breaking news
bowel
-
IBD లక్షలమందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి, మొహమాటం వద్దు!
హైదరాబాద్: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఐబీడీ ( Inflammatory Bowel Disease (IBD)) చాలామంది నోట ఇది వినిపిస్తుంది. దీర్ఘకాల వ్యాధి కావడంతో ఇది జీవనశైలినే మార్చేస్తుంది. దీనికి వెంటనే చికిత్స అవసరం. ప్రపంచవ్యాప్తంగా కోటి మంది, మన దేశంలోనే 15 లక్షల మంది ఈ వ్యాధి బాధితులున్నారు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ లాంటి సమస్యలతో కలిపి వచ్చే ఐబీడీని వెంటనే గుర్తిస్తున్నా, సామాజిక సమస్యల కారణంగా దీనిపై ఎవరూ పెద్దగా చర్చించడం లేదు. ఈ నెల 19న ప్రపంచ ఐబీడీ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సరిహద్దులు లేవని, అందరం కలిసి సామాజిక అపోహలను తొలగిద్దామని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష సూచించారు.ఐబీడీ చికిత్స కోసం ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఒక ప్రముఖ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అందులో మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, ఐబీడీకి శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, డైటీషియన్లు, సైకాలజిస్టులు ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా కేటాయించిన 20 పడకలు, అత్యాధునిక సదుపాయాలతో అనేకమంది రోగులకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి అత్యాధునిక చికిత్సలు అందిస్తోంది. పలు జిల్లాల నుంచి వైద్యులు రోగులను ఇక్కడకు పంపుతున్నారు. ముఖ్యంగా ఈఎంఆర్ ఆధారిత ఫాలోఅప్ కార్యక్రమం ఉండడం, అందరికీ వ్యక్తిగత సంరక్షణ కోసం వారానికోసారి ఐబీడీ క్లినిక్ ఏర్పాటుచేయడం ఇక్కడి ప్రత్యేకతలు.“ఐబీడీ అనేది కేవలం కడుపు సమస్యే కాదు. అది మన మొత్తం శరీరం, మనసునూ ప్రభావితం చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు, సమస్య తీరు, దాని లక్షణాలైన.. తరచు విరేచనాలు కావడం, కడుపునొప్పి, మలద్వారం నుంచి రక్తం కావడం, నీరసం వల్ల రోగులు దీని గురించి చివరకు కుటుంబసభ్యులకు కూడా చెప్పరు. మౌనంగా బాధను భరిస్తుంటారు. పేగు సంబంధిత సమస్యలంటేనే సమాజంలో ఉన్న చిన్నచూపు వల్ల ఐబీడీ గురించి కూడా మాట్లాడరు. దీని కారణాల గురించి కూడా అనేక అపోహలున్నాయి. ఇలా చెప్పకపోవడంతో వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది, వారు సమాజం నుంచి దూరమవుతారు, ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఐబీడీ అనేది ఆహారం వల్లనో, పరిశుభ్రత లేకపోవడం వల్లనో వస్తుందని.. ఇది కేవలం అరుగుదల సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐబీడీ అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. దానికి దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం” అని డాక్టర్ హర్ష చెప్పారు.ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!“ఐబీడీకి ప్రస్తుతం కచ్చితమైన చికిత్స తెలియదు గానీ, దాన్ని మందులు, ఆహారంలో మార్పులు, మానసిక చికిత్స, నిపుణులతో క్రమం తప్పకుండా సంప్రదించడం ద్వారా దీన్ని చాలావరకు నియంత్రించవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడిని అధిగమించడం, సహచరుల మద్దతు ముఖ్యమైనవి. ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రిలేషన్లో ఉన్న యువకులకు ఇది అవసరం. ఆహారంపై అవగాహన కూడా ముఖ్యం. మంట వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే అన్నం, అరటిపండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తినాలి. కారాలు, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఆహారాలు తినకూడదు. ఎవరికి వారికే ఆహారం మారుతుంది కాబట్టి, డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.చదవండి: వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే అంతేగా!అసలు అన్నింటికంటే ముందు మౌనం వీడాలి. బహిరంగంగా చర్చించాలి. అది క్లినిక్‌లో అయినా, తరగతుల్లో అయినా, కార్పొరేట్ ఆఫీసుల్లో అయినా. ఐబీడీ గురించి మాట్లాడితే అపోహలు పోతాయి. సానుభూతి పెరుగుతుంది. రోగులు చికిత్స పొందడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం వస్తుంది” అని డాక్టర్ హర్ష వివరించారు. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష -
ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు
ఓ మహిళ గత పది రోజులుగా తీవ్ర కడుపునొప్పిని అనుభవిస్తోంది. భరించలేక ఆస్పత్రికి వెళ్లితే తాను గర్భవతినని తెలుసుకుని షాక్ అయ్యింది. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..ఆ పిండం స్కానింగ్‌లో ఎక్కడ పెరుగుతోంది చూసి వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఒకవేళ గర్భాశయంలో కాక వేరే ఎక్కడ పెరిగినా ఆ పిండం పూర్తిగా మనుగడ సాగించడం అసాధ్యం ఏదో ఒక సందర్భంలో విచ్ఛిత్తి లేదా అబార్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఆమె విషయంలో అలా జరగకపోవడం మరింత విచిత్రం. ఈ షాకింగ్ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌కి చెందిన 37 ఏళ్ల మహిళ పదిరోజులుగా తీవ్ర కడుపు నొప్పిని భరిస్తోంది. తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేసి చూడగా ఒక్కసారిగా విస్తుపోయారు వైద్యులు. ఆమె కడుపులో పిండం ప్రేగుల్లో పెరుగుతుండటాన్ని చూసి షాకయ్యారు. నేచరల్‌గా పిండం గర్భశయంలో పెరుగుతుంది. కొందరికి తాము ప్రెగ్నెన్సీ అని తెలియని ఎన్నో మహిళల కేసులు చూశాం. గానీ ఇలా పేగుల్లో బేషుగ్గా పిండం పెరగడం చూడటం ఇదే తొలిసారని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే..? ఒకవేళ పిండం గర్భశయం ట్యూబ్‌లో గాక బయట ఎక్కడ పెరిగినా..పిండవిచ్ఛత్తి అవ్వడం లేదా గర్భం నిలవకపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా పిండం పేగుల్లో నిక్షేపంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. సరిగ్గా అప్పుడామె 23 వారాల గర్భవతని కూడా వైద్యులు నిర్థారించారు. ఇలా ప్రేగుల్లో పిండం పెరగడాన్ని 'ఉదర ఎక్టోపిక్ గర్భం' అని పిలుస్తారని చెప్పారు. అయితే వ్యైదులు ఆ మహిళను తమ పర్యవేక్షణ ఉంచుకుని 29 వారాల అనంతరం విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు. మూడు నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో దాదాపు 90% వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని అన్నారు. ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని తెలిపారు. (చదవండి: రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..) -
పేగు బ్యాక్టీరియా కరెంటు పుట్టిస్తుంది
మన పేగుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా కరెంటు పుట్టిస్తాయట! స్వీడన్‌లోని లుండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా ఈ విషయాన్ని నిరూపించారు. ఎలక్ట్రాన్ల క్రమ ప్రవాహమే కరెంట్ అన్నది మనకు తెలుసు. బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో కొన్ని ఎలక్ట్రాన్లను విడుదల చేస్తూంటాయి.. దీన్నే ఎక్స్ట్రా సెల్యులార్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తూంటారు. ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే బ్యాక్టీరియాల్లో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో స్వీడన్ శాస్త్రవేత్తలు ఇతర బ్యాక్టీరియాపై దృష్టి పెట్టారు. మన పేగుల్లో ఉండే ల్యాక్టిక్ యాడిడ్ బ్యాక్టీరియం, ఎంటెరోకాకస్ ఫీకాలిస్ బ్యాక్టీరియాను పరిశీలించినప్పుడు అవి తమ పరిసరాల్లోని చక్కెరలను జీర్ణం చేసుకునే క్రమంలో ఎలక్ట్రాన్లను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియాతోపాటు ఫంగస్, ఇతర బ్యాక్టీరియా సమక్షంలో ఇలా జరుగుతోందని.. మిగిలిన బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఈ ప్రక్రియలో సాయపడుతున్నట్లు తెలిసింది. ఈ రకమైన సహకారం కారణంగానే ఎలక్ట్రాన్ రవాణా సాధ్యమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త చెప్పారు. కొన్ని రకాల రసాయనాలను జీర్ణం చేసుకునేందుకు బ్యాక్టీరియాతోపాటు ఇతర సూక్ష్మజీవుల అవసరం కూడా ఉంటుందని దీన్ని బట్టి తెలుస్తోందని. ఇది కాస్తా మరింత సమర్థమైన మందులను తయారు చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. -
పులిపిరులకు కారణమేంటి?
