breaking news
bronz medals
-
సరిత, సుష్మలకు కాంస్యాలు
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు రెండు కాంస్యాలతో మెరిశారు. 59 కేజీల విభాగంలో సరిత, 55 కేజీల కేటగిరీలో సుష్మ కంచు పతకాలు గెలిచారు. ఆరంభ బౌట్లలో ఓడినా తర్వాతి రెండు బౌ ట్లలో వరుసగా దిల్‌ఫుజా ఇంబెటొవా (ఉజ్బెకిస్తాన్)పై 11–0 తేడాతో (టెక్నికల్ సుపీరియార్టీ)...ఆ తర్వాత దియానా కయుమొవా (కజకిస్తాన్)పై 5–2తో సరిత గెలిచింది. సుష్మ కూడా ఇదే తరహాలో ఆల్టిన్ షగయెవా (కజకిస్తాన్)పై 5–0తో, ఆపై సర్బినాజ్ జెన్‌బెవా (ఉజ్బెకిస్తాన్)ను 12–0 తే డాతో ఓడించి కాంస్యం ఖాయం చేసుకుంది. ఈ ఈ వెంట్ పురుషుల విభాగంలో గ్రీకో రోమన్ రెజ్ల ర్లు ఇప్పటికే ఐదు కాంస్యాలు గెలవడంతో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య ఏడు కాంస్యాలకు చేరింది. -
మూడు ‘కాంస్యాల’ స్క్వాష్
జకార్తా: ఆసియా క్రీడల ‘స్క్వాష్’లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు లభించాయి. ముగ్గురు అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు సెమీఫైనల్లోనే ఓడిపోవడంతో కంచుతో సరిపెట్టుకోక తప్పలేదు. అయితే ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2014లో స్క్వాష్‌లో భారత్ ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. నాడు రజతం గెలిచిన సౌరవ్ ఘోషల్ ఈసారి కాంస్యం సాధించగా, దీపిక పల్లికల్ మళ్లీ కాంస్యానికే పరిమితమైంది. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో సౌరవ్ 12–10, 13–11, 6–11, 6–11, 6–11 స్కోరుతో చున్ మింగ్ యు (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లు గెలిచి ముందంజలో నిలిచినా...ఘోషల్ చివరి వరకు దానిని కాపాడుకోలేక చేతులెత్తేశాడు. రెండు సెట్లు గెలుచుకున్న అనంతరం మూడో సెట్లో ఒక దశలో సౌరవ్ 6–5తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే చున్ మింగ్ వరుసగా ఆరు పాయింట్లు గెలుచుకొని భారత ఆటగాడికి షాక్ ఇచ్చాడు. అదే ఊపును అతను తర్వాతి రెండు సెట్లలో కొనసాగించగా, సౌరవ్ మాత్రం చతికిల పడ్డాడు. అయితే రెండో సెట్ చివర్లో తన కాలికి గాయమైందని, దాంతో ఓటమి తప్పలేదని ఘోషల్ వివరణ ఇచ్చాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మలేసియా దిగ్గజ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ నికోల్ డేవిడ్ 11–7, 11–9, 11–6 తేడాతో దీపిక పల్లికల్‌ను చిత్తు చేసింది. పదేళ్ల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా స్క్వాష్‌ను శాసించిన నికోల్ ముందు దీపిక నిలవలేకపోయింది. మరో సెమీఫైనల్లో శివశంకరి సుబ్రహ్మణ్యం (మలేసియా) 12–10, 11–6, 9–11, 11–7తో జోష్నా చినప్పను ఓడించింది. గత మూడు ఆసియా క్రీడల్లో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన జోష్నాకు ఇదే మొదటి పతకం కావడం విశేషం. -
ఆర్చర్ సునెందురాయ్‌కు రెండు పతకాలు
విజయవాడ స్పోర్ట్స్ : బిలాస్పూర్లో ఈ నెల 25 నుంచి గురువారం వరకు జరిగిన ఆల్ ఇండియా రైల్వే ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో విజయవాడ డివిజన్‌కు చెందిన సునెందురాయ్ రెండు కాంస్య పతకాలు సాధించినట్లు డివిజనల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఎన్.అర్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా సునెందురాయ్ను డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ జె.ప్రదీప్‌కుమార్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ అభినందించారు.