శ్రీ ద్వారకా తిరుమల మహత్యం
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర పురాణం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘శ్రీ ద్వారకా తిరుమల మహత్యం’. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి బీఎన్వీ ప్రసాద్ దర్శకుడు.
గుమ్మళ్ల కనకదుర్గ, పరిమిశెట్టి శైలజారాణి నిర్మాతలు. ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు విజయదశమి రోజు జరుగనున్నాయి.
ద్వారకా తిరుమలేశుని మహిమలు ప్రేక్షకులను ఆనందలోకాల్లో విహరింపజేస్తాయని, అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ జరిపి, డిసెంబర్లో పాటల్ని విడుదల చేసి జనవరి 11న వైకుంఠ ఏకాదశి కానుకగా సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.