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ పులిపిరులకు కారణమేంటి? నా వయసు 49 ఏళ్లు. గత కొంతకాలంగా నా మెడ వెనక భాగంలోనూ, బాహుమూలాల దగ్గర పెద్ద సంఖ్యలో పులిపిరులు వస్తున్నాయి. చొక్కా తీస్తే అసహ్యంగా కనిపిస్తున్నాయి. వీటిని తొలగించుకోవడం ఎలా? నాకు తగిన సలహా ఇవ్వగలరు. - మహమూద్బాషా, గుంటూరు మీరు చెబుతున్న పులిపిరుల వంటి కాయలు మీ మెడ దగ్గర, శరీరంలోని ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయంటే... బహుశా మీలో కొలెస్ట్రాల్ పాళ్లు అధికంగా ఉండవచ్చు. దాంతోపాటు ఇలాంటి వారికి మెడ ప్రాంతమంతా నల్లబారుతుంది. మీరు మీ బరువెంతో మీ లేఖలో రాయలేదు. కానీ వివరించిన లక్షణాలను బట్టి మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకవేళ ఇదే వాస్తవమైతే మీరు ఇప్పట్నుంచే బరువు తగ్గించుకొని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం మంచిది. లేకపోతే మీరు చెప్పే లక్షణాలతో మీరు భవిష్యత్తు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను కలిసి, లిపిడ్ ప్రొఫైల్‌తో పాటు వారు సూచించిన అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొండి. వాటి ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. కొన్నాళ్ల క్రితం పొలం గట్టు మీద నడుస్తున్నప్పుడు నాకు అరికాలిలో ఏదో రాయి లాంటిది గట్టిగా గుచ్చుకుంది. అప్పట్నుంచి అది గట్టిగా మారి ఆనెకాయలాగా చేతికి తగులుతోంది. దాని వల్ల నడవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ ఆనెకాయ పూర్తిగా తగ్గడానికి ఏం చేయాలో సూచించగలరు. - కాశయ్య, నల్లగొండ మీకు గుచ్చుకున్న ఆ రాయివంటి బయటి వస్తువును (ఫారిన్బాడీని) మీ శరీరం నుంచి తొలగించారో లేదో వంటి వివరాలను మీ లేఖలో తెలపలేదు. మీరు ఈ సమస్యతో ఎవరైనా డాక్టర్‌ను కలిశారో లేదో కూడా రాయలేదు. ఇది క్రమంగా గట్టిపడి (హైపర్ట్రోఫిక్ స్కార్) కాయలా మారిందని తెలుస్తోంది. ఇప్పుడు మీరు చెబుతున్న భాగంలో వాపు వచ్చి ఉంటే, బహుశా అది గతంలో మీకు అయిన గాయం వల్లనే అయి ఉంటుంది. మీరు ఒకసారి జనరల్ సర్జన్‌ను కలిసి, మీరు ఆనెకాయలా వర్ణిస్తున్న భాగాన్ని చూపించుకుంటే మంచిది. వారు దాన్ని పరిశీలించి, తగిన చికిత్స సూచిస్తారు. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ చిన్న పేగులో టీబీ... ఏం చేయాలి? నా వయసు 27 ఏళ్లు. నాకు కడుపునొప్పి, బరువు తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. చిన్నపేగుల్లో టీబీ ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఆరునెలల మందులు వాడాను. ఇది పూర్తిగా నయమవుతుందా లేదా తెలియజేయగలరు. - నర్సింహారావు, జగ్గయ్యపేట మామూలుగా చిన్నపేగుల్లో టీబీ వల్ల పేగులో పుండ్లు తయారవుతాయి. టీబీ మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అలాకాకుంటే ‘చిన్నపేగుల స్ట్రిక్చర్’ మాదిరిగా వస్తే టీబీ నియంత్రణలోకి వచ్చినప్పటికీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల వల్ల టీబీ వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. ఆందోళన అవసరం లేదు. నా వయసు 41 ఏళ్లు. నేను చాలా ఏళ్ల నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం పాంటాసిడ్-హెచ్‌పి ఒక వారం పాటు వాడాను. ప్రస్తుతం ఒమేజ్ మాత్రలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి, మలబద్దకం, తలనొప్పితో బాధపడుతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. (నాకు బీపీ, షుగర్ లాంటివి ఏమీ లేవు). - కె. నిరంజన్‌రావు, వరంగల్ మీరు మూడు నెలల క్రితం పాంటాసిడ్-హెచ్‌పి వాడినట్లూ, ప్రస్తుతం మందులు వాడుతున్నా ఫలితం కనిపించనట్లు రాశారు. మీరు ఒకవేళ ఎండోస్కోపీ చేయించుకోనట్లయితే ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలిసి ఎండోస్కోపీ చేయించుకోగలరు. ఇక రెండో అంశం... మీకు మలబద్దకం, కడుపులో నొప్పి ఉన్నట్లు రాశారు. దీన్ని బట్టి చూస్తే మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే వ్యాధి కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో కడుపునొప్పి, మలబద్దకం లేదా విరేచనాలు ఉండే అవకాశం ఉంది. ఇది సామాన్యంగా యాంగ్జైటీ లేదా తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలితో ఉండేవాళ్లలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, ఐబీఎస్ ఉందో లేదో చూపించుకోగలరు. నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది క్రితం కడుపునొప్పి, కామెర్లు, దురద వస్తే గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయి అని చెప్పారు. ఈఆర్సీపీ టెస్ట్ చేసి స్టెంట్ వేశారు. మళ్లీ నెలరోజుల నుంచి జ్వరం, కళ్లు పచ్చగా మారడం జరుతున్నాయి. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - శరణ్రాజు, వినుకొండ మీరు గాల్‌స్టోన్స్, సీబీడీ స్టోన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు మీరు రాసిన వివరాలను బట్టి తెలుస్తోంది. కడుపులో వేసిన బిలియరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. అత్యవసరంగా మీరు వెంటనే మళ్లీ ఈఆర్సీపీ చేయించుకోగలరు. ఈఆర్సీపీ వల్ల మీకు సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. మూసుకుపోయిన స్టెంట్ ఉన్నచోట కొత్త స్టెంట్ అమర్చవచ్చు. ఈఆర్సీపీ తర్వాత మీరు లాప్రోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ స్టోన్స్ తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఇలా అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందే మీరు ఆపరేషన్ చేయించుకుని ఉంటే బాగుండేది. వీలైనంత త్వరలో ఈఆర్సీపీ, లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ సర్జరీలు చేయించుకోగలరు. డర్మటాలజీ కౌన్సెలింగ్ స్ట్రయిటెనింగ్తో జుట్టు రాలుతోంది? నా వయసు 18 ఏళ్లు. గత ఏడాదిగా నేను నా హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటున్నాను. రెండు నెలల క్రితం పర్మనెంట్ స్ట్రెయిటెనింగ్ అనే ప్రక్రియను కూడా చేయించాను. కానీ అప్పట్నుంచి నా వెంట్రుకలు రాలిపోతున్నాయి. పైగా అవి పొడిగా, పెళుసుబారినట్లుగా అవుతున్నాయి. ఈ విషయంలో నేనేం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - సుస్మిత, హైదరాబాద్ మన వెంట్రుకల్లో స్వాభావికంగా డైసల్ఫైడ్ అనే బంధం ఉంటుంది. వీటి వల్లనే వెంట్రుక బలంగా ఉంటుంది. దీనివల్లనే