breaking news
Brother deadbody
-
అంబులెన్సు భరించే స్తోమత లేక..
హల్దా్వనీ: ప్రైవేట్ అంబులెన్సు నిర్వాహకులు అడిగినంత ఇచ్చుకోలేని ఓ పేద మహిళ..తన సోదరుడి మృతదేహాన్ని ట్యాక్సీ పైన కట్టుకుని 200 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి తీసుకెళ్లాల్సి వచి్చంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. విషయం తెలిసిన సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పితోర్‌గఢ్ జిల్లా బెరినాగ్ గ్రామంలో శివానీ(22) అనే మహిళ సోదరుడు అభిషేక్(20) కలిసి ఉంటోంది. శుక్రవారం అభిషేక్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. రైలు పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని శివానీ చికిత్స కోసం హల్దా్వనీలోని సుశీలా తివారీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకొచి్చంది. అప్పటికే అతడు చనిపోయినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు శనివారం అభిషేక్ మృతదేహాన్ని శివానీకి అప్పగించారు. సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి పక్కనే ఉన్న అంబులెన్సుల నిర్వాహకులను ప్రాధేయపడగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చవుతుందని వారు చెప్పారు. అంత డబ్బులేకపోవడంతో ఆమె తమ గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ను బతిమాలుకుంది. అతడు సరే అనడంతో సోదరుడి మృతదేహాన్ని ట్యాక్సీపైన ఉంచి, తాడుతో కట్టేసింది. అక్కడి నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి చేరుకుంది. ఈ విషయం సీఎం పుష్కర్ సింగ్ ధామి దృష్టికి రావడంతో ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, ఆస్పత్రి ఆవరణ వెలుపల జరిగిన ఘటనతో తమకు తెలియలేదని సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ జోషి చెప్పారు. తెలిసినట్లయితే సాయం చేసి ఉండేవారమన్నారు. -
తమ్ముడూ.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా..
‘‘ఒరేయ్ తమ్ముడూ.. నాకు అండగా ఉంటావనుకున్నాన్రా.. రాఖీ కట్టించుకోకుండా వెళ్లావేంట్రా...?’’ అంటూ అక్క శిరీష గుండె బాదుకుంటూ ఏడుస్తుంటే.. చూపరులంతా చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖమ్మం: సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో ఆదివారం గల్లంతైన యువకుడు కొక్కొండ వినోద్‌చారి(22) మృతిచెందాడు. వినోద్‌చారి మృతదేహాన్ని చూడగానే తల్లి విజయలక్ష్మి, తండ్రి గిరిబాబు, అక్క శిరీష గుండె పగిలేలా రోదించారు. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్నేహితుల రోజున గల్లంతై, రక్షాబంధన్ నాడు విగతుడిగా బయటికొచ్చాడు. తమ్ముడికి అదే చివరి రాఖీ..! సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ రాఖీ కడుతూనే.. ‘‘తమ్ముడూ.. నీకు ఇదే చివరి రాఖీరా... ఇక నుంచి నేనెవరికి కట్టాలిరా..?’’ అని కన్నీటితో ప్రశ్నిస్తూ మృతదేహంపై పడిపోయింది. అక్కడున్న అందరి హృదయాలు.. ఆ దృశ్యంతో బరువెక్కాయి. కొందరు మౌనంగా.. ఇంకొందరు బిగ్గరగా రోదించారు. ముందు రోజు ఏం జరిగిందంటే... ఆదివారం.. స్నేహితుల దినోత్సవం. సత్తుపల్లి పట్టణానికి చెందిన మల్లిశెట్టి హిమకిరణ్, కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన గోల్డ్ షాపు యజమాని కొక్కొండ గిరిబాబు కుమారుడు వినోద్‌చారి(22) మంచి మిత్రులు. సత్తుపల్లిలోని సాయిస్ఫూర్తి కళాశాలలో డిప్లొమా కోర్సు చదివారు. నెల్లూరులో మల్లిశెట్లి హిమకిరణ్, హైదరాబాద్‌లో కొక్కొండ వినోద్.. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహితుల దినోత్సవం రోజున సత్తుపల్లిలో మిగతా మిత్రులతో సరదాగా గడిపారు. ఆదివారం ఉదయం ఈ ఇద్దరు కలిసి బేతుపల్లి చెరువు అలుగు చూసేందుకు కారులో వెళుతున్నారు. అది అదుపుతప్పి అదే చెరువులోకి దూసుకెళ్లింది. ఇద్దరూ అతి కష్టంగా డోర్లు తెరుచుకుని పైకి చేరుకున్నారు. ఇంతలో స్థానికులు వచ్చి వారిద్దరినీ ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అంతలోనే, వినోద్ చేతిలోని సెల్‌ఫోన్ పడిపోయింది. దానిని తీసుకునేందుకు అతడు ఒక అడుగు ముందుకు వెళ్లాడు. రక్షించేందుకు వచ్చిన వారి చేతిలో నుంచి జారి చెరువులోని నీటిలో పడిపోవడం.. గల్లంతవడం క్షణాల్లో జరిగిపోయింది.