breaking news
brahmin culture
-
బ్రాహ్మణ పుట్టుక కామెంట్.. వివాదం
సాక్షి, తిరువనంతపురం : మాట్లాడే హక్కు.. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన వరం. అలాగని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం చట్టం ఊరుకోదు. ఇక్కడ అదే పని చేసి ఇప్పుడు వివాదంలో ఇరుకున్నారు నటుడు, ఎంపీ సురేష్ గోపి. బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ గోపీ ఈ మధ్యే తిరువనంతపురంలో బ్రహ్మణ సంఘాలు నిర్వహించిన యోగక్షేమ సభకు హాజరయ్యారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ... మళ్లీ బ్రాహ్మణుడిగానే పుట్టాలని ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు. ‘పునర్జన్మ మీద నాకు నమ్మకం ఉంది. జంధ్యం వేసుకునే కులంలో జన్మించా. వచ్చే జన్మలో కూడా ఇదే కులంలో పుట్టాలని కోరుకుంటున్నా. తద్వారా భగవంతుడికి మరింత సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుంది’ అంటూ ప్రసంగించారు. వెంటనే అక్కడ హాజరైన సభీకులంతా హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు చరిచారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మాత్రం ఘాటు కామెంట్లు వస్తున్నాయి. ఓ ఎంపీ అయి ఉండి కుల ప్రస్తావన తేవటంపై మండిపడుతున్నారు. ఆదిమగోపి పేరిటి యాష్ ట్యాగ్‌ను ఫేస్బుక్, ట్విట్టర్లో వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లనా? మనం పార్లమెంట్‌కు పంపింది అని ప్రముఖ పాత్రికేయురాలు ఛార్మీ జయశ్రీ హరికృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ కల్చర్.. దేవుళ్ల మాలలు.. అడవి మాంసం అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఏటూర్ నాగారంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్వకాలంలో మనుషులు అడవి పంది మాంసం తినేవారని.. బ్రాహ్మణ కల్చర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు మారాయంటూ కామెంట్ చేశారు. దేవుళ్ల పేరుతో మాలలు వేస్తున్నారని.. ఇప్పుడు ఇది నడుస్తున్నదని చెప్పుకొచ్చారు. అడవి పందులను చంపి హాయిగా తినండని ప్రజలకు పిలుపునిచ్చారు కలెక్టర్ మురళి. తాను ఇప్పటివరకు తినలేదని.. మరోసారి వచ్చినప్పుడు నాకు కూడా ఆ మాంసం పెట్టాలన్నారు. అమెరికాలో అడవి పంది మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.