వెంట్రుకకు సహజమైన మెరుపు కూడా వస్తుంది. మీరు ఇలా తరచూ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటూ ఉంటే ఆ డైసల్ఫైడ్ బంధం బలహీనపడుతుంది. మీ వెంట్రుకలు పొడిబారినపోయి, పెళుసుబారినట్లుగా అయి మధ్యకు విరిగినట్లుగా రాలిపోతుంటాయి. హెయిర్‌ను స్ట్రెయిటెన్ చేసే పార్లర్లలోని వారికి.. వెంట్రుకలపై అవగాహన లేకపోవడం వల్ల మీ వెంట్రుకను స్ట్రెయిటెన్ చేసేందుకు (అంటే చిక్కుబడినట్లుగా కాకుండా నిటారుగా, పొడవుగా ఉండేలా చూసేందుకు) చాలా రకాల సీరమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అవి వెంట్రుకలను చాలా విధాలుగా నష్టపరుస్తుంటాయి. మీ వెంట్రుకలు రాలడం ఆగడానికి సూచనలివి... మొదట మీరు మీ హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రక్రియను ఆపేయండి. మీ వెంట్రుక ఆరోగ్యం మెరుగుపడేందుకు దానికి తగిన పోషకాలు అందేలా విటమిన్ బి12, బయోటిన్ ఎక్కువగా ఉండే సప్లిమెంట్స్ తీసుకోండి. మీరు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే మీరు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలు మీ వెంట్రుకలకు ఎక్కువగా అందుతుంటాయి. కొన్నాళ్లలో మీ వెంట్రుకల ఆరోగ్యం బాగుపడకపోతే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు మీకు తగిన చికిత్స చేసి జీవం కోల్పోయినట్లుగా మారిన వెంట్రుకలను మళ్లీ మామూలుగా మారేలా చూస్తారు. నా వయసు 24 ఏళ్లు. స్వాభావికంగానే నా వెంట్రుకలు రింగులు రింగులుగా, చిక్కుబడినట్లుగా అవుతాయి. ఎంత షాంపూ చేసుకున్నా అవి అలా చిక్కుబడినట్లుగానే అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - విజయకుమారి, బెంగళూరు కొందరి వెంట్రుకలు పుట్టుకతోనే ఇలా స్వాభావికంగా రింగులు తిరినట్లుగా ఉంటాయి. మీ వెంట్రుకలు చిక్కుబారినట్లుగా కాకుండా మామూలుగా ఉండటానికి ఈ సూచనలు పాటించండి. మీరు ఉపయోగించే షాంపూ తీవ్రమైనది కాకుండా చాలా మృదువైనది (మైల్డ్ షాంపూ) అయ్యేలా జాగ్రత్త తీసుకోండి. షాంపూ ఉపయోగించాక, మీరు కండిషనర్ రాసుకుంటుంటే, కేవలం వెంట్రుకలకు మాత్రమే అది అంటాలి తప్ప వెంట్రుక మూలాలకు కాదు. షాంపూ, కండిషనర్స్ వాడాక వెంట్రకలు కాస్త పొడిబారుతున్న సమయంలో లీవాన్ సీరమ్ వాడండి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే మీ సమీపంలోని ట్రైకాలజిస్ట్‌ను కలవండి. -
పేగు మూలకణాల గుట్టు రట్టు
లండన్:మనిషి పేగుల్లో ఉండే మూలకణాల గుట్టు రట్టయింది. పేగుల్లో ప్రౌఢ మూలకణాలు ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాయన్నది తొలిసారిగా క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో మనుషుల్లో పేగు కేన్సర్ తొలిదశల్లో ఎలా అభివృద్ధి చెందుతోందన్నది తెలుసుకునేందుకు వీలుకానుందట. ప్రౌఢ మూలకణాలలో మార్పులపై దృష్టిపెట్టిన వర్సిటీ పరిశోధకులు.. నిర్దిష్ట భాగంలో ఎన్ని మూలకణాలు ఉంటున్నాయి? వాటి మధ్య పోటీ ఎలా ఉంటోంది? అన్నది పరిశీలించారు. సాధారణ సందర్భాల్లో పేగులోని ఆయా భాగాల్లో తక్కువ మూలకణాలు మాత్రమే ఉండగా.. కేన్సర్ ఏర్పడిన చోట మాత్రం మూలకణాల సంఖ్య బాగా పెరుగుతోందని, అలాగే వాటి మధ్య మనుగడ కోసం పోటీ సైతం తీవ్రమవుతోందని వీరు కనుగొన్నారు.