breaking news
Brazil Model
-
బ్రెజిల్ మోడల్‌తో రొనాల్డో జూనియర్ డేటింగ్!
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్ ఆట తెలిసిన ప్రతీ ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. సమకాలీన ఫుట్‌బాల్ క్రీడలో మెస్సీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న రొనాల్డో ఆటకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ 15 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్నాడు. అయితే ఆ సంచలనాలు ఆటలో అనుకుంటే పొరబడినట్లే.తాజాగా 15 ఏళ్ల రొనాల్డో జూనియర్ 27 ఏళ్ల బ్రెజిలియన్ మోడల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? అబద్ధమా? అనేది తేలకముందే, ఈ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మరుక్షణమే వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రొనాల్డో జూనియర్ దుబాయ్‌లో ఉంటున్నాడని, అక్కడే ఒక హోటల్లో బ్రెజిల్ మోడల్‌తో పరిచయం డేటింగ్‌కు దారి తీసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. అయితే రొనాల్డో అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. రొనాల్డో జూనియర్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అన్న విషయం గమనించాలని, అతనిపై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కామెంట్ చేశారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో జూనియర్ తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. తన తండ్రి క్రిస్టియానో రొనాల్డో భాగస్వామి అయిన జార్జినా రోడ్రిగ్జ్ గురించి సరదాగా క్రిస్టియానో జూనియర్ ఆమె తన 'క్రష్' అని ఒక సందర్భంలో పేర్కొన్నాడు. కానీ ఆ తర్వాత ఆమెను కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే చూశానని, గర్ల్‌ఫ్రెండ్‌గా చూడలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆమెతో మాటలు లేవని బదులిచ్చాడు. గతంలోనూ బార్సిలోనా స్టార్ లూయిస్ సువారెజ్ కుమార్తె డెల్ఫినా సువారెజ్ తో రొనాల్డో జూనియర్ ప్రేమలో ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.చదవండి: గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్‌లో అథ్లెటిక్స్ పోటీలు Cristiano Ronaldo Jr. is reportedly dating a 27-year-old Brazilian model. According to rumors, they met at a restaurant in Dubai, where Ronaldo Jr. made a bold move shooting his shot confidently, leaving her unable to resist and she claimed she’s a big supporter of Cristiano Jr.… pic.twitter.com/UhQhpN3p14— SAMSON👑🐐 (@Samsonthegoat25) March 23, 2026 -
Russia-Ukraine War: రష్యా బలగాల దాడిలో బ్రెజిల్ మోడల్ మృతి
కీవ్: రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె (39) ప్రాణాలు కోల్పోయింది. భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో ఉన్న ఆమె.. ఆ దేశం తరఫున స్నైపర్‌గా బరిలోకి దిగి రష్యా సేనలకు అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఖార్కివ్ నగరంపై రష్యా సైన్యం జూన్ 30న క్షిపణులతో విరుచుకుపడింది. మొదటి క్షిపణి దాడి జరిగినప్పుడు తన ట్రూప్‌లో థాలిట మాత్రమే ప్రాణాలతో మిగిలింది. కాని ఆ తర్వాత మరో క్షిపణి పడటంతో ఆమె మృతి చెందింది. బంకర్లో ఉన్న థాలిట కోసం వెళ్లిన బ్రెజిల్ మాజీ సైనికుడు డాగ్లస్ బురిగో (40) కూడా క్షిపణి దాడిలోనే మరణించాడు. థాలిటకు గతంలో యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉంది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా ఆమె పోరాడింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసింది. ఇరాక్‌లో పెష్‌మెర్గాస్ సాయుధ బలగాల తరఫున పోరాడే సమయంలోనే స్నైపర్ శిక్షణ తీసుకుంది. ఆమె అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చేందుకు ఓ రచయిత బ్రెజిల్ సైనికుడితో కలిసి పనిచేస్తున్నాడు. నటిగా.. థాలటి యుక్త వయసులో నటిగా, మోడల్‌గా పని చేసింది. లా చదివే సమయంలో ఆమె ఎన్జీఓలతో కలిసి జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సోదరుడు రొడ్రిగో వైరా.. ఆమె ఓ హీరో అని చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు, మనవతా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఉక్రెయిన్‌కు వెళ్లి మూడు వారాలే అవుతోందని చెప్పాడు. అక్కడ సహాయక కార్యక్రమాల్లోనే పాల్గొంటూనే షార్ప్ షూటర్‌గా సేవలందిస్తోందని తెలిపాడు. అదే చివరిసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు బాంబు దాడులు జరిపినప్పుడు థాలిట తృటిలో ప్రాణాలతో బయపడింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పింది. రష్యా బలగాలు డ్రోన్ల ద్వారా తన ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నందుకు ఎక్కువ మాట్లాడలేనని కుటుంబసభ్యులు వివరించింది. ఆ తర్వాత ఆమె గత సోమవారమే ఖార్కివ్‌కు వెళ్లింది. అప్పుడే చివరిసారిగా కుటుంబంతో మాట్లాడింది.


