Brown bear
-
7 వసంతాల తర్వాత ఎట్టకేలకు..
సిమ్లా: మారుతున్న వాతావరణ పరిస్థితులు హిమశిఖరాల్లోని టన్నుల కొద్దీ మంచును కబళించివేస్తున్నాయి. దీంతో మంచుతో నిండిపోయి సుందరంగా కన్పించాల్సిన హిమాలయాలు చాలా చోట్ల మట్టిదిబ్బలుగా దర్శనమిస్తు న్నాయి. మంచులో కలియతిరిగే భల్లూకాలు సైతం అంతర్థానమవుతున్నాయి. మరీముఖ్యంగా గోధమవర్ణ ఎలుగుబంట్లను హిమాచల్ వాసులు చూసి ఏడు వసంతాలు గడిచిపో యాయి. అయితే తాజాగా కినౌర్ జిల్లాలో మళ్లీ బ్రౌన్ బేర్ దర్శనమిచ్చి సందడిచేసింది. కినౌర్‌లోని మంచు లోయల్లో తన రెండు బుల్లి భల్లూకాలతో కన్పించి సందడిచేసిన ఆడ ఎలుగుబంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాక్చమ్– చిట్కుల్ వన్యప్రాణి సంరక్షణా అరణ్యంలో ఏడేళ్ల తర్వాత గత వారం ఒక గోధమరంగు ఎలుగుబంటిని చూశామని హిమాచల్ ప్రదేశ్ అటవీశాఖ విభాగం ఒక వీడియోను విడుదల చేసింది. బ్లాక్ ఫారెస్ట్ ఆఫీసర్ సంతోష్ ఠాకూర్, ప్రకృతి ప్రేమికుడు గారీ భట్టీ, పరిశోధకులు డాక్టర్ బిశ్వరూప్ సత్పతి, డాక్టర్ రాహుల్‌దేవ్ మండల్ స్వయంగా వెళ్లి ఎలుగును చూసి వచ్చారు. బర్డ్కౌంట్ 2026 కార్యక్రమంలో చేపడుతుండగా అనూహ్యంగా ఇది కంటపడింది. ‘‘ఈ హిమాలయన్ బ్రౌన్ బేర్ అనేది గోధమరంగు భల్లూకాల్లో ఉపజాతికి చెందినది. దీని ఉర్సుస్ ఆర్కటస్ ఇసాబెల్లినస్ అని కూడా అంటారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో సముద్రమట్టానికి 2,5000 అడుగుల ఎత్తులో మంచుమయ వాతా వరణాల్లో మాత్రమే ఇవి జీవిస్తాయి. గరిష్టంగా 250 కిలోలవరకు పెరుగుతాయి. సమూహంగాకాకుండా ఒంటరిగా జీవిస్తాయి. చెట్ల ఆకులు, వేర్లు, ఫలాలు, గడ్డి తిని బతుకు తాయి. ఇప్పటికే దీనిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. కాలుష్యం, తగ్గిన మంచు, తదితర కారణాలతో వీటి సంతతి భారీగా తగ్గిపోయింది. ‘‘కాలుష్యభూతానికి హిమాలయాలు బలవుతున్నా ఇంకా ఇలాంటి జాతులను కాపాడుతూ భావితరాలకు మన దేశ జీవవైవిధ్యాన్ని చాటేందుకు కృషి చేస్తున్నాయి’’ అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి, హిమాచల్‌లో డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్) అశోక్ నేగీ వ్యాఖ్యానించారు. -
అరణ్యం: ఎలుగుబంట్లు ఎలా నడుస్తాయి?
బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, పోలార్ బేర్ అంటూ పలు రకాలు ఉన్నాయి. ఎక్కువ ఉన్నది మాత్రం బ్రౌన్ బేర్. నివసించే పరిసరాలను బట్టి ఎలుగుల ప్రవర్తనలో తేడా ఉంటుంది తప్ప, వాటి లక్షణాలు దాదాపుగా ఒకలానే ఉంటాయి! ఆడ ఎలుగును ‘సౌ’ అంటారు. మగ ఎలుగును ‘బోర్’ అంటారు. ఎలుగుల గుంపును ‘స్లాత్’ అంటారు! ఎలుగుబంట్ల వయసును వాటి పళ్లను బట్టి లెక్కిస్తారు! అన్ని ఎలుగులూ శాకాహారంతో పాటు మాంసాహారాన్ని కూడా తింటాయి. కానీ ధ్రువప్రాంత ఎలుగుబంట్లు మాత్రం కేవలం మాంసాహారాన్నే భుజిస్తాయి! వీటికి నలభై రెండు పళ్లు ఉంటాయి. విచిత్రమేమిటంటే... శాకాహారాన్ని, మాంసాహారాన్ని కూడా నమిలేందుకు వీలుగా... వీటి పళ్లు రెండు రకాలుగా ఉంటాయి! దౌడు తీసే గుర్రాన్ని పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసు కదా! ఎలుగులు మాత్రం వాటిని చేజ్ చేసి పట్టుకోగలవు. అంత వేగంగా పరుగెడతాయి మరి! మనిషి కంటే వంద రెట్లు వేగంగా ఇవి వాసనను పసిగట్టగలవు. ఇరవై మైళ్ల దూరంలో ఉండగానే వీటికి వాసన తెలిసిపోతుంది. మంచులో మూడు అడుగుల లోతున ఉన్న చే పలను కూడా ఇవి గుర్తించేస్తాయి! పాండాలు తప్ప మిగిలిన అన్ని ఎలుగుబంట్లూ మనిషిలాగా రెండు కాళ్ల మీద నడుస్తాయి. ఇలా నడవడాన్ని ‘ప్లాంటిగ్రేడ్’ అంటారు! ఇవి తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాయి. శత్రువు నుంచి తమ వారిని కాపాడటానికి ఒక్కోసారి ప్రాణాలను కూడా అడ్డేస్తాయట. పిల్లలయితే తల్లికి అస్సలు దూరంగా ఉండలేవు. పొరపాటున తల్లి చనిపోతే, కొన్ని వారాల వరకూ ఇవి ఏడుస్తూనే ఉంటాయట! సినిమాల కంటే అవే ఇష్టం! తెలుగు వాళ్లకు లియొనార్డో డికాప్రియో అంత బాగా మరే హాలీవుడ్ హీరో తెలియడేమో. ఎందుకంటే అతడు హీరోగా నటించిన టైటానిక్ సినిమాని భారతీయులు కూడా ఎంతో ఇష్టంగా చూశారు. జాక్, రోజ్ల ప్రేమ సఫలమవ్వాలని ఉత్కంఠను అనుభవించారు. చివరకు హీరోయిన్ని కాపాడి హీరో చచ్చిపోతే కలతచెంది కన్నీళ్లు పెట్టారు. అందుకే ఆ సినిమాని, అందులో ప్రాణత్యాగం చేసిన గొప్ప ప్రేమికుడు లియొనార్డోని ఎప్పటికీ మర్చిపోరు. సినిమాలో హీరోయిన్ మీద అపారమైన ప్రేమ చూపించిన లియొనార్డో, నిజ జీవితంలో జంతువుల మీద చెప్పలేనంత ప్రేమను చూపిస్తాడు. మనకు ఏ చెడూ చేయని జంతువులకి మనం ఎంతో కీడు చేస్తున్నాం అంటూ బాధపడుతుంటాడు లియొనార్డో. అందుకే అతడు వీలైనన్ని ఎక్కువ జంతువులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లియొనార్డో ఇంట్లో బోలెడన్ని జీవులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి అతడికెంతో ప్రియమైన కుక్క. రెండోది, అతడు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న తాబేలు. దాన్ని మన హీరో బేబీ అని పిలుస్తాడు. మూడోది... బల్లి. దాని పేరు బ్లిజార్డ్. ఈ మూడింటితో ఆడుతూనే ఉంటాడు. అవి ఇచ్చినంత సంతోషాన్ని తనకు సినిమాలు కూడా ఇవ్వవంటాడీ యంగ్ స్టార్!


