breaking news
Break-even
-
సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రుల జోరు
దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ చెయిన్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఏటా 24 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 20 శాతం పైగా ఎబిటా మార్జిన్లు, 30 శాతం పైగా ఆర్వోసీఈలు (పెట్టుబడిపై రాబడులు), రెండేళ్ల వ్యవధిలోనే బ్రేక్–ఈవెన్ సాధించే అవకాశాలు మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. ఎవెండస్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంలో ఈ సెగ్మెంట్ .. భారీ స్థాయిలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. సుమారు 3.7 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. హాస్పిటల్స్‌లోకి వచి్చన మొత్తం పెట్టుబడుల్లో ఇది సుమారు 35 శాతం. ఇలా వచి్చన పెట్టుబడుల్లో దాదాపు 70 శాతం భాగం ఐవీఎఫ్, ఐకేర్, తల్లి..బిడ్డ సంరక్షణ, డయాలిసిస్, ఆంకాలజీ వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు దోహదపడ్డాయి. గత మూడేళ్లుగా దంత సంరక్షణ, యూరాలజీ/నెఫ్రాలజీ, స్కిన్..హెయిర్ కేర్ వంటి స్పెషాలిటీ విభాగాల్లోని ప్రముఖ సంస్థల్లోకి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య భారీగా వ్యత్యాసం నెలకొనడం ఇందుకు కారణం.కన్సాలిడేషన్‌కి అవకాశం.. న్యూఢిల్లీ: నివేదిక ప్రకారం తక్కువ స్థాయి పెట్టుబడి, నిర్దిష్టమైన సేవలకు పరిమితం కావడం తదితర అంశాల వల్ల ఈ విభాగం ఇటు ఇన్వెస్టర్లకు, అటు వ్యవస్థాపకులకు ఆకర్షణీయంగా ఉంటోంది. ఇక ఈ స్పెషాలిటీల్లో అగ్రగాములుగా ఉంటున్న సంస్థలు అధిక వృద్ధి సాధన కోసం ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం కాస్త పెద్ద మొత్తాన్నే వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటు చేసుకునే అవకాశాలను ఇది సూచిస్తోంది.మార్కెట్ క్యాప్ పెరుగుదల.. అగ్ర శ్రేణి సంస్థలు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. దీనితో మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ లిస్టెడ్ సింగిల్ స్పెషాలిటీ చెయిన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న 3.9 బిలియన్ డాలర్ల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం వంటి అంశాల వల్ల దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పేషంట్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపర్చగలిగే సామర్థ్యాలు, సమర్ధవంతంగా కార్యకలాపాలను విస్తరించగలిగే వీలు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే అవకాశం ఉండటం వల్ల ఈ విభాగం ఆకర్షణీయంగా ఉంటోందని ఎవెండస్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చెయిన్లు .. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమవుతున్నాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్లలో అంతరాలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ఆ ప్రాంతాల్లో వృద్ధికి అవకాశం ఉందని గుప్తా చెప్పారు. క్రిత దశాబ్ద కాలంలో ఏ విధంగానైతే మలీ్ట–స్పెషాలిటీ విభాగం విస్తరించిందో అదే విధంగా పబ్లిక్ మార్కెట్లలో ఈ హాస్పిటల్స్ చెయిన్స్ లిస్టింగ్ సందడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు పటిష్టమైన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సంపన్న దేశాల్లో ఈ తరహా మోడల్స్ విజయవంతమయ్యాయని గుప్తా చెప్పారు. -
అప్‌స్టాక్స్ బ్రేక్–ఈవెన్ ..
ముంబై: డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ గత ఆర్థిక సంవత్సరంలో బ్రేక్–ఈవెన్ (లాభ నష్ట రహిత స్థితి) సాధించింది. 2022–23లో మొత్తం ఆదాయం 40 శాతం ఎగిసి రూ. 1,000 కోట్లు దాటినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం రూ. 1,000 కోట్ల పైచిలుకు నగదు నిల్వలు ఉన్నాయని చెప్పారు. సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరించడం, ఇతర వ్యాపారాలను కొనుగోలు చేయడం తదితర మార్గాల్లో వృద్ధి సాధనపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే అయిదారేళ్లలో తమ కస్టమర్ల సంఖ్యను పది రెట్లు పెంచుకుని 10 కోట్లకు చేర్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. 2009లో ప్రారంభమైన అప్‌స్టాక్స్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో పాటు టైగర్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. -
గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భిన్న రంగాల్లో ఉన్న గోద్రెజ్ గ్రూప్ కంపెనీ గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ ఔట్లెట్లను విస్తరిస్తోంది. హైదరాబాద్లోతోసహా ఏడు ప్రధాన నగరాల్లో సంస్థ 33 స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక్కో స్టోర్‌కు రూ.1.5 కోట్ల దాకా వ్యయం చేస్తోంది. విదేశాల్లో లభించే అరుదైన, ఖరీదైన పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, మాంసం, వైన్, కోల్డ్ కట్స్, పాస్తా, చీజ్, బెవరేజెస్ నేచర్స్ బాస్కెట్లో లభిస్తాయి. మార్చికల్లా కొత్తగా 3 ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు గోద్రెజ్ గ్రూప్ ఈడీ, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ తాన్యా దుబాష్ తెలిపారు. మరో 6-7 స్టోర్లకై ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాదే బ్రేక్ ఈవెన్.. నేచర్స్ బాస్కెట్ ఈ ఏడాదే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని తాన్యా దుబాష్ వెల్లడించారు. ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ పోర్టల్స్ అయిన అమెజాన్, స్నాప్‌డీల్‌తో చేతులు కలుపుతామని చెప్పారు. ప్రథమస్థాయి నగరాల్లో అరుదైన, ఖరీదైన ఆహోరోత్పత్తులకు విపరీత డిమాండ్ ఉందని తెలిపారు. దీపావళికి గోద్రెజ్ గ్రూప్ నుంచి నూతన ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నేచర్స్ బాస్కెట్ స్టోర్లున్నాయి. కాగా, గోద్రెజ్ గ్రూప్ వచ్చే 10 ఏళ్లకుగాను ఏటా 26 శాతం వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.