క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్ ఆట తెలిసిన ప్రతీ ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. సమకాలీన ఫుట్‌బాల్ క్రీడలో మెస్సీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న రొనాల్డో ఆటకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ 15 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్నాడు. అయితే ఆ సంచలనాలు ఆటలో అనుకుంటే పొరబడినట్లే.
తాజాగా 15 ఏళ్ల రొనాల్డో జూనియర్ 27 ఏళ్ల బ్రెజిలియన్ మోడల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? అబద్ధమా? అనేది తేలకముందే, ఈ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మరుక్షణమే వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రొనాల్డో జూనియర్ దుబాయ్‌లో ఉంటున్నాడని, అక్కడే ఒక హోటల్‌లో బ్రెజిల్ మోడల్‌తో పరిచయం డేటింగ్‌కు దారి తీసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది.
అయితే రొనాల్డో అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. రొనాల్డో జూనియర్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అన్న విషయం గమనించాలని, అతనిపై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కామెంట్ చేశారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో జూనియర్ తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశాడు.
తన తండ్రి క్రిస్టియానో రొనాల్డో భాగస్వామి అయిన జార్జినా రోడ్రిగ్జ్ గురించి సరదాగా క్రిస్టియానో జూనియర్ ఆమె తన 'క్రష్' అని ఒక సందర్భంలో పేర్కొన్నాడు. కానీ ఆ తర్వాత ఆమెను కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే చూశానని, గర్ల్‌ఫ్రెండ్‌గా చూడలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆమెతో మాటలు లేవని బదులిచ్చాడు. గతంలోనూ బార్సిలోనా స్టార్ లూయిస్ సువారెజ్ కుమార్తె డెల్ఫినా సువారెజ్ తో రొనాల్డో జూనియర్ ప్రేమలో ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.
చదవండి: గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్‌లో అథ్లెటిక్స్ పోటీలు
Cristiano Ronaldo Jr. is reportedly dating a 27-year-old Brazilian model. According to rumors, they met at a restaurant in Dubai, where Ronaldo Jr. made a bold move shooting his shot confidently, leaving her unable to resist and she claimed she’s a big supporter of Cristiano Jr.… pic.twitter.com/UhQhpN3p14
— SAMSON👑🐐 (@Samsonthegoat25) March 23, 2026


