్రీ, బీఎస్ ఫోర్ ప్రమాణాలతో ఇవి లభిస్తాయి. ధర రూ. 6.34 లక్షల నుంచి రూ. 6.49 లక్షలు (ఎక్స్‌షోరూం హైదరాబాద్) దాకా ఉంటుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) జ్యోతి మల్హోత్రా బుధవారం ఇక్కడ జరిగిన పికప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. వ్యాపారస్తుల పికప్ వాహనాల అవసరాలను అధ్యయనం చేసి, బిగ్ బొలెరో పికప్‌ను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఫ్లాట్ బెడ్‌తో పాటు కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునేలా సీబీసీ (కౌల్ బాడీ చాసిస్) వేరియంట్లో కూడా ఇది లభిస్తుందన్నారు. ప్రస్తుతం పికప్ విభాగంలో దేశవ్యాప్తంగా తమకు 69 శాతం మార్కెట్ వాటా ఉందని ఆయన వివరించారు. తెలుగురాష్ట్రాల్లో సుమారు 89 శాతం వాటా ఉండగా, ఇందులో సింహ భాగం 83 శాతం వాటా బొలెరోది కాగా మిగతా భాగం ఇంపీరియోది ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో ఇప్పటిదాకా సుమారు 10 కొత్త వాహనాలను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.